Money Saving Tips : మీకు నెలకు రూ. 25వేలు జీతం వచ్చినా రూ. 72వేలు సేవ్ చేయొచ్చు.. ఈ సీక్రెట్ ఫార్ములా తెలిస్తే అందరూ కోటీశ్వరులే..!

Money Saving Tips : రూ. 25వేల జీతం ఉన్నప్పటికీ, ఏడాదికి రూ. 72వేలు ఆదా చేయడం కష్టం కాదు. సరైన బడ్జెట్, ఖర్చుల నియంత్రణ, స్మార్ట్ పెట్టుబడితో ఇలా ధనవంతులు అవ్వొచ్చు.

Money Saving Tips : మీకు నెలకు రూ. 25వేలు జీతం వచ్చినా రూ. 72వేలు సేవ్ చేయొచ్చు.. ఈ సీక్రెట్ ఫార్ములా తెలిస్తే అందరూ కోటీశ్వరులే..!

Money Saving Tips

Updated On : November 26, 2025 / 6:44 PM IST

Money Saving Tips : ప్రస్తుత రోజుల్లో డబ్బులు సంపాదించడమే కష్టం.. ఇంకా సేవింగ్ చేయడం సాధ్యమా? అంటారా? అందులోనూ నెలకు రూ. 25వేల జీతంతో జీవించడం అంత సులభం కాదు. ఇంటి అద్దె, ఫుడ్, విద్యుత్, నీటి బిల్లులతో పాటు కొన్నిసార్లు చిన్న చిన్న సరదాల కోసం అన్నీ కలిపి ఒక నెల ఖర్చులు భారీగా ఉంటాయి. వచ్చే జీతం కన్నా ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. కానీ, సరైన ప్లానింగ్ చేసుకుంటే మీ ఈ చిన్న జీతంలో నెలకు రూ. 4వేల నుంచి రూ. 6వేలు ఆదా చేయవచ్చని మీకు తెలుసా?

మీరు ఒక ఏడాదిలో రూ. 48వేల నుంచి రూ. 72వేలు ఆదా చేయవచ్చు. ఇదేమి మ్యాజిక్ కాదు.. లక్షలాది మంది ఇదే ఫాలోవుతున్నారు. మీరు తక్కువ ఆదాయంతో ఎలా డబ్బులు ఆదా చేయాలా అని చూస్తుంటే ఈ స్టోరీ మీకోసమే.. ఎలా సేవింగ్ చేయాలి? ఏ తప్పులను నివారించాలి? దీర్ఘకాలికంగా మీ సేవింగ్స్ కోసం ఎలా పెంచుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

60-20-20 రూల్ ఫాలో అవ్వండి :
రూ. 25వేల జీతం సంపాదించేవారికి 60-20-20 రూల్ బెటర్. అంటే, 60 శాతం (సుమారు రూ. 15వేలు) ముఖ్యమైన ఖర్చులకు, 20 శాతం (రూ. 5వేలు) సేవింగ్, మిగిలిన 20 శాతం (రూ. 5వేలు) వినోదం లేదా చిన్నపాటి ఖర్చులకు కేటాయించవచ్చు. ముఖ్యమైన ఖర్చులలో ఇంటి అద్దె (రూ.5వేలు నుంచి రూ.7వేలు), కిరాణా సామాగ్రి (రూ.4వేలు నుంచి రూ. 5వేలు), విద్యుత్ గ్యాస్ (రూ. 1,000 నుంచి రూ. 2వేలు) ప్రయాణ ఖర్చులు (రూ. 2వేలు) ఉంటాయి.

ముందుగా మీ సేవింగ్స్ పక్కన పెట్టండి. మీ జీతం వచ్చిన వెంటనే రూ. 4వేలు నుంచి రూ.5వేలకు ప్రత్యేక బ్యాంకు అకౌంటుకు ట్రాన్స్‌ఫర్ చేయండి. నెలాఖరులో కొంత సేవింగ్స్ ఉంచుకోవచ్చు. మీరు ముందుగా ఖర్చు చేస్తే.. సేవింగ్ చేయడం అసాధ్యమని గుర్తుంచుకోండి.

