Nissan Magnite Discount Offer : రూ. 6 లక్షల విలువైన SUVపై రూ. 62 వేల తగ్గింపు.. డోంట్ మిస్.. ఇప్పుడే కొనేసుకోండి..!
Nissan Magnite Discount Offer : నిస్సాన్ మాగ్నైట్ కారుపై అదిరే ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. రూ. 6 లక్షల విలువైన ఈ SUV కారుపై రూ. 62వేలు తగ్గింపు ప్రకటించింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, యాక్సెసరీలు, కార్పొరేట్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్ వంటి పలు డిస్కౌంట్లను కూడా అందిస్తోంది.

Nissan Magnite Discount Offer in june 2023 Price And Features Details
Nissan Magnite Discount Offer in June 2023 : అత్యంత సరసమైన SUV కారు కోసం చూస్తున్నారా? ఇదే సరైన సమయం.. ఈ జూన్ నెలలో, దేశంలోనే అత్యంత చౌకైన SUV నిస్సాన్ మాగ్నైట్‌పై రూ. 62 వేల తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ SUV ప్రారంభ ధర కేవలం రూ.599,900 మాత్రమే.. ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫర్, యాక్సెసరీస్, కార్పొరేట్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్ వంటి పలు డిస్కౌంట్లను కూడా కంపెనీ అందిస్తోంది. అంతేకాదు.. ఆన్‌లైన్ బుకింగ్‌లపై అదనపు డిస్కౌంట్‌తో పాటు కారు లోన్‌పై అతి తక్కువ వడ్డీ రేటుతో కూడా అందుబాటులో ఉంది.
Read Also : Mahindra Thar SUV : ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వచ్చేస్తున్న 5 డోర్ల మహీంద్ర థార్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
నిస్సాన్ మాగ్నైట్ ఆఫర్‌లలో రూ. 20వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10వేల విలువైన అప్లియన్సెస్, రూ. 10వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 10వేల లాయల్టీ బోనస్ ఉన్నాయి. ఆన్‌లైన్ బుకింగ్‌పై రూ. 2వేల అదనపు డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. వినియోగదారులు నిస్సాన్ రెనాల్ట్ నుంచి 2 ఏళ్ల పాటు రూ. 4 లక్షలు ఫైనాన్స్ చేస్తే.. అప్పుడు 6.99శాతం వడ్డీ రేటుతో రుణాన్ని పొందవచ్చు. ఈ ఆఫర్ గడువు 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. భారతీయ మార్కెట్లో, టాటా పంచ్, మారుతి ఫ్రాంక్స్, హ్యుందాయ్ వెన్యూ వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

Nissan Magnite Discount Offer in june 2023 Price
నిస్సాన్ మాగ్నైట్ ఇంజన్, ఫీచర్లు :
నిస్సాన్ మాగ్నైట్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. 100hp పవర్, 160Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదనంగా, 71hp పవర్, 96Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.0L పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చాయి.
ఈ కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, స్మార్ట్ కనెక్టివిటీ, వ్యూ మానిటర్ వంటి అనేక సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. క్యాబిన్‌లో 7-అంగుళాల TFT స్క్రీన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ మూడ్ లైటింగ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. భద్రత కోసం ABS, EBD, HSA, HBA వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.