Lakhimpur Kheri : విచారణకు ఆశిష్ మిశ్రా, నిరహార దీక్షను విరమించిన సిద్ధూ

కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. దీంతో తాను నిరహార దీక్షను విరమించుకుంటున్నట్లు సిద్ధూ వెల్లడించారు.

Lakhimpur Kheri : విచారణకు ఆశిష్ మిశ్రా, నిరహార దీక్షను విరమించిన సిద్ధూ

Navjot

Navjot Sidhu Hunger Strike : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ నిరహారదీక్షను విరమించారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో లఖింపూర్ ఖేరి ఘటనలో నిందితులను ఆరెస్టు చేసేంత వరకు దీక్ష కొనసాగిస్తానని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. దీంతో తాను నిరహార దీక్షను విరమిస్తున్నట్లు సిద్ధూ వెల్లడించారు. లఖింపూర్‌ ఖేరీ ఘటనలో మరణించిన జర్నలిస్ట్‌ రామన్‌ కశ్యప్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం నిందితులను అరెస్టు చేసేంత వరకు దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు.

Read More : Lakhimpur Kheri : ఆశిష్ మిశ్రా…విచారణకు హాజరవుతారా ?

ఈ క్రమంలో…2021, అక్టోబర్ 09వ తేదీ శనివారం ఉదయం ఆశిష్ మిశ్రా…పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. యూపీ పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేశారు. సమన్లు జారీ చేసినా…2021, అక్టోబర్ 08వ తేదీ శుక్రవారం విచారణకు హాజరు కాకపోవడంతో…రెండోసారి సమన్లు జారీ చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు పోలీస్‌ కార్యాలయానికి రావాలని కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా నివాసం వద్ద నోటీసు అంటించారు. 11 గంటల లోపే…క్రైం బ్రాంచ్ విచారణకు ఆశిష్ మిశ్రా… హాజరయ్యారు.

Read More : Navjot Sidhu : సీఎం చన్నీ కాంగ్రెస్ ను ముంచేస్తాడు..సిద్ధూ సంచలన వ్యాఖ్యలు

లఖింపూర్ ఘటనపై ఆందోళనలు, నిరసనలు పెల్లుబికుతున్నాయి. పంజాబ్ కాంగ్రెస్ నేతలు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. శుక్రవారం బీజేపీకి వ్యతిరేకంగా పంజాబ్‌లోని మొహాలీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీకి చేపట్టిన భారీ కాంగ్రెస్‌ ర్యాలీకి సిద్ధూ నేతృత్వం వహించారు. పలు వాహనాల్లో వచ్చిన పంజాబ్‌ కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, కార్యకర్తలను యూపీ పోలీసులు సరిహద్దులో అడ్డుకున్నారు. సిద్ధూను అదుపులోకి తీసుకున్నారు. దీంతో సిద్ధూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయనను మాత్రమే లఖింపూర్‌ ఖేరీకి అనుమతి ఇవ్వడంతో బాధితులను పరామర్శించారు. లఖింపూర్‌ ఖేరీ ఘటనలో మరణించిన జర్నలిస్ట్‌ రామన్‌ కశ్యప్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత అక్కడే దీక్షకు దిగారు. ప్రస్తుతం ఆశిష్ మిశ్రా విచాణకు హాజరవడంతో సిద్ధూ దీక్షను విరమించారు.