మీ ఖర్చులను తగ్గించుకోండి :
చాలా సార్లు చిన్న ఖర్చులు కూడా మీ జేబును ఖాళీ చేస్తాయి. ఉదాహరణకు.. బయట తినడం (నెలకు రూ.2వేల నుంచి రూ.3 వేలు) లేదా ఆన్‌లైన్ షాపింగ్ (రూ. 500 నుంచి రూ. 1000) కోసం ఖర్చు చేయాలి. వీటిని నివారించేందుకు ఇంట్లో ఆహారం వండుకుంటే నెలలో రూ. 2 వేల వరకు ఆదా చేయవచ్చు. లేకపోతే, మీరు బస్సు, రైలు లేదా సైకిల్‌లో ప్రయాణిస్తే.. మీరు పెట్రోల్‌పై రూ. వెయ్యి ఆదా చేస్తారు. విద్యుత్ బిల్లులను తగ్గించడానికి, LED బల్బులను వాడండి.

అనవసరమైన లైట్లు ఆఫ్ చేయండి. నెలకు రూ. 200 నుంచి రూ.300 ఆదా చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డును ఎక్కువగా వాడొద్దు. ఎందుకంటే.. వడ్డీలతో మీ సేవింగ్స్ మొత్తం అయిపోతాయి. దాంతో పాటు, వాల్‌నట్ లేదా మనీ మేనేజర్ వంటి యాప్‌లతో మీ రోజువారీ ఖర్చులను నోట్ చేసుకోండి. ఒక వారంలోపు ఎక్కడ తగ్గించాలో మీకు తెలుస్తుంది.

Read Also : Hyundai Car Discounts : కొత్త SUV కొంటున్నారా? హ్యుందాయ్ మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. ఈ పాపులర్ కార్లపై రూ. 7 లక్షల వరకు సేవింగ్..!

సేవింగ్స్ పెంచుకోండి.. పెట్టుబడులు పెట్టండి :
మీ డబ్బులు బ్యాంకులో ఉంచడం ద్వారా మాత్రమే సేవింగ్స్ పెరగవు. కానీ, తెలివిగా పెట్టుబడుల ద్వారా మాత్రమే సేవింగ్స్ పెరుగుతాయి. మీరు ప్రతి నెలా SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్)లో రూ. 4వేలు పెట్టుబడి పెడితే 12శాతం రాబడితో అది ఏడాదిలో రూ. 50వేల కన్నా ఎక్కువ కావచ్చు. అయితే, మ్యూచువల్ ఫండ్స్ లేదా PPF వంటి సేఫ్ ఆప్షన్లను ఎంచుకోండి. PPF 7శాతం వడ్డీని అందిస్తుంది. పన్ను రహితంగా కూడా ఉంటుంది.

మీరు ప్రతి నెలా రూ. 5వేలు పెట్టుబడి పెడితే మీరు 26 ఏళ్లలో రూ. 1 కోటి చేరుకోవచ్చు. FDలో రూ. 1,000, SIPలో రూ. 3,000 వంటి పెట్టుబడులను చిన్నగా మొదలుపెట్టండి. అత్యవసర పరిస్థితుల కోసం 3 నెలల నుంచి 6 నెలల ఖర్చులను (రూ. 75వేల నుంచి రూ. 1.5 లక్షలు) పక్కన పెట్టండి. పన్ను ఆదా కోసం సెక్షన్ 80Cని సద్వినియోగం చేసుకోండి. ELSS ఫండ్స్‌లో కూడా పెట్టుబడి పెట్టండి.

