Realme C31 : రియల్‌మి నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. ఈరోజే లాంచ్.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?

Realme C31 : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మి బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లోకి మార్చి 31న లాంచ్ కానుంది.

Realme C31 : రియల్‌మి నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. ఈరోజే లాంచ్.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?

Realme C31 To Launch In India Today Expected Price, Specifications

Realme C31 : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మి బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లోకి మార్చి 31న లాంచ్ కానుంది. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశీయ మార్కెట్లో సరసమైన ధరకే రానున్న ఈ స్మార్ట్‌ఫోన్ ముందుగా ఇండోనేషియాలో లాంచ్ అయింది. సరిగ్గా వారం తర్వాత భారత్ మార్కెట్లో (Realme C31) లాంచ్ అవుతోంది. 6.5-అంగుళాల LCD డిస్‌ప్లే, 13-MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. కంపెనీ ప్రకారం.. హ్యాండ్‌సెట్ 5,000mAh బ్యాటరీతో వచ్చింది. Realme C31 4GB వరకు RAMతో Unisoc T612 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

Realme C31 ధర (అంచనా) :
భారత మార్కెట్లో Realme C31 ధర ఇండోనేషియాలో స్మార్ట్‌ఫోన్ ధరతో చాలా తేడా ఉండొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఇండోనేషియాలో 3GB + 32GB స్టోరేజ్ మోడల్‌కు IDR 1,599,000 (సుమారు రూ. 8,500)తో ప్రారంభం కానుంది. 4GB + 64GB వేరియంట్ ధర IDR 1,799,000 (దాదాపు రూ. 9,600)గా ఉండనుంది. Realme C31 డార్క్ గ్రీన్ లైట్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో రానుంది.

Realme C31 స్పెసిఫికేషన్స్ (అంచనా) :
Realme C31 మైక్రోసైట్‌లో Realme స్మార్ట్‌ఫోన్ గత వారం ఇండోనేషియాలో లాంచ్ అయిన మోడల్‌కు సమానమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. Realme C31 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో 6.5-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. వెబ్‌సైట్ హ్యాండ్‌సెట్‌లో చిప్‌సెట్‌ ఎంత అనేది వెల్లడించలేదు. అయితే ఇండోనేషియాలో లాంచ్ అయిన Realme C31 Unisoc T612 ప్రాసెసర్‌తో వచ్చింది. గరిష్టంగా 4GB RAM కేపాసిటి పెంచుకోవచ్చు.

Realme C31 స్మార్ట్ ఫోన్లో 13-MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ 5-MP సెల్ఫీ కెమెరాతో రానుంది. ఈ హ్యాండ్‌సెట్ 5,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. బ్యాటరీ స్థాయి 5 శాతం కంటే తక్కువ పడిపోయినప్పుడు ఎనర్జీ సేవ్ చేయడానికి ‘అల్ట్రా సేవింగ్ మోడ్’ సపోర్టు చేస్తుందని కంపెనీ తెలిపింది. మైక్రోసైట్ ప్రకారం.. Realme C31 సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో రానుంది.

Read Also : Google Pay : గూగుల్ పేలో కొత్త ఫీచర్.. యూపీఐ ట్రాన్సాక్షన్లు ఇక ఈజీ..!