Nothing Phone 2 Price : జూలై 11న నథింగ్ ఫోన్ (2) వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర వివరాలు లీక్..!

Nothing Phone 2 Price : నథింగ్ ఫోన్ (2) ధర వివరాలు లీక్ అయ్యాయి. రాబోయే 5G ఫోన్ ధర (729 యూరోలు) భారత మార్కెట్లో దాదాపు రూ. 65,590 నుంచి అందుబాటులో ఉండనుంది.

Nothing Phone 2 Price : జూలై 11న నథింగ్ ఫోన్ (2) వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర వివరాలు లీక్..!

Nothing Phone 2 price details leaked ahead of July 11 launch

Nothing Phone 2 Price : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ నథింగ్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. జూలై 11 లాంచ్ ఈవెంట్‌కు ముందు నథింగ్ ఫోన్ (2) ధర ఆన్‌లైన్‌లో లీక్ అయింది. రాబోయే డివైజ్ చాలా ఖరీదైనదిగా చెప్పవచ్చు. డీలాబ్స్ లీక్ సమాచారం ప్రకారం.. కంపెనీ సరికొత్త నథింగ్ 5G ఫోన్‌ను రెండు మోడళ్లలో అందించనుంది. బేస్ వేరియంట్ 256GB స్టోరేజ్‌గా ఉంటుంది. రాబోయే నథింగ్ ఫోన్ (2) పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్త నథింగ్ ఫోన్ యూరోపియన్ మార్కెట్‌లో 50 శాతం ధరను పెంచుతుందని నివేదిక తెలిపింది. నథింగ్ ఫోన్ (2) ధర 729 యూరోల నుంచి ప్రారంభమవుతుంది. భారత కరెన్సీలోకి దాదాపు రూ. 65,590 వరకు ఉంటుంది. కానీ, భారతీయ మోడళ్ల ధర యూరోపియన్ డివైజ్‌ల కన్నా చాలా తక్కువగా ఉంది. భారత్‌లో ధర రూ. 50వేల లోపు ఉంటుందని అంచనా. ఈ ఫోన్ ధర రూ. 45వేల కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉంది. నథింగ్ ఫోన్ (2) కంపెనీ సెకండ్ జనరేషన్ ప్రొడక్టుగా రానుంది. నథింగ్ ఫోన్ (2) మోడల్ 256GB స్టోరేజ్ మోడల్‌ అందించనుంది.

Read Also : Apple Sale Days on Amazon : అమెజాన్‌లో ఆపిల్ సేల్ డేస్.. భారీగా తగ్గిన ఐఫోన్ 14 సిరీస్‌ ధర.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. ఇప్పుడే కొనేసుకోండి..!

నథింగ్ ఫోన్ (2) ఫోన్ 512GB స్టోరేజ్ మోడల్ ధర 849 యూరోలు (దాదాపు రూ. 76,380)గా ఉంటుందని నివేదిక సూచించింది. ఈ హ్యాండ్‌సెట్ ప్యాక్ ఫీచర్ల కారణంగా రెండు మోడళ్ల ధర కూడా చాలా ఎక్కువగా కనిపిస్తోంది. లేటెస్ట్ Snapdragon 8 Gen 2 SoC ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లతో పాటు నథింగ్ ఫోన్ హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ S23 వంటి అల్ట్రా-ప్రీమియం డివైజ్‌లు భారత మార్కెట్లోరూ. 70వేల నుంచి రూ. 80వేల వరకు అమ్ముడవుతున్నాయి. దేశంలో OnePlus 11 ధర రూ. 60వేల కన్నా చాలా తక్కువగా ఉంటుంది.

Nothing Phone 2 price details leaked ahead of July 11 launch

Nothing Phone 2 price details leaked ahead of July 11 launch

కొత్త నథింగ్ ఫోన్ (2) కేవలం కొన్ని కీలక ఫీచర్లను వెల్లడించింది. అయితే, ఈ ఫోన్ వాల్యూ మరింత మెరుగ్గా చూసేందుకు వివరణాత్మక స్పెసిఫికేషన్‌లు ఇంకా వెల్లడి కాలేదు. అమెరికా, భారత్ సహా ఇతర ప్రపంచ మార్కెట్‌లలో కొత్త నథింగ్ ఫోన్ ధర ఎంత ఉంటుందో తెలియదు. నథింగ్ ఫోన్ (2) ధర ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

నథింగ్ నుంచి లేటెస్ట్ 5G ఫోన్ ఫీచర్లు ఏంటి అనేది తెలియాలంటే మరికొన్ని వారాలు వేచి ఉండాల్సిందే. నథింగ్ ఫోన్ (1) భారత మార్కెట్లో రూ. 32,999 ధరతో లాంచ్ అయింది. ఆ తర్వాత నథింగ్ ఫోన్ (2) భారత మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ అధికారిక ధర జూలై 11న వెల్లడి కానుంది. నథింగ్ ఫోన్ (2) ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ అందించనుంది.

Read Also : Apple iPhone 14 Price : అమెజాన్‌లో తక్కువ ధరకే ఐఫోన్ 14 సిరీస్.. ఇదే సరైన సమయం.. వెంటనే కొనేసుకోండి..!