Mukesh Ambani: ప్రపంచ ధనికుల జాబితాలో అంబానీ.. ఎలన్ మస్క్, బెజోస్‌ల తర్వాత

అంబానీ 2021 ఫోర్బ్స్ జాబితాలో 100మంది ధనిక ఇండియన్లలో 14వ స్థానంలో ఉన్నారు.

Mukesh Ambani: ప్రపంచ ధనికుల జాబితాలో అంబానీ.. ఎలన్ మస్క్, బెజోస్‌ల తర్వాత

Mukesh Ambani

Mukesh Ambani: ఆసియా అత్యంత ధనవంతుల జాబితాలో ఒకరైన ముఖేశ్ అంబానీ.. ప్రపంచంలోనే అత్యంత ధనికులు జాబితలో చేరిపోయాడు కనీసం 100బిలియన్ డాలర్ల ఆస్తిపరుల జాబితాలో చేరి ఘనత దక్కించుకున్నారు. 11 మంది ఉన్న ఈ రికార్డు లిస్టులో రిలయన్స్ లిమిటెడ్ ఛైర్మన్ అంబానీ కూడా ఉండటం గమనార్హం.

అంతకంటే ముందు అంబానీ 2021 ఫోర్బ్స్ జాబితాలో 100మంది ధనిక ఇండియన్లలో 14వ స్థానంలో ఉన్నారు. లిస్టు ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ గడిచిన 12నెలల్లో అతని ఆదాయం 4బిలియన్ డాలర్లు పెరిగింది. టెలికాం, డిజిటల్, రిటైల్ వ్యాపారాల్లో లాభాలు గడిస్తుండటంతో స్టాక్ మార్కెట్ లో అంబానీ పుష్కలంగా సంపాదిస్తున్నారు.

ఇప్పుడు ముఖేశ్ ఆస్తుల విలువ సుమారు 100.6 బిలియ‌న్ల డాల‌ర్లుగా ఉన్న‌ట్లు బ్లూమ్‌బ‌ర్గ్ బిలియ‌నీర్స్ ఇండెక్స్ పేర్కొంది. బ్లూమ్‌బ‌ర్గ్ ప్రకారం ఈ ఏడాది 23.8 బిలియ‌న్ల డాల‌ర్ల‌ను ముఖేశ్ సంపాదించారు. మ‌స్క్‌, బెజోస్, బెర్నార్డ్ అర్నాల్ట్‌, బిల్ గేట్స్‌, ల్యారీ పేజ్‌, మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌, సెర్గే బ్రిన్‌, లారీ ఎలిస‌న్‌, స్టీవ్ బాల్మ‌ర్‌, వారెన్ బ‌ఫెట్‌ లాంటి సంపన్నులతో పాటు ముఖేశ్ అంబానీ ఉన్నారు.

……………………………………………………………. : విచారణకు ఆశిష్ మిశ్రా, నిరహార దీక్షను విరమించిన సిద్ధూ