Realme 11 Series : 200MP కెమెరాతో రియల్‌మి 11 సిరీస్ వచ్చేస్తోంది.. భారత్ ధర ఎంత ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!
Realme 11 Series : రియల్‌మి ఇండియా 5వ వార్షికోత్సవం సందర్భంగా 200-MP కెమెరాతో ఫోన్ లాంచ్ చేయనుంది. అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉండనుంది. ధర ఎంత ఉండొచ్చుంటే?

Realme teases new smartphone in India with 200MP camera
Realme 11 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి (Realme) నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. 200-MP ప్రైమరీ కెమెరాతో కొత్త రియల్‌మే స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఈ ఫోన్‌కు సంబంధించి టీజర్ రిలీజ్ చేసింది. అద్భుతమైన మొబైల్ ఫోటోగ్రఫీతో హార్డ్‌వేర్‌ను సాఫ్ట్‌వేర్ సామర్థ్యాలను అందిస్తుందని రియల్‌మి ట్విట్టర్‌లో పోస్ట్‌లో పేర్కొంది. రియల్‌మి ఇప్పటికే (Realme 11) సిరీస్‌ను చైనాలో లాంచ్ చేయడానికి రెడీగా ఉంది. రియల్‌మి 11 సిరీస్‌లో 200MP ప్రైమరీ కెమెరాతో రియల్‌మి 11ప్రో ప్లస్ వేరియంట్ కూడా అందిస్తుంది. త్వరలో భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
రియల్‌మి ఇండియాలో తన 5వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్న సందర్భంగా ఈ ఫోన్ లాంచ్ చేయనుంది. గత ఏడాది భారత్‌లో (Realme 9 Pro Plus) లాంచ్ చేసింది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) కెమెరాతో రూ. 30వేల లోపు మొదటి ఫోన్‌లలో ఇదొకటిగా రానుంది.
Read Also : WhatsApp Web : వాట్సాప్ వెబ్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై మెసేజ్‌లను ఈజీగా ఎడిట్ చేయొచ్చు.. ఎలా పనిచేస్తుందంటే?
ప్రస్తుత-జనరేషన్ రియల్‌మి 10 Pro Plus 5G కర్వడ్ డిస్‌ప్లేతో రూ. 30వేల లోపు మొదటి స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. భారతీయ మార్కెట్లో Realme 11 Pro Plus 5G ఫోన్ మరింత మంది వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త హార్డ్‌వేర్‌తో పాటు అనేక ఫీచర్లలో కలిగి ఉంది. భారత మార్కెట్లో రియల్‌మి 11 Pro Plus 5G ఫోన్.. చైనాలోని Realme 11 Pro Plus మాదిరిగా ఎక్కువ లేదా తక్కువ ధర ఉండే అవకాశం ఉంది.

Realme teases new smartphone in India with 200MP camera
ఇప్పటికే ఈ ఫోన్ డిజైన్‌ను కంపెనీ టీజ్ చేసింది. ఈ ఫోన్ లెదర్ బ్యాక్, రౌండ్-రియర్ కెమెరా మాడ్యూల్‌తో రావొచ్చు. మిడల్ 200-MP Samsung ISOCELL HP3 సెన్సార్ ఉంది. ప్రైమరీ కెమెరా సెన్సార్ 4x లాస్‌లెస్ జూమ్, 20x మూన్ మోడ్ జూమ్ ((రెండూ హైబ్రిడ్ జూమ్ లేదా డిజిటల్ జూమ్‌లో)ను అందించవచ్చు. స్పెసిఫికేషన్‌లలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్, డైమెన్సిటీ 7050 SoC, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ, 12GB వరకు RAM, 256GB స్టోరేజీతో ఉన్నాయి.
ఇతర ఎంట్రీ-లెవల్ ఫోన్‌ల మాదిరిగా కాకుండా రియల్‌మి 11 ప్రో ప్లస్‌లో అల్ట్రా-వైడ్ కెమెరా ఉండవచ్చు. రియల్‌మి 10 Pro ప్రస్తుతం 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 27,999కి విక్రయిస్తోంది. ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ.24,999లకు అందుబాటులో ఉంది. Realme 11 Pro Plus ప్రారంభ ధర రూ. 28,999 నుంచి అందుబాటులో ఉంది.