Twitter Blue Tick: వెరిఫైడ్‌ బ్యాడ్జ్‌ను కోల్పోయిన న్యూయార్క్ టైమ్స్.. మస్క్ ఎందుకలా చేశాడంటే?

న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. బ్లూ కలర్ చెక్ మార్క్ కోసం మేము ఎలాంటి రుసుము చెల్లించలేదని తెలిపారు. తప్పనిసరి రిపోర్టింగ్ సమయాల్లో మినహాయిస్తే తమ సంస్థకు చెందిన జర్నలిస్టుల కొరకు బ్లూ కలర్ చెక్ మార్క్ చెల్లింపులు చేయడం లేదని చెప్పారు.

Twitter Blue Tick: వెరిఫైడ్‌ బ్యాడ్జ్‌ను కోల్పోయిన న్యూయార్క్ టైమ్స్.. మస్క్ ఎందుకలా చేశాడంటే?

Elon Musk (Photo : Twitter)

Twitter Blue Tick: ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రముఖ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ ట్విటర్ ఖాతా నుంచి బ్లూ టిక్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ తొలగించేశాడు. ఏప్రిల్ 1 నుంచి ట్విటర్‌లో బ్లూ కలర్ చెక్‌మార్క్‌ను పొందాలంటే ట్విటర్ బ్లూకు సభ్యత్వాన్ని కోనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం నెలకు ఎనిమిది డాలర్లు చెల్లించాలి. కానీ న్యూయార్క్ టైమ్స్ మాత్రం సభ్యత్వ రుసుము చెల్లించలేమని చెప్పింది. దీంతో ఎలాన్ మస్క్ న్యూయార్క్ టైమ్స్ ట్విటర్ ఖాతానుంచి బ్లూ టిక్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ తొలగించేశారు.

Twitter Blue Ticks : మీ ట్విట్టర్ అకౌంట్‌కు బ్లూ టిక్ ఉందా? ఏప్రిల్ 1 నుంచి ‘బ్లూ టిక్ మార్క్’ కనిపించదు.. వెంటనే ఇలా వెరిఫై చేసుకోండి..!

న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. బ్లూ కలర్ చెక్ మార్క్ కోసం మేము ఎలాంటి రుసుము చెల్లించలేదని తెలిపారు. తప్పనిసరి రిపోర్టింగ్ సమయాల్లో మినహాయిస్తే తమ సంస్థకు చెందిన జర్నలిస్టుల కొరకు బ్లూ కలర్ చెక్ మార్క్ చెల్లింపులు చేయడం లేదని చెప్పారు. అయితే, న్యూయార్క్ టైమ్స్ బాటలో మరికొన్ని సంస్థలు చేరిపోయాయి. మేముకూడా ట్విటర్ బ్లూ కలర్ చెక్ మార్క్ చెల్లింపులు చేయమని చెప్పేశాయి.

Pakistan Twitter Account Blocked: భారత్‌లో పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విటర్ ఖాతా బ్లాక్..! ఎందుకంటే..

వాటిల్లో లాస్ ఏంజిల్స్ టైమ్స్, వోక్సో మీడియా, వాషింగ్టన్ పోస్ వంటి మీడియా సంస్థలతో పాటు ఫుట్ బాల్ ప్లేయర్ లిబ్రన్ జేమ్స్ వంటివారు కూడా ఉన్నారు. అయితే, ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ మాత్రం కేవలం న్యూయార్క్ టైమ్స్అధికారిక ట్విటర్ ఖాతా నుంచి మాత్రమే బ్లూ టిక్ చెక్ మార్క్ ను తొలగించడం గమనార్హం. ది ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం.. అమెరికాలో దాదాపు 1.80లక్షల మంది ట్విటర్ బ్లూ కలర్ చెక్ మార్క్ పొందేందుకు ప్రతీనెలా డబ్బులు చెల్లిస్తున్నారు.