Twitter Blue Ticks : మీ ట్విట్టర్ అకౌంట్‌కు బ్లూ టిక్ ఉందా? ఏప్రిల్ 1 నుంచి ‘బ్లూ టిక్ మార్క్’ కనిపించదు.. వెంటనే ఇలా వెరిఫై చేసుకోండి..!

Twitter Blue Ticks : ఏప్రిల్ 1 నుంచి ట్విట్టర్ అకౌంట్లలో వెరిఫైడ్ బ్లూ టిక్స్ తొలగించనుంది. మీ వెరిఫైడ్ స్టేటస్ సేవ్ చేసేందుకు Twitter బ్లూ సబ్‌స్ర్కిప్షన్ కొనుగోలు చేయడమే ఏకైక మార్గం. ఆండ్రాయిడ్ ఫోన్లు లేదా ఐఫోన్లలో ధర రూ.900కు పొందవచ్చు.

Twitter Blue Ticks : మీ ట్విట్టర్ అకౌంట్‌కు బ్లూ టిక్ ఉందా? ఏప్రిల్ 1 నుంచి ‘బ్లూ టిక్ మార్క్’ కనిపించదు.. వెంటనే ఇలా వెరిఫై చేసుకోండి..!

Twitter Blue Ticks _ Twitter to remove blue ticks from accounts on April 1, here is what you need to do

Twitter Blue Ticks : ట్విట్టర్ వెరిఫైడ్ అకౌంట్ యూజర్లకు అలర్ట్.. మీ ట్విట్టర్ అకౌంటుకు బ్లూ టిక్ ఉందా? అయితే, ఏప్రిల్ 1 నుంచి వెరిఫైడ్ ట్విట్టర్ అకౌంట్లలో బ్లూ టిక్ కనిపించదు. ఎందుకంటే.. (Twitter Blue Tick) అని పిలిచే లెగసీ వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను ట్విట్టర్ అకౌంట్ల నుంచి తొలగించనుంది. తద్వారా ట్విట్టర్ తమ బ్లూ టిక్ సేల్స్ పెంచుకోనుంది. గత ఏడాదిలో ఎలన్ మస్క్ (Elon Musk) ద్వారా ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత, కంపెనీ యూజర్‌బేస్, ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త ప్రణాళికలను ప్రకటించింది. కంపెనీ ప్రకటించిన కీలక అప్‌డేట్‌లలో ఒకటి..

ట్విట్టర్ బ్లూ సబ్‌స్ర్కిప్షన్ (Twitter Blue Subscription). ట్విట్టర్ అందించే బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌లో లాంగ్-ఫార్మ్ ట్వీట్‌లు (280 అక్షరాలకు పైగా), ట్వీట్‌లను (Undo/Edit) చేయడం వంటి డిమాండ్ ఉన్న ఫీచర్‌లు ఉన్నాయి. ఆ తర్వాత, సబ్‌స్క్రిప్షన్‌ను మరింత ఆకర్షణీయంగా అందించడానికి ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ (Twitter Blue Users) బ్లూ టిక్‌ను అందించనుందని మస్క్ చెప్పాడు. మరో మాటలో చెప్పాలంటే.. ట్విట్టర్ యూజర్లు తమ మొబైల్ నంబర్‌ను అందించడంతో పాటు నెలవారీ రుసుమును చెల్లించడం ద్వారా ట్విట్టర్ బ్లూ టిక్ వెరిఫై చేసుకోవచ్చు.

Twitter Blue Ticks _ Twitter to remove blue ticks from accounts on April 1, here is what you need to do

Twitter Blue Ticks _ Twitter to remove blue ticks from accounts on April 1, here is what you need to do

ట్విట్టర్‌లో వెరిఫైడ్ స్టేటస్ ఎలా సేవ్ చేయాలంటే? :
లెగసీ అకౌంట్ల నుంచి వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను తొలగించాలనే ట్విట్టర్ నిర్ణయం వెనక మస్క్ గ్రాండ్ ఏప్రిల్ ఫూల్ (April Fool) అయి ఉంటుందని అందరూ భావించారు. కానీ, అది ఊహాగానాలు మాత్రమే. ట్విట్టర్ తమ నిర్ణయానికి కట్టుబడి ఉంది. లెగసీ అకౌంట్లలో బ్లూ టిక్ మార్క్‌ను తొలగించనుంది. మీ వెరిఫైడ్ అకౌంట్ స్టేటస్ సేవ్ చేసేందుకు ప్రస్తుతం ఉన్న ఏకైక మార్గం ఒకటే.. (Twitter Blue) సభ్యత్వాన్ని కొనుగోలు చేయడమే. మీకు ఆండ్రాయిడ్ ఫోన్లు లేదా ఐఫోన్లు ఉంటే.. ధర రూ.900 చెల్లించడం ద్వారా ట్విట్టర్ బ్లూ టిక్ పొందవచ్చు.

