Apple AI Chatbot : ఆపిల్ ఉద్యోగులెవ్వరూ ఏఐ చాట్‌జీపీటీ వాడొద్దు.. కానీ, సీఈఓ కుక్ మాత్రం తెగ వాడేస్తున్నారట.. ఎందుకో తెలుసా?

Apple AI Chatbot : ఆపిల్ కంపెనీ ఏఐ చాట్‌జీపీటీ వినియోగంపై ఉద్యోగులకు పరిమితి విధించింది. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ మాత్రం చాట్‌జీపీటీ వాడేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారట..

Apple AI Chatbot : ఆపిల్ ఉద్యోగులెవ్వరూ ఏఐ చాట్‌జీపీటీ వాడొద్దు.. కానీ, సీఈఓ కుక్ మాత్రం తెగ వాడేస్తున్నారట.. ఎందుకో తెలుసా?

Apple employees not allowed to use ChatGPT but Tim Cook likes using AI chatbot

Apple AI Chatbot : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) కంపెనీ CEO టిమ్ కుక్ (Tim Cook) ఏఐ చాట్‌జీపీటీని (ChatGPT)ని తెగ వాడేస్తున్నారట.. అంతేకాదు.. AI చాట్‌బాట్ ప్రస్తావన వస్తే చాలు.. చాలా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారట.. గుడ్ మార్నింగ్ అమెరికాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో OpenAI అభివృద్ధి చేసిన ChatGPT విషయంలో కుక్ ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఏడాదిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి కుక్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కూడా. ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. ప్రైవసీ సమస్యల కారణంగా ఆపిల్ ఉద్యోగుల చాట్‌జీపీటి వినియోగాన్ని కూడా పరిమితం చేసింది.

అయితే, చాట్‌బాట్‌ సొంత వినియోగంపై నేరుగా కుక్‌ని అడిగితే.. అవును.. నేను ఏఐ చాట్ జీపీటీ వాడతానని టక్కున సమాధానమిచ్చాడు. ఏఐ చాట్‌జీపీటీ వినియోగానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన అప్లికేషన్‌లు కూడా ఉన్నాయని భావిస్తున్నానని కుక్ తెలిపాడు. ఆపిల్ టెక్నాలజీ, ఆర్థిక వనరులను AIకి అంకితం చేస్తుందని నివేదిక సూచిస్తుంది. ఏఐ చాట్‌జీపీటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కుక్ చెప్పాడు.

Read Also : Maruti Suzuki Jimny Launch : మహీంద్రా థార్‌కు పోటీగా 5 డోర్లతో మారుతీ సుజుకి జిమ్నీ.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతో తెలుసా?

ఏఐ చాట్‌జీపీటీ ద్వారా తప్పుడు సమాచారం, నియంత్రణ ప్రాముఖ్యత గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. AI ఫీల్డ్‌లో కంట్రోల్ అవసరమని, నిర్దిష్ట సరిహద్దులు ఉండాలని కుక్ అభిప్రాయపడ్డాడు. AI టెక్నాలజీ వేగవంతమైన పురోగతికి అనుగుణంగా కంపెనీలు ఎదుర్కొనే సవాళ్లను ఆయన అంగీకరించారు. నైతిక నిర్ణయాలు తీసుకోవడానికి, స్వీయ నియంత్రణను పాటించడానికి కంపెనీలు బాధ్యత వహించాలని కుక్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

AI టెక్నాలజీ సామర్థ్యం విషయంలో సీఈఓ కుక్ మాత్రం భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. ఆపిల్‌లో ఏఐ టెక్నాలజీ అమలుకు ఆలోచనాత్మక విధానాన్ని అనుసరించాలని అభిప్రాయపడ్డారు. OpenAI ChatGPT, Microsoft Bing వంటి కంపెనీలు OpenAI భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత బార్డ్ వంటి ప్రొడక్టుల ద్వారా జనరేటివ్ AIని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆసక్తిగా (Microsoft), Google వంటి పోటీదారుల వ్యూహాలకు భిన్నంగా టిమ్ కుక్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Apple employees not allowed to use ChatGPT but Tim Cook likes using AI chatbot

Apple employees not allowed to use ChatGPT but Tim Cook likes using AI chatbot

ఆపిల్ ఉద్యోగులు ఇకపై ChatGPT, ఇతర కృత్రిమ మేధస్సు టూల్స్ ఉపయోగించలేరు. ఎందుకంటే.. ఆపిల్ ఉద్యోగులు తమ సొంత టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. ఆపిల్ ఉద్యోగులు ChatGPTని ఉపయోగిస్తే.. తమ సొంత ప్రొడక్టుకు సంబంధించిన రహస్య సమాచారం ఇతరులకు షేర్ అవుతుందని ఆపిల్ ఆందోళన చెందుతోంది. WSJ నివేదిక ప్రకారం.. సాఫ్ట్‌వేర్ కోడ్‌ను ఆటోమాటిక్‌గా రాయగల మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని GitHub కోపిలట్‌ను ఉపయోగించవద్దని కుపెర్టినో-దిగ్గజం ఉద్యోగులను కోరింది.

ChatGPT అనేది OpenAI ద్వారా క్రియేట్ చేసిన ఒక చాట్‌బాట్. ఇది కేవలం 5 రోజుల్లోనే 1 మిలియన్ యూజర్లతో వేగంగా అభివృద్ధి చెందుతున్న అప్లికేషన్‌గా మారింది. చాలా విషయాలకు ఈ చాట్ జీపీటీ టక్కున సమాధానం చెప్పగలదు. అందులో కొన్ని మానవుడు చేయగలిగిన వాటితో సరిపోలవచ్చు. అనేక ప్రశ్నలకు వేగంగా సమాధానం ఇవ్వగలదు. వ్యాసాలు రాయగలదు. మనిషి ప్రవర్తనను పోలి ఉండే విధంగా ఇతర పనులను వేగంగా చేయగలదు. అందుకే, ప్రపంచమంతా ఏఐ టెక్నాలజీపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీతో మరెన్నో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Read Also : Google Chrome Extensions : ఈ 32 గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్స్‌తో జాగ్రత్త.. వెరీ డేంజరస్.. మీ డేటా భద్రం.. ఇప్పుడే డిలీట్ చేసేయండి..!