IPL 2023 Livestream : రిలయన్స్ జియో ఐపీఎల్ ప్లాన్లు ఇవే.. ఆన్‌లైన్‌లో ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లను లైవ్‌లో చూడొచ్చు..!

IPL 2023 Livestream : 2023 ఏడాదిలో OTT ప్లాట్‌ఫారమ్‌ల కోసం సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. IPL 2023ని ఆన్‌లైన్‌లో ఉచితంగా వీక్షించవచ్చు. Reliance Jio స్ట్రీమింగ్ అర్హత ఉన్న యూజర్లకు 5G కనెక్టివిటీని కూడా అందిస్తోంది.

IPL 2023 Livestream : రిలయన్స్ జియో ఐపీఎల్ ప్లాన్లు ఇవే.. ఆన్‌లైన్‌లో ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లను లైవ్‌లో చూడొచ్చు..!

IPL 2023 Livestream _ Reliance Jio Plans, Where and how to watch IPL matches live online, Check All details

IPL 2023 Livestream : ఐపీఎల్ 2023 సీజన్‌కు సమయం ఆసన్నమైంది. మార్చి 31 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ ఎడిషన్ ప్రారంభం కానుంది. క్రికెట్ ప్రియులు తమ ఇళ్ల వద్ద నుంచే టీవీలో లేదా ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లను లైవ్‌లో చూడొచ్చు.. అయితే, OTTలో లైవ్ స్ట్రీమింగ్ రైట్స్ ఈ ఏడాదిలో (Hotstar) కాదని గమనించాలి. ఈ ఏడాదిలో ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ఐపీఎల్ 2023 లైవ్ స్ట్రీమింగ్ (Jio Cinema) హోస్ట్ చేస్తోంది. వయాకామ్ (Viacom 18) బీసీసీఐ (BCCI)కి రూ. 20,500 కోట్లు చెల్లించి ఈ సీజన్‌లో భారత్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు హక్కులను పొందింది.

క్రికెట్ లవర్స్ ఐపీఎల్ మ్యాచ్‌లను ఆన్‌లైన్‌లో లేదా టీవీల ద్వారా లైవ్‌లో వీక్షించవచ్చు. మీరు కూడా మీ ఇంటి వద్ద నుంచే IPL మ్యాచ్‌లను చూడాలనుకుంటున్నారా? మీరు మ్యాచ్‌లను ఆన్‌లైన్‌లో లేదా టీవీలో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు. ఇంతకీ, IPL మ్యాచ్‌లను ఆన్‌లైన్‌లో టీవీలో ఎక్కడ ఎలా చూడవచ్చు అనే వివరాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

ఐపీఎల్ మ్యాచ్‌లను ఆన్‌లైన్‌లో ఎలా చూడాలంటే? :
ఈసారి IPL 2023 టోర్నీపై వయాకామ్ 18 డిజిటల్ హక్కులను పొందింది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో 12 వేర్వేరు భాషల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. IPL లైవ్ స్ట్రీమింగ్ కోసం గేమ్‌ను మారుస్తూ IPL 2023ని ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు (Jio Cinema) ప్రకటించింది. ఇందులో మొత్తం 410 మ్యాచ్‌లను 4K రిజల్యూషన్‌లో, మల్టీ కెమెరా యాంగిల్స్‌తో ఉచితంగా అందిస్తుంది.

Read Also : IPL 2023 : IPL ఓపెనింగ్ మ్యాచ్ లో.. రష్మిక మందన్నా, తమన్నా స్పెషల్ పర్ఫార్మెన్స్..

వినియోగదారులు స్కోర్, పిచ్ హీట్ మ్యాప్ వంటి ఫీచర్లను కూడా యాక్సెస్ చేయవచ్చు. అదనంగా, మ్యాచ్‌లు OTT సబ్‌స్ర్కిప్షన్ అవసరం లేకుండా అన్ని టెలికాం ఆపరేటర్‌లలో ఇంగ్లీష్, తమిళం, హిందీ, తెలుగు, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, భోజ్‌పురితో సహా 12 భాషల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. జియో సినిమా ఈ సీజన్‌లో మల్టీక్యామ్ ఫీచర్‌ (multicam feature)ను కూడా ఉచితంగా అందిస్తోంది.

IPL 2023 Livestream _ Reliance Jio Plans, Where and how to watch IPL matches live online, Check All details

IPL 2023 Livestream : Reliance Jio Plans, Where and how to watch IPL matches live online

Jio 3GB డేటాతో ప్లాన్ ఇదే :
రిలయన్స్ జియో (Reliance Jio) రూ. 219, రూ. 399, రూ. 999 ధరలతో 3 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లు 3GB రోజువారీ డేటా క్యాప్, అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS, 5G బెనిఫిట్స్‌తో 40GB వరకు డేటాను అందిస్తాయి.

* రూ. 219 ప్లాన్ : 14 రోజుల పాటు వ్యాలిడిటీ అందిస్తుంది. ఉచితంగా 2GB డేటా-యాడ్-ఆన్ వోచర్‌ను అందిస్తుంది.
* రూ. 399 ప్లాన్ : 28 రోజుల పాటు వ్యాలిడిటీని అందిస్తుంది. ఉచితంగా 6GB డేటా యాడ్-ఆన్ వోచర్‌ను అందిస్తుంది.
* రూ. 999 ప్లాన్ : 84 రోజుల వరకు వ్యాలిడిటీ అందిస్తుంది. లిమిటెడ్ టైమ్ వరకు మాత్రమే ఉచితంగా 40GB డేటా యాడ్-ఆన్ వోచర్‌ను అందిస్తుంది.

ఈ ప్లాన్‌లన్నీ Jio 5G వెల్‌కమ్ ఆఫర్ (Jio Welcome Offer) ద్వారా పొందవచ్చు. అర్హత కలిగిన జియో యూజర్లు హైస్పీడ్ 5G నెట్‌వర్క్‌లో ఉచితంగా ఇంటర్నెట్ డేటాను పొందవచ్చు. అదనంగా, జియో అందించే రూ. 222, రూ. 444, రూ. 667 ధరల కొత్త డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌లను ఆన్‌లైన్‌లో చూసేటప్పుడు డేటా వెంటనే అయిపోతుంది. అందుకే జియో అందించే ఈ ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా నిరంతరాయంగా ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించవచ్చు.

* రూ.222 ప్లాన్ : ప్రస్తుత యాక్టివ్ ప్లాన్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు 50GB డేటాను పొందవచ్చు.
* రూ.444 ప్లాన్ : 60 రోజుల (2 నెలలు) పాటు 100GB డేటాను పొందవచ్చు.
* రూ.667 ప్లాన్ : 90 రోజుల ( 3 నెలలు) పాటు 150GB డేటాను పొందవచ్చు.
జియో యూజర్లు (My Jio) యాప్ లేదా Jio అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ప్లాన్లను కొనుగోలు చేయొచ్చు.

Read Also : IPL 2023 : ఏ రోజు ఏ జట్టు మ్యాచ్ ఎవరితో, ఎక్కడ జరుగుతుంది.. IPL మ్యాచ్‌ల ఫుల్ డీటెయిల్స్..