Read Also : Twitter Blue: ఇండియాలో ట్విట్టర్ బ్లూ నెలకు రూ.9,400.. ఏప్రిల్ 1 నుంచి అమలు

అదేవిధంగా, వెబ్ (Web) ద్వారా సబ్‌స్క్రయిబ్ చేస్తే.. ధర రూ. 650కి తగ్గుతుంది. వెబ్ సబ్‌స్క్రైబర్‌లు (Twitter Web Subscribers) ఎలాంటి ఫీచర్‌లను కోల్పోవాల్సి ఉండదు. అయితే, యాప్‌లో కొనుగోళ్లపై (Microsoft) బ్రౌజర్ డెవలపర్‌ల నుంచి ఎలాంటి కమీషన్ ఉండదు. అందుకే ఇది చాలా చౌకగా ఉంటుంది. మీరు ఏదైనా సబ్‌స్క్రిప్షన్ లేదా యాప్ సర్వీస్‌ను కొనుగోలు చేస్తే.. (Apple), (Google) 30 శాతం కమీషన్ రుసుమును వసూలు చేస్తాయి. మరోవైపు, ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ కారణంగా వెరిఫై అయిన యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సబ్‌స్క్రిప్షన్ యాక్టివ్‌గా ఉన్నంత వరకు బ్లూ టిక్ మీ ప్రొఫైల్‌లో అలాగే ఉంటుందని గమనించాలి.

ట్విట్టర్ బ్యాడ్జ్‌లు (Twitter Badges) :
ట్విట్టర్ అకౌంట్లో బ్లూ సబ్‌స్క్రిప్షన్ లేనప్పుడు ట్విట్టర్ లెగసీ అకౌంట్ల నుంచి Twitter బ్లూ టిక్‌ను తొలగించినా. దీనికి మరో ఆప్షన్ ఉంది. ట్విట్టర్‌లో బ్రాండ్‌లు, పబ్లికేషన్‌లు తమను తాము గుర్తించుకోవడంలో సాయపడే ‘Verified Organisations’ ని Twitter రూపొందిస్తోంది. బ్రాండ్ పేజీలో ప్రొఫైల్ పేజీ Apple అని ఉంటే.. కంపెనీ లోగోను సూచించే ప్రత్యేక బ్యాడ్జ్‌ను పొందుతుంది. అంతేకాదు.. సొంత ఉద్యోగులను ధృవీకరించే సామర్థ్యాన్ని కంపెనీలకు కూడా విస్తరిస్తున్నట్లు ట్విట్టర్ పేర్కొంది. ఫలితంగా, సంస్థతో అనుబంధంగా ఉన్న ఉద్యోగులు కూడా కంపెనీ లోగోను కలిగి ఉన్న బ్యాడ్జ్‌ను పొందవచ్చు.

ఇప్పటికే స్పోర్ట్స్ టీమ్‌లు, వార్తా సంస్థలు, ఆర్థిక సంస్థలు, ఫార్చ్యూన్ 500 కంపెనీలు, లాభాపేక్ష లేని సంస్థలు వెరిఫైడ్ సంస్థలలో చేరడంతో పాటు వారి అనుబంధ అకౌంట్లను వారి ప్రొఫైల్‌లలో పబ్లిక్‌గా లిస్టు చేస్తోందని కంపెనీ వెల్లడించింది. ఇప్పటినుంచి వెరిఫైడ్ సంస్థలు అన్ని అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు వెయిట్‌లిస్ట్ నుంచి ఆమోదించిన సంస్థలకు ఈ-మెయిల్ ఇన్విటేషన్లను పంపుతున్నామని ట్విట్టర్ తెలిపింది. కంపెనీలు ‘Verified Organisations’ కోసం ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Read Also : IPL 2023 Livestream : రిలయన్స్ జియో ఐపీఎల్ ప్లాన్లు ఇవే.. ఆన్‌లైన్‌లో ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లను లైవ్‌లో చూడొచ్చు..!