Motorola Razr 40 Sale : అమెజాన్‌ ప్రైమ్ డే సేల్.. మడతబెట్టే మోటోరోలా Razr 40 సిరీస్‌పై రూ. 7వేలు ప్లాట్ డిస్కౌంట్.. మరెన్నో లాంచ్ ఆఫర్లు.. డోంట్ మిస్..!

Motorola Razr 40 Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో మోటోరోలా Razr 40 సిరీస్ ఫోల్డబుల్ ఫోన్‌పై లాంచ్ ఆఫర్లను అందిస్తోంది. కేవలం రూ. 7వేలు ఫ్లాట్ తగ్గింపుతో Razr 40 Ultraని కొనుగోలు చేయొచ్చు.

Motorola Razr 40 Sale : అమెజాన్‌ ప్రైమ్ డే సేల్.. మడతబెట్టే మోటోరోలా Razr 40 సిరీస్‌పై రూ. 7వేలు ప్లాట్ డిస్కౌంట్.. మరెన్నో లాంచ్ ఆఫర్లు.. డోంట్ మిస్..!

Motorola Razr 40 Ultra, Razr 40 to Go on Sale in India During Amazon Prime Day Sale 2023

Motorola Razr 40 Sale : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదలైంది. సరికొత్త మోటోరోలా అత్యంత స్టైలిష్ ఫోల్డబుల్ Razr 40 Ultra సిరీస్ ఫోన్ ఇప్పుడు అమ్మకానికి ఉంది. అమెజాన్ ప్రైమ్ డే ఈవెంట్‌లో భాగంగా రూ. 7000 తగ్గింపుతో Razr 40 Ultraని పొందవచ్చు. ఈ ఫోన్‌లో గొప్ప విషయం ఏమిటంటే.. బ్యాక్ సైడ్ పెద్ద స్క్రీన్, రెండవ డిస్‌ప్లేగా కూడా పనిచేస్తుంది. ఈసారి డిజైన్‌ను మెరుగుపర్చింది. ఈ ఫోన్‌లో ఎంచుకోవడానికి చాలా కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

మోటోరోలా Razr 40 Ultra, Razr 40 ఫోన్ భారత మార్కెట్లో మొదటిసారిగా శనివారం (జూలై 15)న అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2023 సమయంలో విక్రయిస్తోంది. మోటోరోలా నుంచి సరికొత్త క్లామ్‌షెల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు Android 13-ఆధారిత MyUXలో రన్ అవుతాయి. Qualcomm Snapdragon SoC ఆధారితమైనదిగా చెప్పవచ్చు. 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల OLED LTPO లోపలి ప్యానెల్‌లను కలిగి ఉంటాయి. Motorola Razr 40 Ultra 30W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో 3,800mAh బ్యాటరీని అందిస్తుంది. అయితే, Razr 40 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,200mAh బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Apple iPhone 14 Plus : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌.. ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌పై క్రేజీ డిస్కౌంట్.. రూ. 16వేలు తగ్గిందోచ్.. డోంట్ మిస్..!

మోటోరోలా Razr 40 సిరీస్ ధర, లాంచ్ ఆఫర్లు :
మోటోరోలా Razr 40 Ultra ఫోన్ ధర రూ. 89,999గా ఉంది. ఏకైక 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ఇన్ఫినిట్ బ్లాక్, వివా మెజెంటా కలర్ ఆప్షన్లలో వస్తుంది. మరోవైపు, మోటోరోలా Razr 40 సింగిల్ 8GB RAM, 256GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 59,999కు అందిస్తుంది. ఈ ఫోన్ సేజ్ గ్రీన్, సమ్మర్ లిలక్, వెనిలా క్రీమ్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. మోటోరోలా ఇండియా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి కూడా అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం మోటోరోలా ప్రో మోడల్‌ను త్వరలో రాబోయే ట్యాగ్‌తో అమెజాన్ లిస్టు చేసింది. ICICI క్రెడిట్ కార్డ్‌ల ద్వారా Motorola Razr 40 Ultra కొనుగోలుపై రూ. 7వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది. SBI కార్డ్ వినియోగదారులు రూ. 6,250 ప్లాట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. నో-కాస్ట్ EMI ఆప్షన్లపై రూ. 7,500 నుంచి ప్రారంభమవుతాయి.

Motorola Razr 40 Ultra, Razr 40 to Go on Sale in India During Amazon Prime Day Sale 2023

Motorola Razr 40 Ultra, Razr 40 to Go on Sale in India During Amazon Prime Day Sale 2023

మోటోరోలా Razr 40 స్పెసిఫికేషన్స్ :
మోటోరోలా Razr 40 Ultra, Razr 40 రెండూ ఆండ్రాయిడ్ 13-ఆధారిత MyUXపై రన్ అవుతాయి. అల్ట్రా మోడల్ 165Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ఫుల్-HD+ ఫోల్డబుల్ పోలెడ్ డిస్‌ప్లే, 1,200 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో 3.6-అంగుళాల (1,056×1,066 పిక్సెల్‌లు) pOLED ఔటర్ ప్యానెల్‌ను కలిగి ఉంది. మోటోరోలా Razr 40 144Hz రిఫ్రెష్ రేట్, 1.5-అంగుళాల OLED ఔటర్ స్క్రీన్‌తో 6.9-అంగుళాల ఫుల్-HD+ పోలెడ్ మెయిన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మోటోరోలా Razr 40 Ultra స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCపై రన్ అవుతుంది. అయితే, మోటోరోలా Razr 40 ఫోన్ Snapdragon 7 Gen 1 SoC ద్వారా పవర్ అందిస్తుంది.

వాటర్ రెసిస్టెన్స్ IP52తో పాటు బ్యాక్ వైపున Razr 40 అల్ట్రా 12MP ప్రైమరీ కెమెరాను ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కి సపోర్ట్ చేస్తుంది. 108-డిగ్రీ ఫీల్డ్ వ్యూతో 13MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉంటుంది. Razr 40 ఫోన్ 64MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరాతో డ్యూయల్-కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంది. రెండు మోడల్స్ సెల్ఫీలు, వీడియో చాట్‌లకు 32MP కెమెరాను కలిగి ఉన్నాయి. మోటోరోలా Razr 40 Ultra 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 5W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 3,800mAh బ్యాటరీకి సపోర్టు అందిస్తుంది. Razr 40 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,200mAh బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Amazon Prime Day 2023 Sale : అమెజాన్‌లో షావోమీ, వన్‌ప్లస్, శాంసంగ్, ఆపిల్ ఐప్యాడ్, ట్యాబ్‌లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. మీకు నచ్చిన డివైజ్ కొనేసుకోండి!