Pan-Aadhaar Link: గుడ్ న్యూస్.. పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు.. ఈ సారి ఎప్పటివరకంటే!

పాన్-ఆధార్ లింక్ గడువును మరోసారి పెంచుతూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ట్యాక్స్ చెల్లింపుదారులకు ఈ విషయంలో మరికొంత సమయం ఇచ్చే ఉద్దేశంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల ఎందరో వినియోగదారులకు మేలు జరగనుంది.

Pan-Aadhaar Link: గుడ్ న్యూస్.. పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు.. ఈ సారి ఎప్పటివరకంటే!

Pan-Aadhaar Link: పాన్ కార్డ్-ఆధార్ లింక్ చేసుకునేందుకు కేంద్రం విధించిన తుది గడువు మార్చి 31 వచ్చేస్తోంది.. ఇంకా రెండింటినీ లింక్ చేసుకోలేదని ఆందోళన పడుతున్నారా? అయితే.. మీకో శుభవార్త! పాన్-ఆధార్ లింక్ గడువును మరోసారి పెంచుతూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది.

Kapu Reservation: కాపు రిజర్వేషన్లపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

పాన్-ఆధార్ లింక్ గడువును జూన్ 30 వరకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ట్యాక్స్ చెల్లింపుదారులకు ఈ విషయంలో మరికొంత సమయం ఇచ్చే ఉద్దేశంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల ఎందరో వినియోగదారులకు మేలు జరగనుంది. మంగళవారం నాటి ఆదేశాల ప్రకారం.. జూన్ 30 లోపు పాన్-ఆధార్ లింక్ చేసుకోవాల్సిందే. లేదంటే జూలై 1 నుంచి పాన్ నిరుపయోగంగా మారుతుంది. ఆ తర్వాత పన్నులు చెల్లించాల్సి వస్తే అదనపు జరిమానాల్ని కూడా కేంద్రం వసూలు చేస్తుంది. దీనివల్ల వినియోగదారులపై మరింత భారం పడుతుంది.

Amritpal Singh: అమృత్‌పాల్ సింగ్ అనుచరుల్ని విడుదల చేయండి.. పంజాబ్ పోలీసులకు సిక్కు సంస్థ అల్టిమేటం

1961 నాటి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. పాన్ కార్డు ఉన్న ప్రతి వినియోగదారుడు, ఆ కార్డ్ నెంబర్ ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి. దీనిపై కేంద్రం విధించిన గడువు గతంలోనే ముగిసింది. ఆ తర్వాత ఈ గడువును కేంద్రం పెంచుతూ వచ్చింది. ప్రస్తుతం రూ.1,000 అపరాధ రుసుము చెల్లించి, మార్చి 31 వరకు ఆధార్-పాన్ అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. అయితే, మూడు రోజుల్లో ఈ గడువు ముగియనున్న నేపథ్యంలో మరోసారి గడువు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 51 కోట్ల పాన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. పాన్-ఆధార్ లింక్ అయి ఉంటేనే బ్యాంకు ఖాతా తెరవడం, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం వంటివి చేయొచ్చు.