MG ZS EV Resale Value : రీసేల్ వాల్యూలో ఆ ఈవీల కన్నా ఎంజీ ZS EV SUV కార్లదే ఆధిపత్యం.. ఏ SUV కార్ల రీసేల్ వాల్యూ ఎంతంటే?
MG ZS EV Resale Value : భారత ఈవీ కార్ల మార్కెట్లో ఎంజీ మోటార్ ఇండియా ZS EV ఈవీ మోడల్ దూసుకుపోతోంది. ఇతర ఈవీ కంపెనీలకు పోటీగా ఎంజీ EV మోడల్ కార్ల ఆధిపత్యం కొనసాగుతోంది.

MG ZS EV Dominates in Resale Value in Droom Study
MG ZS EV Resale Value : దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఎకో ఫ్రెండ్లీ మొబిలిటీ విద్యుత్ వాహనాల (EV)లకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఈవీ మార్కెట్లో ఎలక్ట్రానిక్ వాహనాల రాకతో అనేక గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే టాటా మోటార్స్ (Tata Motors), ఎంజీ మోటార్ ఇండియా (MG Motor India) వంటి ప్రముఖ తయారీ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునేలా ఈవీ SUVలను అందిస్తున్నాయి. ఎంజీ మోటార్ ఇండియా పాపులర్ వెహికల్ ZS EV కూడా అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను కట్టిపడేస్తోంది.
ఈవీ SUVలో ఆకట్టుకునే ఫీచర్లు, సామర్థ్యాల కారణంగా కారు ఔత్సాహికులలో అత్యంత డిమాండ్ పెరిగింది. హై పర్ఫార్మెన్స్, సామర్థ్యం కలిగిన ఈవీ కార్ల డ్రైవర్లకు ప్రధాన ఆప్షన్‌గా మారింది. ఈవీ మార్కెట్ పరంగా చూస్తే.. నెక్సాన్ EV, ZS EVలకు గట్టి పోటీ నడుస్తోంది. అయితే, ZS EVని ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి కేవలం 50 నిమిషాల్లో 80శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్సాన్ EVని ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి 60 నిమిషాల్లో 80శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.
డ్రూమ్ స్టడీ (Droom Study) విశ్లేషణ ప్రకారం.. మార్కెట్ ధర రేంజ్‌లో ఇతర SUVలతో పోలిస్తే.. ZS EV అత్యధిక రీసేల్ వాల్యూను కలిగి ఉంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా నెక్సాన్, హ్యుందాయ్ కోనా వంటి సెగ్మెంట్‌లోని ఇతర వాహనాలతో పోలిస్తే.. MG ZS EV ఇన్‌స్టంట్ టార్క్, 177 PS గరిష్ట పవర్ అవుట్‌పుట్‌తో లీడర్‌గా అవతరించింది. ఈ EV కారు 8 సెకన్లలో 0 ~ 100 చేరుకోవచ్చు. MG ZS EV అనేది ఒక సెగ్మెంట్ ప్రొడక్టు.. 141 హార్స్‌పవర్, 353 Nm టార్క్ ఉత్పత్తి చేసే విద్యుత్ మోటారును కలిగి ఉంది. విభిన్న డ్రైవింగ్ అవసరాలను తీర్చగలదు. ఈ SUV మోడల్ కారు 3 డ్రైవింగ్ మోడ్‌లతో (ఎకో, నార్మల్, స్పోర్ట్) వస్తుంది. వినియోగదారులు ఈవీ కొనుగోలు చేసే ముందు రీసేల్ వాల్యూను తెలుసుకునేందుకు ఇష్టపడతారు. అందుకే, ICE ఇంజిన్లు, విద్యుత్ వాహనాలలో భారత్ అత్యంత ప్రియమైన కొన్ని SUVల రీసేల్ వాల్యూను కలిగి ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
పెట్రోల్ డీజిల్ ఎలక్ట్రిక్
హ్యుందాయ్ క్రెటా 61 శాతం 67 శాతం –
కియా సెల్టోస్ 65 శాతం 68 శాతం –
టాటా నెక్సాన్ 67 శాతం 77 శాతం 66 శాతం
హ్యుందాయ్ కోనా – – 69 శాతం
ఎంజీ ZS EV – – 77 శాతం

MG ZS EV Dominates in Resale Value in Droom Study
MG ZS EV విభాగంలో అద్భుతమైన SUV అని చెప్పవచ్చు. ఆకట్టుకునే పనితీరు, హై రేంజ్, ప్రీమియం ఇంటీరియర్లను అందిస్తుంది. ఇప్పటివరకు భారత మార్కెట్లో అత్యంత ఆకర్షణీయమైన EV మోడల్. ఇందులోని శక్తివంతమైన విద్యుత్ మోటార్ వేగం, సైలంట్ రైడ్ అందిస్తుంది. అయితే, విద్యుత్ పవర్ట్రెయిన్ అధిక సామర్థ్యంతో మంచి మైలేజీని అనుమతిస్తుంది. అదనంగా, ZS EV రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ బ్రేకింగ్ నుంచి పవర్ సంగ్రహిస్తుంది. దాన్ని విద్యుత్తుగా మారుస్తుంది. మరో ఈవీ పోటీదారు హ్యుందాయ్ కోనాతో పోల్చితే.. MG ZS EV చాలా మెరుగ్గా ఉంది. పరిధి పరంగా MG ZS EV ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 461 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
హ్యుందాయ్ కోనా 452 కిలోమీటర్ల పరిధితో పోలిస్తే.. అదనంగా, MG ZS EV ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అదే ఛార్జ్ శాతం కోనా 64 నిమిషాలతో పోలిస్తే.. బ్యాటరీని కేవలం 50 నిమిషాల్లో 80శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. MG ZS EVలో మొత్తం 6 ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా వంటి అనేక అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ASEAN NCAP క్రాష్ టెస్ట్లో 5 స్టార్ రేటింగ్ సాధించింది. అలాగే, మెరుగైన పనితీరు, సమర్థత, సుస్థిరతతో, పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఎకో ఫ్రెండ్లీ వెహికల్ కోరుకునే వినియోగదారులకు MG ZS EV ఒక ఆకర్షణీయమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.