ఈ తప్పులు చేయవద్దు.. ఈ అలవాట్లతో డబ్బులు ఆదా :
చాలా మంది తమ జీతం వచ్చిన వెంటనే షాపింగ్ చేయడం లేదా స్నేహితులతో సరదా కోసం ఖర్చు చేస్తారు లేదా ఈఎంఐలకు, మొబైల్స్, బైక్‌లు కొనేందుకు ఖర్చు చేస్తారు. దాంతో సేవింగ్స్ మొత్తం జీరోకు తగ్గిపోతాయి. వివాహాలు లేదా పండుగలకు రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల ఖర్చు చేస్తుంటారు.

మీరు ప్రతి నెలా మీ అకౌంటులో రూ. 2వేల నుంచి రూ.3 వేల జమ చేస్తే.. మీరు ఏడాదికి రూ. 24వేల నుంచి రూ.36 వేలుజమ చేస్తారు. ఫ్యామిలీ సపోర్టు కూడా ముఖ్యమే. కానీ, మీ సేవింగ్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మీకు ఏదైనా అప్పు ఉంటే ముందుగా దాన్ని తిరిగి చెల్లించండి. ద్రవ్యోల్బణం గురించి మర్చిపోవద్దు. ఖర్చులు ప్రతి ఏడాది 5-7 శాతం పెరుగుతాయి. అందుకే మీ సేవింగ్స్ కూడా పెంచుకోండి.

రూ. 25వేల నుంచి రూ. 5 కోట్లు ఎలా సంపాదించాలి? :
ఏడాదికి రూ. 48వేల నుంచి రూ. 72 వేలు ఆదా చేయడం పెద్ద కష్టమేమి కాదు. కాంపౌండింగ్ మ్యాజిక్ చూస్తే ఒక వ్యక్తి 2013లో రూ. 25 వేల జీతంతో మొదలై 75 శాతం ఆదా చేయడం ద్వారా 11 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించుకోవచ్చు. మీ జీతం పెరిగేకొద్దీ మీరు కూడా మీ పెట్టుబడిని ఏటా 20 శాతం పెంచాలి. మీరు NPS లేదా రిటైర్మెంట్ ఫండ్‌లో పెట్టుబడి పెడితే.. మీకు 30 ఏళ్ల తర్వాత పెన్షన్ వస్తుంది. మీరు 30 ఏళ్ల వయస్సు కలిగి ఉంటే నెలకు రూ. 5వేల SIPతో 60 ఏళ్ల వయస్సులో రూ. 3 కోట్లకు పైగా సంపాదించుకోవచ్చు.

సేవింగ్ ప్లానింగ్.. ఈరోజే మొదలుపెట్టండి :
మీ సేవింగ్స్ కోసం ఈరోజే ప్లాన్ చేసుకోండి. ముందుగా, మీ జీతంలో 20శాతం వెంటనే పక్కన పెట్టి సేవింగ్ చేయండి. మీ ఖర్చులన్నింటినీ మొబైల్ యాప్‌లో రికార్డ్ చేయండి. తద్వారా మీరు అనవసరమైన ఖర్చులను ఈజీగా తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత SIP లేదా PPF వంటి సేఫ్ హై రిటర్న్స్ ఇచ్చే పథకాల్లో చేరండి. రూ. 25వేల రూపాయల జీతం అడ్డంకి కాదు. ఈ ఆదాయంతో లక్షలాది మంది ధనవంతులు అయ్యారు. మీరు కూడా ధనవంతులు కావచ్చు. మీకు ఉండాల్సందిల్లా కొంచెం క్రమశిక్షణ, ఆర్థిక స్థిరత్వం, చిన్న మొత్తంలో సేవింగ్స్ చేయడమే.. లాంగ్ టైమ్‌లో మీ లైఫ్ మార్చేయగలదు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీరు ఏదైనా పెట్టుబడి కోసం చూస్తుంటే మీకు తెలిసిన ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.