Nothing Phone 2 Sale Price : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. నథింగ్ ఫోన్ (2)పై భారీ డిస్కౌంట్.. తక్కువ ధరకే కొనేసుకోండి!

Nothing Phone 2 Sale Price : ఫ్లిప్‌కార్ట్ రాబోయే బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023లో కొన్ని డీల్స్ వెల్లడించింది. ఇ-కామర్స్ సైట్ కొత్తగా లాంచ్ చేసిన నథింగ్ ఫోన్ (2)పై (Nothing Phone 2 Sale) దాదాపు రూ. 15వేల వరకు ఎక్స్‌ఛేంజ్, బ్యాంక్ ఆఫర్‌లతో భారీ తగ్గింపులను అందిస్తోంది.

Nothing Phone 2 Sale Price : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. నథింగ్ ఫోన్ (2)పై భారీ డిస్కౌంట్.. తక్కువ ధరకే కొనేసుకోండి!

Nothing Phone 2 Sale Price under Rs 35K during Flipkart Big Billion Days Sale in Telugu

Updated On : October 4, 2023 / 9:07 PM IST

Nothing Phone 2 Sale Price : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 (Flipkart Big Billion Days Sale 2023) అక్టోబర్ 7 నుంచి ప్లస్ మెంబర్‌ (Flipkart Plus Members)లకు ముందస్తు యాక్సెస్‌తో అక్టోబర్ 8 2023 నుంచి ప్రారంభించడానికి రెడీగా ఉంది. ఈ సేల్‌కు ముందు, ఇ-కామర్స్ సైట్ కొన్ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను వెల్లడించింది. తద్వారా ఆసక్తి గల కొనుగోలుదారులు స్మార్ట్‌ఫోన్‌ల ధరలను లాక్ చేయవచ్చు. నథింగ్ ఫోన్ (2)కి భారీ తగ్గింపు, ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్‌లతో దాదాపు రూ. 15,000 తగ్గింపు పొందవచ్చు.

బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపు :

ఫ్లిప్‌కార్ట్ అధికారిక సేల్ పేజీలో నథింగ్ ఫోన్ 2 బేస్ వేరియంట్‌ డీల్ ధర రూ. 39,999 ఉండగా.. అత్యంత తక్కువ ధర రూ. 32,999కు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. మీ పాత ఫోన్‌ని ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడం ద్వారా, అర్హత ఉన్న బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా అతి తక్కువ ధర రూ. 32,999 వద్ద (Nothing Phone 2)ని పొందవచ్చు. మీ పాత ఫోన్‌ని ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా ICICI, Kotak లేదా Axis నుంచి బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 36,999కి నథింగ్ ఫోన్ (2)ని పొందవచ్చు. మీరు కొత్త నథింగ్ ఫోన్ (2)ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. స్పెక్స్ ఫీచర్లను ఓసారి పరిశీలించండి.

Nothing Phone (2) టాప్ స్పెసిఫికేషన్లు :

నథింగ్ ఫోన్ 2 మోడల్ Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌తో ఆధారితమైనది. మొత్తం 3 వేరియంట్‌లలో వస్తుంది. ఇందులో 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్, 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్, హై-ఎండ్ 12GB RAM + 512GB స్టోరేజ్ మోడల్ ఆప్షన్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13OS ఆధారంగా పనిచేసే (NothingOS 2.0) అనే కొత్త సాఫ్ట్‌వేర్‌తో ఫోన్ రన్ అవుతుంది.

Nothing Phone 2 Sale Price under Rs 35K during Flipkart Big Billion Days Sale in Telugu

Nothing Phone 2 Sale Price during Flipkart Big Billion Days Sale

ఫ్రంట్ సైడ్ నథింగ్ ఫోన్ (2) మోడల్ 6.7 అంగుళాలతో పెద్ద స్క్రీన్‌ను కలిగి ఉంది. 1080-2412 రిజల్యూషన్‌తో డిస్‌ప్లే స్పష్టంగా స్మూత్‌గా ఉంటుంది. సెకనుకు 120 సార్లు రిఫ్రెష్ చేయగలదు. మీరు మీ వేలితో స్క్రీన్‌ను టచ్ చేయడం ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు. నథింగ్ ఫోన్ (2) బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50MP Sony IMX890 సెన్సార్, 50MP Samsung JN1 సెన్సార్‌తో, మెరుగైన ఫీచర్లు, పర్ఫార్మెన్స్ రెండూ ఉన్నాయి. నథింగ్ ఫోన్ (2) ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. సోనీ IMX615 సెన్సార్‌ను ఉపయోగిస్తుంది.

నథింగ్ ఫోన్ (1)తో పోలిస్తే.. పెద్ద బ్యాటరీ సామర్థ్యం :
నథింగ్ ఫోన్ (2) బ్యాటరీ లైఫ్ పరంగా కూడా అప్‌గ్రేడ్ అయింది. నథింగ్ ఫోన్ (1)తో పోల్చినప్పుడు.. పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. 4700mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్, USB టైప్ C పోర్ట్‌కు సపోర్టు ఇస్తుంది. రిటైల్ బాక్స్ పారదర్శక నథింగ్ బ్రాండెడ్ కేబుల్, సిమ్ ఎజెక్టర్ టూల్, ఫోన్‌తో వస్తుంది. రిటైల్ బాక్సులో ఛార్జర్ ఉండదని గమనించాలి.

Read Also : Best Smartphones in India : కొత్త ఫోన్ కావాలా? రూ.25వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ ఇప్పుడే కొనేసుకోండి!