Moto Razr 40 Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటో రేజర్ 40 మడతబెట్టే ఫోన్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్‌.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

Moto Razr 40 Sale : భారత మార్కెట్లో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లకు ఫుల్ డిమాండ్ ఉంది. ఇటీవలే లాంచ్ అయిన (Moto Razr 40, Moto Razr 40 Ultra) ఫోల్డబుల్ ఫోన్లపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్లు అందిస్తున్నాయి.

Moto Razr 40 Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటో రేజర్ 40 మడతబెట్టే ఫోన్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్‌.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

Moto Razr 40 Sale under Rs 50K on Amazon_ check out deals in Telugu

Moto Razr 40 Sale : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లకు భారీ డిమాండ్ పెరిగింది. మీరు ఫోల్డబుల్ డివైజ్‌ని పొందాలని ప్లాన్ చేస్తుంటే.. (Flipkart Sale), (Amazon Sale Offers)లో డీల్‌ ఓసారి చెక్ చేసుకోండి. కొత్తగా మోటోరోలా (Motorola) లాంచ్ చేసిన కొత్త ఫోల్డబుల్ సిరీస్ (Moto Razr 40, Moto Razr 40 Ultra) మడతబెట్టే ఫోన్లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.

అమెజాన్‌లో ఫోల్డబుల్ ఫోన్లపై భారీ డీల్స్ :
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ (Amazon Great Indian Festival Sale)కు ముందుగానే (Samsung Galaxy) ఫోల్డబుల్ ఫోన్‌లపై భారీ డీల్‌లు ఇంకా భారీ తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి. మోటో రేజర్ ఫోల్డబుల్ సిరీస్ ఇ-కామర్స్ సైట్‌లో భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. రూ. 59,999తో లాంచ్ చేసిన మోటో రేజర్ 40 సిరీస్ రూ. 10వేల తగ్గింపుతో అందుబాటులో ఉంది.

Read Also : Motorola Razr 40 Sale : అమెజాన్‌ ప్రైమ్ డే సేల్.. మడతబెట్టే మోటోరోలా Razr 40 సిరీస్‌పై రూ. 7వేలు ప్లాట్ డిస్కౌంట్.. మరెన్నో లాంచ్ ఆఫర్లు.. డోంట్ మిస్..!

అంటే.. ఈ ఫోల్డబుల్ డివైజ్ రూ. 49,999 వద్ద లిస్టు అయింది. అయితే, మీరు SBI కార్డ్‌పై రూ. 3,750 తగ్గింపును పొందవచ్చు. దాంతో ఈ మోటో ఫోన్ ధరను రూ. 44,000కి తగ్గించవచ్చు. అమెజాన్ యూర్లు తమ పాత ఫోన్‌లను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా Moto Razr 40పై భారీ తగ్గింపును పొందవచ్చు.

Moto Razr 40 స్పెషిఫికేషన్లు :
మోటోరోలా మోటో రేజర్ 40 సిరీస్, (Samsung Galaxy Z Flip 4) ఫోల్డబుల్‌కి అద్భుతమైన పోలిక ఉంది. కాంపాక్ట్ కవర్ డిస్‌ప్లే కలిగి ఉన్నాయి. ఈ చిన్న OLED కవర్ డిస్‌ప్లే కేవలం 1.5 అంగుళాలు, 2:1 కారక రేషియో కలిగి ఉంటుంది. ఫోల్డ్ చేసినప్పుడు.. ప్రయాణంలో యాప్‌లు, కాల్ నోటిఫికేషన్‌లను చెక్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది.

Moto Razr 40 Sale under Rs 50K on Amazon_ check out deals in Telugu

Moto Razr 40 Sale on Amazon_ check out deals in Telugu

అయితే, మీరు Razr 40ని ఓపెన్ చేసినప్పుడు.. 22:9 యాస్పెక్ట్ రేషియోతో విస్తారమైన 6.9-అంగుళాల వ్యూ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కవర్ డిస్‌ప్లే ప్రామాణిక 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. అయితే, ప్రధాన డిస్‌ప్లే ఆకట్టుకునే 144Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. మోటరోలా మెయిన్ స్క్రీన్‌ను 10-బిట్ డిస్‌ప్లే ప్యానెల్‌ అమర్చారు. మెరుగైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ కోసం 1 బిలియన్లకు పైగా కలర్ ప్యాలెట్‌ను అందిస్తుంది.

ఫీచర్ల పరంగా చూస్తే..
మోటోరోలా రేజర్ 40 ఇతర అత్యాధునిక (Motorola Edge) ఫోన్‌ మాదిరిగా ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఆడియో జాక్‌ లేదని గమనించాలి. అయితే, డాల్బీ అట్మోస్ స్పీకర్‌ సపోర్ట్‌తో ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. కనెక్టివిటీ వారీగా పరిశిలిస్తే.. Razr 40 NFC, Wi-Fi 6, బ్లూటూత్ 5.3కి సపోర్టుతో సమానంగా ఉంటుంది.

ఆసక్తికరమైన ట్విస్ట్ ఏమిటంటే.. మోటోరోలా బాక్స్‌లోనే ప్రొటెక్టివ్ కేస్‌ను చేర్చింది. మీ స్టైలిష్, అధునాతన రేజర్ 40 ఎలిమెంట్స్ కలిగి ఉంది. సొగసైన డిజైన్, వినూత్న ఫీచర్లు, శాంసంగ్ కౌంటర్‌తో మోటోరోలా రేజర్ 40 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ గ్లోబల్ వినియోగదారులను మరింత ఆకట్టుకోనుంది.

Read Also : Amazon Great Indian Festival 2023 : అమెజాన్ ఫెస్టివల్ 2023 డీల్స్.. ఈ ల్యాప్‌టాప్స్, మొబైల్స్, స్మార్ట్ టీవీలపై అదిరే డిస్కౌంట్లు!