Twitter Blue Verified Tick : ట్విట్టర్ బ్లూ టిక్‌కు డబ్బులు చెల్లించేది లేదు.. తెగేసి చెప్పిన టాప్ కంపెనీలు, ప్రముఖులు.. ఎందుకో తెలుసా?

Twitter Blue Verified Tick : ట్విట్టర్‌లో బ్లూ టిక్ ఉండాలంటే డబ్బులు కట్టాల్సిందేనని ఎలన్ మస్క్ కొత్త ఫిట్టింగ్ పెట్టాడు. బ్లూ టిక్ ఫ్రీ అని చెప్పి.. ఇప్పుడు డబ్బులు కట్టమని మస్క్ అనేసరికి టాప్ కంపెనీలు, సెలబ్రిటీలు ఏకిపారేస్తున్నారు.

Twitter Blue Verified Tick : ట్విట్టర్ బ్లూ టిక్‌కు డబ్బులు చెల్లించేది లేదు.. తెగేసి చెప్పిన టాప్ కంపెనీలు, ప్రముఖులు.. ఎందుకో తెలుసా?

Twitter Blue Verified Tick Photo : (Google)

Twitter Blue Verified Tick : ప్రపంచ బిలియనీర్, ట్విట్టర్ బాస్ ఎలన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ టేకోవర్ చేసినప్పటి నుంచి సరికొత్త నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ట్విట్టర్ అకౌంట్లో బ్లూ వెరిఫైడ్ టిక్ (Twitter Blue Tick) మార్క్ సర్వీసు గత ఏడాది చివరిలో ప్రవేశపెట్టింది. కానీ, మస్క్ వచ్చిన తర్వాత ట్విట్టర్ ప్లాట్‌ఫారంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. మొన్నటివరకూ బ్లూ టిక్ ఉచితంగా అందించిన ట్విట్టర్.. ఇప్పుడు డబ్బులు చెల్లించమని అంటోంది.

ఈ విషయంలో చాలా మంది సెలబ్రిటీలు, టాప్ కంపెనీలు బ్లూ టిక్ వెరిఫికేషన్ కోసం చెల్లించేది లేదంటూ తెగేసి చెబుతున్నాయి. బ్లూ టిక్ వెరిఫికేషన్ విషయంలో తగ్గేదెలే అన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎలన్ మస్క్ ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ చెక్‌మార్క్‌ను పలు అకౌంట్లలో తొలగిస్తోంది. ఎవరైతే బ్లూ టిక్ కోసం డబ్బులు చెల్లిస్తారో ఆయా యూజర్లకు మాత్రమే బ్లూ టిక్ కొనసాగిస్తామని ప్రకటించారు. అయితే, ఈ బ్లూ టిక్ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నవారికి మాత్రమే లగ్జరీగా ఉంటుందని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. అదే సమయంలో అమెరికాలోని ప్రముఖ వార్తా సంస్థలు తమ బ్లూ చెక్‌మార్క్‌ను కోల్పోయాయి.

Read Also :  Twitter Blue Tick: వెరిఫైడ్‌ బ్యాడ్జ్‌ను కోల్పోయిన న్యూయార్క్ టైమ్స్.. మస్క్ ఎందుకలా చేశాడంటే?

న్యూయార్క్ టైమ్స్ వెరిఫైడ్ టిక్ తొలగింపు :
ఎందుకంటే.. అడ్వాన్స్డ్ బ్లూ టిక్ సబ్‌స్ర్కిప్షన్ కోసం డబ్బులు చెల్లించకూడదని ఆయా కంపెనీలు నిర్ణయం తీసుకోవడమే కారణంగా చెప్పవచ్చు. ఇప్పటికే న్యూయార్క్ టైమ్స్ (NewYork Times), వాషింగ్టన్ పోస్ట్, లాస్ ఏంజిల్స్ టైమ్స్ వంటి వార్తా సంస్థలు సైతం బ్లూ టిక్ కోసం ఎలాంటి చెల్లింపులు చేసేది లేదని ఇప్పటికే ప్రకటించాయి. ఆ తర్వాత వెంటనే, ఎలన్ మస్క్ న్యూయార్క్ టైమ్స్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ‘Gold Tick’ని ‘propaganda‘ అనే పేరుతో తొలగించాడు. న్యూయార్క్ టైమ్స్ వెరిఫైడ్ ‘గోల్డ్’ చెక్‌మార్క్ కోసం ధరను చెల్లించకూడదని నిర్ణయించుకుంది.

