Realme C31 Sale : రియల్‌మి C31 ఫోన్‌ ఫస్ట్ సేల్.. రూ. 500 డిస్కౌంట్.. కండీషన్స్ అప్లయ్..!

Realme C31 Sale : చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ C సిరీస్ నుంచి లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వచ్చింది. భారత మార్కెట్లో బుధవారం (ఏప్రిల్ 6) నుంచి ఫస్ట్ సేల్ మొదలైంది.

Realme C31 Sale : రియల్‌మి C31 ఫోన్‌ ఫస్ట్ సేల్.. రూ. 500 డిస్కౌంట్.. కండీషన్స్ అప్లయ్..!

Realme C31 First Sale Realme C31 Goes On Sale Today With Rs 500 Discount But Conditions Apply

Realme C31 Sale : చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ C సిరీస్ నుంచి లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వచ్చింది. భారత మార్కెట్లో బుధవారం (ఏప్రిల్ 6) నుంచి ఫస్ట్ సేల్ మొదలైంది. షాపింగ్ వెబ్ సైట్లలో ఈ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌పై రూ.500 డిస్కౌంట్ కూడా అందిస్తోంది. కానీ, కండీషన్స్ అప్లయ్ అంటోంది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ డిజైన్‌ ప్రీమియం GT 2 Pro ఆధారంగా రూపొందించింది కంపెనీ. లైట్ వెయిట్ డివైజ్ కోరుకునే యూజర్లకు ఈ ఫోన్ కరెక్టుగా సరిపోతుంది. మరో మాటలో చెప్పాలంటే.. Realme C31 ఫోన్ ద్వారా ఈమెయిల్‌ పంపుకోవచ్చు.. WhatsAppలో చాట్ చేసుకోవచ్చు. అలాగే Instagram బ్రౌజ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లో తక్కువ గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్ అందిస్తోంది. దీని కారణంగా Realme C31పై గేమింగ్ లిమిట్ చేసింది కంపెనీ. అందులో Candy Crush Saga వంటి గేమ్‌లు మాత్రమే ఆడేందుకు వీలుంది.

Realme C31 ఫోన్ పెద్ద డిస్‌ప్లేతో పాటు దీర్ఘకాలం మన్నిక అయిన బ్యాటరీని కలిగి ఉంది. Realme C31 డిజైన్ యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. ధరకు తగినట్టే కెమెరాలు కూడా ఉన్నాయి. Realme C31 గత ఏడాదిలో Realme C21 సక్సెసర్ వెర్షన్.. ఇదివరకే మీరు Realme C21 వాడుతున్నారా? అయితే వెంటనే ఈ కొత్త Real Me C31 మీరు అప్‌గ్రేడ్ కావచ్చు. మీరు Realme C31 కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఫోన్ మొదటి సేల్, ఫీచర్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్‌లో Realme C31 ధర ఎంతంటే? :
Realme C31 రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో వస్తోంది. 3GB RAM, 32GB స్టోరేజ్ ధర రూ. 8,999గా ఉండనుంది. 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ.9,999తో వస్తోంది. ఈ ఫోన్ లైట్ సిల్వర్ డార్క్ గ్రీన్ కలర్‌వేస్‌లో వస్తోంది. ఈ కొత్త ఫోన్ కొనుగోలు చేసుకోవాలనుకుంటే Flipkart, Realme ఆన్‌లైన్ స్టోర్‌లో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం కానుంది. మీకు దగ్గరలోని రియల్ మి స్టోర్ లేదా మొబైల్ రిటైల్ స్టోర్లలోనూ Realme C31ని కొనుగోలు చేసుకోవచ్చు.

Realme C31 ఆఫర్లు :
Realme ఆన్‌లైన్ స్టోర్ నుంచి Realme C31ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీరు Paytm ద్వారా రూ. 1,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అడ్వాన్స్ లేదా EMI పేమెంట్లపై HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి రూ. 500 ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. Realme C31 రెండు వేరియంట్ల ఫోన్ల ధరలు డిస్కౌంట్ పోనూ వరుసగా రూ.8,499 రూ.9,499కి అందుబాటులో ఉండనున్నాయి.

Realme C31 స్పెసిఫికేషన్స్
Realme బడ్జెట్ ఫోన్.. ఆకర్షణీయమైన డిజైన్.. డిస్‌ప్లేను బాగుంది. 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో 6.5-అంగుళాల HD+ LCD కూడా ఉంది. డిస్‌ప్లే పైభాగంలో టియర్‌డ్రాప్ స్టైల్ నాచ్ ఉంది. ఇక లోపల 5- MP F2.2 కెమెరా కూడా ఉంది. ఫోన్ ఆక్టా-కోర్ యునిసోక్ T612 ప్రాసెసర్‌తో పాటు 4GB వరకు RAM, 64GB ఆన్‌బోర్డ్ మెమరీతో అందిస్తోంది. మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. Realme C31 పైన Realme UI R ఎడిషన్ స్కిన్‌తో Android 11 రన్ అవుతుంది.

Realme C31 ఫోన్ వెనుక 3 కెమెరాలు ఉన్నాయి. F2.2 ఎపర్చరు, 4X డిజిటల్ జూమ్‌తో 13-MP ప్రధాన కెమెరా, F2.4 ఎపర్చర్‌తో 2-MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. బోకె ఎఫెక్ట్ కోసం.. మోనోక్రోమ్ సెన్సార్ కూడా ఉన్నాయి. Realme C31 USB-C పోర్ట్ ద్వారా 10W వద్ద ఛార్జ్ అవుతుంది. అలాగే 5000mAh బ్యాటరీతో వస్తుంది. స్టాండ్‌బై మోడ్‌లో 45 రోజుల వరకు ఛార్జింగ్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఫోన్‌లో Wi-Fi, బ్లూటూత్, GPS కనెక్టివిటీ కోసం 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.

Read Also : Realme C31 : రియల్‌మి నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. ఈరోజే లాంచ్.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?