మేం ఊరుకోం, తగలబెట్టేస్తాం.. 2025లో ప్రభుత్వాలను పడగొట్టిన జెన్ జీ.. అన్ని దేశాలకు ఎలా విస్తరించింది? 2026లో ఇక..
నల్లటి వస్త్రంపై టోపీతో కూడిన కపాల అస్థిపంజరం గుర్తును ముద్రించి.. ఆ గుర్తుతోనే వారు 2025లో నిరసనలు తెలిపారు. జపాన్ మాంగా సిరీస్ “వన్ పీస్” నుంచి తీసుకున్న చిహ్నం ఇది.
Gen Z protests
Generation Zee: నేపాల్ నుంచి పెరూ వరకు… మొరాకో నుంచి మడగాస్కర్ వరకు ఆయా దేశాల్లో తమ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా 2025లో జెన్ జీ చేసిన నిరసనలను చరిత్ర ఎన్నటికీ మర్చిపోలేదు.
జెన్ జీ (Generation Zee లేదా Gen Z) అంటే 1990 దశకం చివరి నుంచి 2010 దశకం ప్రారంభం మధ్య జన్మించిన తరం మనుషులు. వీళ్లని జూమర్స్ అని కూడా అంటారు. వీళ్లు పుట్టుకపోతోనే ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌ల మధ్య పెరిగారు.
డిస్కోర్డ్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సామాజిక మాధ్యమాలను జెన్ జీ తెగవాడేస్తారు. వాటినే ఉద్యమ విస్తరణకు వేదికగా చేసుకున్నారు.
ప్రభుత్వాల అవినీతిని జెన్ జీ సహించడం లేదు. నల్లటి వస్త్రంపై టోపీతో కూడిన కపాల అస్థిపంజరం గుర్తును ముద్రించి.. ఆ గుర్తుతోనే వారు 2025లో నిరసనలు తెలిపారు. జపాన్ మాంగా సిరీస్ “వన్ పీస్” నుంచి తీసుకున్న చిహ్నం ఇది. అందులో స్ట్రా హ్యాట్ దొంగలు అనే పాత్రలకు చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా ఇది పాపులర్.
ప్రపంచంలో దాదాపు 12 దేశాల్లో జరిగిన నిరసనల్లో ఈ చిహ్నమే కనిపించింది. ప్రపంచం మొత్తం జెన్ జీ నిరసనలు ప్రభుత్వాలకు ఎదురు నిలిచాయి, రెండు ప్రభుత్వాలు కూలిపోయాయి.
ఈ సంవత్సరం నిరుద్యోగం, పేదరికం, అసమానతలపై నిరాశ చెందిన యువత నడిపిన తిరుగుబాట్లకు సూచనగా వారి ఉద్యమం నిలిచింది.
లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా ఈ మూడు ఖండాల్లో యువత వీధుల్లోకి వచ్చి ప్రభుత్వాలను కుదిపేసింది. యునైటెడ్ నేషన్స్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతాల్లో 60 శాతం జనాభా 25 ఏళ్లలోపువారే. మడగాస్కర్, నేపాల్లో జెన్ జీ ఉద్యమం వల్ల ప్రభుత్వాలు కూలాయి.
“చాలా మంది జెన్ జీలాగే నేను వన్ పీస్‌తో పెరిగాను. అందుకే అది మా గుర్తుగా మారింది” అని మడగాస్కర్‌లో 26 ఏళ్ల నిరసనకారుడు ఖై అన్నారు. ప్రజలను అణిచివేతకు గురిచేసే ప్రభుత్వాలపై ప్రతిఘటనగా దీన్ని చూశామని ఖై చెప్పారు.
మడగాస్కర్‌లో జెన్ జీ తిరుగుబాటు, 2025 సెప్టెంబర్‌లో నేపాల్‌లో జరిగిన నిరసనల తర్వాత వచ్చింది. “నేపాల్ దారి చూపింది. ఏమి జరిగిందో చూశాం” అని మడగాస్కర్ ఉద్యమ ప్రతినిధి ఎలియట్ రాండ్రియామండ్రాటో అన్నారు.
ఈ ఏడాది జెన్ జీ ఉద్యమం చాలా పాపులర్ అయింది. అయితే, 2010లో అరబ్ స్ప్రింగ్, 2011లో స్పెయిన్‌లో ఇండి గ్నాడోస్ వంటి ఉద్యమాలు కూడా జరిగాయి. యువతే ఈ నిరసనలు చేపట్టింది. జెన్ జీ ఉద్యమం అందుకు భిన్నంగా ఉందని మాంట్రియల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త సెసిల్ వాన్ డె వెల్డే చెప్పారు.
