Maruti Suzuki Jimny Sales : కార్ల విక్రయాల్లో దూసుకుపోతున్న మారుతి సుజుకి.. జూన్లో 3వేల యూనిట్లకు పైగా జిమ్నీ సేల్స్..!
Maruti Suzuki Jimny Sales : మారుతి సుజుకి ఇండియా జూన్ 7న జిమ్నీని దేశ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ నెల మొత్తంలో కార్ల తయారీ సంస్థ 3వేల యూనిట్లకు పైగా ఆఫ్-రోడర్లను విక్రయించింది.
![Maruti Suzuki Jimny Sales : కార్ల విక్రయాల్లో దూసుకుపోతున్న మారుతి సుజుకి.. జూన్లో 3వేల యూనిట్లకు పైగా జిమ్నీ సేల్స్..! Maruti Suzuki Jimny Sales : కార్ల విక్రయాల్లో దూసుకుపోతున్న మారుతి సుజుకి.. జూన్లో 3వేల యూనిట్లకు పైగా జిమ్నీ సేల్స్..!](https://10tv.in/wp-content/uploads/2023/07/Maruti-Suzuki-Jimny-sales-at-over-3000-units-in-June.jpg)
Maruti Suzuki Jimny sales at over 3,000 units in June
Maruti Suzuki Jimny Sales : ప్రముఖ దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) జిమ్నీ సేల్స్ జూన్లో 3వేల యూనిట్లు పెరిగాయి. కంపెనీ సీనియర్ అధికారి ప్రకారం.. జిమ్నీ కస్టమర్లు సాధారణంగా అదనపు కార్లను కొనుగోలు చేసేవారు కొందరు ఉంటే.. మరికొందరు కారు రీప్లేస్మెంట్ కొనుగోలుదారులు ఉంటారు.
మొదటిసారి కొనుగోలు చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. జూన్ 7న జిమ్నీని దేశ మార్కెట్లో లాంచ్ చేసింది. మారుతి SUV మార్కెట్లో 25శాతం వాటాను సంపాదించాలనే లక్ష్యంతో జిమ్నీ కార్లను విక్రయించింది. జిమ్నీ కాకుండా, మారుతి ఫ్రాంక్స్, బ్రెజ్జా, గ్రాండ్ విటారా వంటి SUVలను విక్రయిస్తుంది.
మారుతి సుజుకి భారత అతిపెద్ద SUV తయారీదారుగా అవతరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని, ఇందులో కొత్త జిమ్నీ కారు కీలకమైన పాత్ర పోషిస్తుందని మారుతి ఎండీ, CEO హిసాషి టేకుచి పేర్కొన్నారు. మారుతి సుజుకి జిమ్నీ ధర రూ. 12.74 లక్షలతో మొదలై రూ. 15.05 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. జీటా, ఆల్ఫా వేరియంట్లలో అందిస్తోంది.
![Maruti Suzuki Jimny sales at over 3,000 units in June](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/07/Maruti-Suzuki-Jimny-sales-at-over-3000-units-in-June-1.jpg)
Maruti Suzuki Jimny sales at over 3,000 units in June
SUV జిమ్నీ పాత K15B 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. 105PS గరిష్ట శక్తిని, 134Nm గరిష్ట టార్క్ను అందిస్తుంది. ఇంజిన్ను 5-స్పీడ్ MT లేదా 4-స్పీడ్ ATతో అందిస్తుంది.మారుతి సుజుకి జిమ్నీ మైలేజ్ 5-స్పీడ్ MTకి 16.94kmpl, 4-స్పీడ్ ATకి 16.39kmplగా వస్తుంది. లేడర్ ఫ్రేమ్ చట్రం ఆధారంగా SUV లో-రేంజ్ ట్రాన్స్ఫర్ గేర్ (4L మోడ్) ప్రమాణంగా ALLGRIP PRO 4WD టెక్నాలజీని కలిగి ఉంది.