Poco F5 5G Launch : రూ. 30వేల లోపు ధరకే పోకో F5 5G ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ఫ్లిప్‌కార్ట్ సేల్ ఎప్పటినుంచంటే?

Poco F5 5G Launch : భారత మార్కెట్లో పోకో F5 5G లాంచ్ అయింది. లేటెస్ట్ డిజైన్, స్నాప్‌డ్రాగన్ 7+ Gen 2 ప్రాసెసర్‌తో వచ్చింది. ఈ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉంది.

Poco F5 5G Launch : రూ. 30వేల లోపు ధరకే పోకో F5 5G ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ఫ్లిప్‌కార్ట్ సేల్ ఎప్పటినుంచంటే?

Poco F5 5G launched in India with Snapdragon 7+ Gen 2, price starts from Rs 29,999

Poco F5 5G Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో (Poco) ఎట్టకేలకు భారత మార్కెట్లోకి సరసమైన ధరకే కొత్త 5G ఫోన్ లాంచ్ చేసింది. ఈ (Poco F5 5G) ఫోన్ ‘రిటర్న్ ఆఫ్ ది కింగ్’గా కంపెనీ విక్రయిస్తోంది. పోకో మిడ్-రేంజ్ ఫోన్ ధర రూ.29,999 నుంచి ప్రారంభం అవుతుంది. Poco F5 5G ఫోన్ Poco F4 అప్‌గ్రేడ్ వెర్షన్. ఇప్పటికే ఈ ఫోన్‌కు మార్కెట్లో మంచి ఆదరణ పొందింది. పూర్తిగా లేటెస్ట్ డిజైన్, స్నాప్‌డ్రాగన్ 7+ Gen 2 ప్రాసెసర్‌తో, Poco F5 అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. 2+3 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను కూడా అందిస్తుంది.

లాంచ్ అనౌన్స్‌మెంట్‌పై పోకో ఇండియా కంట్రీ హెడ్ హిమాన్షు టాండన్ మాట్లాడుతూ.. ఈ కొత్త పోకో 5G ఫోన్ విలువైన కస్టమర్ల డైనమిక్ అవసరాలను తీర్చేలా ఉందన్నారు. భారత మార్కెట్లోకి Poco F5ని మార్కెట్‌కి లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ డివైజ్ అద్భుతమైన ఫీచర్‌లతో వచ్చింది. లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 7+ Gen 2 ఆధారితంగా పనిచేస్తుంది. Poco F5 సెగ్మెంట్ మొదటి ప్రదర్శన సామర్థ్యాలతో సెగ్మెంట్ బెస్ట్ పర్ఫార్మెన్స్-సెంటర్డ్ స్మార్ట్‌ఫోన్ అవుతుంది.

Read Also : WhatsApp Web : వాట్సాప్ వెబ్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై మెసేజ్‌లను ఈజీగా ఎడిట్ చేయొచ్చు.. ఎలా పనిచేస్తుందంటే?

భారత్‌లో పోకో F5 5g ఫోన్ ధర ఎంతంటే? :
పోకో F5 5G ఫోన్ మే 16న అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart)లో కార్బన్ బ్లాక్, స్నో స్టార్మ్ వైట్, ఎలక్ట్రిక్ బ్లూ అనే 3 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. 8+256 GB వేరియంట్ ధర రూ.29,999 నుంచి ప్రారంభం అవుతుంది. 12GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999గా ఉంటుంది.

Poco F5 5G launched in India with Snapdragon 7+ Gen 2, price starts from Rs 29,999

Poco F5 5G launched in India with Snapdragon 7+ Gen 2, price starts from Rs 29,999

ఈ ప్రత్యేక సేల్ డే ఆఫర్‌లో, ICICI డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో రూ. 3వేల ఆఫర్ తర్వాత కస్టమర్‌లు వరుసగా 8+256GB, 12+256GB వేరియంట్‌ ధర రూ. 26,999, రూ. 30,999 ధరతో పొందవచ్చు. Poco లాయల్టీ ప్రోగ్రామ్ కింద కస్టమర్‌లు Poco స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా అదనంగా వెయ్యి తగ్గింపును కూడా అందిస్తుంది.

పోకో F5 5g స్పెసిఫికేషన్‌లు ఇవే :
భారత మార్కెట్లో Poco F5 5G Qualcomm స్నాప్‌డ్రాగన్ 7+ Gen 2 చిప్‌సెట్‌తో వచ్చిన మొదటి ఫోన్. Snapdragon 7+ Gen 2 అత్యంత పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 7-సిరీస్‌గా వచ్చింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1కి సమానమైన డిజైన్ కలిగి ఉంది. పాత వెర్షన్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 కన్నా 50 శాతం ఎక్కువ CPU పర్ఫార్మెన్స్ అందిస్తుంది. అంతేకాకుండా, POCO F5 గ్రాఫైట్ షీట్‌ల 14 లేయర్లతో కూడిన 3725mm² స్టీమ్ చాంబర్‌తో వచ్చింది.

డివైజ్ నుంచి బయటకొచ్చే వేడిని తగ్గించడానికి VC డైవర్షన్ కూడా ఉంది. డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఈ ఫోన్ 12-బిట్ డిస్‌ప్లే (68.7bin కలర్లు) కలిగిన మొదటిది. కెమెరా మాడ్యూల్‌లో 64MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ హై ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను అందిస్తుందని పేర్కొంది. Poco F5 5G గేమర్‌లకు, కంటెంట్ క్రియేటర్లకు బెస్ట్ ఫోన్‌గా చెప్పవచ్చు.

Read Also : Realme 11 Series : 200MP కెమెరాతో రియల్‌మి 11 సిరీస్ వచ్చేస్తోంది.. భారత్ ధర ఎంత ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!