Twitter Blue Verified Tick _ Why top organisations, celebrities don't want to pay Elon Musk for Twitter Blue verified tick

Twitter Blue Verified Tick : Why top organisations, celebrities don’t want to pay Elon Musk for Twitter Blue verified tick Photo : (Google)

వాస్తవానికి ట్విట్టర్ బ్లూ టిక్ పొందాలంటే టాప్ కంపెనీలు నెలకు ధర 1000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ప్రతి అనుబంధ అకౌంటుకు 50 డాలర్లు చెల్లించాలి. అంతేకాదు.. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ పొందాలంటే.. జర్నలిస్టు చెల్లింపులను రిపోర్టింగ్ చేయాల్సిన సందర్భాల్లో మాత్రమే చెల్లిస్తామని కంపెనీ ప్రకటించింది. ట్విటర్‌లో దాదాపు 55 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగిన న్యూయార్క్ టైమ్స్, @nytimesతో సహా దాని సంస్థాగత అకౌంట్ల కోసం వెరిఫై చేసిన బ్యాడ్జ్‌కు సైతం డబ్బులు చెల్లించేది లేదని కంపెనీ స్పష్టం చేసింది. టైమ్స్ తమ జర్నలిస్టుల అకౌంట్లకు కూడా బ్లూ టిక్ కోసం డబ్బులు చెల్లించబోమని పేర్కొంది.

బ్లూ టిక్ కోసం చెల్లించేందుకు సంస్థలు ఎందుకు రెడీగా లేవంటే? :
ట్విట్టర్ కంపెనీ అందించే లెగసీ వెరిఫికేషన్ ప్రోగ్రామ్‌ను దశలవారీగా నిలిపివేయాలని ట్విట్టర్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అనేక సంస్థలు, సెలబ్రిటీల్లో ఆందోళనకు గురిచేస్తోంది. ట్విట్టర్ బ్లూ టిక్ వెరిఫికేషన్ పొందాలంటే తప్పక సబ్‌స్ర్కిప్షన్ పొందాల్సిందే.. అంటే.. కంపెనీలు, సెలబ్రిటీలు చెల్లించకపోవడానికి ఇదే కారణం కావొచ్చు. వాస్తవానికి.. సంస్థలు చెల్లించడానికి ఇష్టపడకపోవడానికి ప్రధాన కారణం ఇది కాకపోవచ్చు. వార్తా సంస్థలపై విశ్వసనీయతను పెంచడంలో బ్లూ చెక్‌మార్క్ పాత్ర ఎంతమాత్రం ఉండదని భావించవచ్చు. (Twitter) కొత్త సంస్థల కోసం వెరిఫికేషన్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్త సర్వీసు అమల్లోకి వచ్చింది.

లాస్ ఏంజిల్స్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్‌తో సహా పలు ప్రముఖ సంస్థలు ఈ సర్వీసు కోసం ఎలాంటి చెల్లింపులు చేయడం లేదని ధృవీకరించాయి. లాస్ ఏంజిల్స్ టైమ్స్ వెరిఫికేషన్ ఇకపై వినియోగదారుల్లో ఎలాంటి విశ్వసనీయతను పెంచదని పేర్కొంది. వాషింగ్టన్ పోస్ట్ కూడా వెరిఫికేషన్ మార్క్ కంపెనీ ఐడెంటిటీని సూచించదని పేర్కొంది. వార్తా సంస్థలతో పాటు, NBA ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్, నటుడు విలియం షార్ట్‌నర్ వంటి ప్రముఖులు కూడా బ్లూ కలర్ చెక్‌మార్క్‌ అక్కర్లేదని అంటున్నారు. ట్విట్టర్ లెగసీ వెరిఫికేషన్ ప్రోగ్రామ్‌ను దశలవారీగా తొలగించి.. పేమెంట్ సర్వీసును యూజర్లకు అందించాలనే నిర్ణయంగా కనిపిస్తోంది.

Read Also : Twitter Blue Ticks : మీ ట్విట్టర్ అకౌంట్‌కు బ్లూ టిక్ ఉందా? ఏప్రిల్ 1 నుంచి ‘బ్లూ టిక్ మార్క్’ కనిపించదు.. వెంటనే ఇలా వెరిఫై చేసుకోండి..!