Reliance Jewels : రిలయన్స్ జ్యువెల్స్.. డైమండ్ నెక్లెస్ సెట్స్ రిలీజ్

జ్యూవెలర్ బ్రాండ్ అయిన రిలయన్స్ జ్యువెల్స్ 'డైమండ్ డిలైట్స్' పేరుతో సరికొత్త కలెక్షన్ లాంఛ్ చేసింది. సరికొత్త డిజైన్లతో ఆకర్షణీయమైన డైమండ్ నెక్లెస్ సెట్స్‌ని రిలీజ్ చేసింది రిలయన్స

Reliance Jewels : రిలయన్స్ జ్యువెల్స్.. డైమండ్ నెక్లెస్ సెట్స్ రిలీజ్

Reliance Jewels

Reliance Diamond Jewels : రిలయన్స్. ముఖేష్ అంబానీ బ్రాండ్ కంపెనీ. టెలికమ్యూనికేషన్స్ తో పాటు పెట్రో రసాయననాలు, దుస్తులు, రీటెయిల్ ఇలా ఒకటేమిటి పలు సంస్థలు రిలయన్స్ పేరుతో బ్రాండెడ్ గా వెలుగొందుతున్నాయి. అటువంటి రిలయనన్స్ ఆభరణాల వ్యాపారంలో కూడా సత్తా చాటుతోంది. అంబానీ బ్రాండ్ కు తగినట్లుగానే వజ్రాల నగల కలెక్షన్స్ లో డిఫరెంట్ డిజైన్స్ అందిస్తోంది. అటువంటి రిలయన్స్ నుంచి జ్యువెల్స్ నుంచి డైమండ్ డిలైట్స్ కలెక్షన్‌లో సరికొత్త వజ్రాల నగలు విడుదలయ్యాయి. న్యూఇయర్, క్రిస్మస్ సందర్భంగా ఈ సరికొత్త డిజైన్లతో వజ్రాల నగల సెట్స్ రిలీజ్ అయ్యాయి.

Read more : Diamond Gold Rainstorm: వజ్రాల గొడుగు..అరకిలో బంగారం,12 వేల డైమండ్లతో తయారీ

జ్యూవెలర్ బ్రాండ్ అయిన రిలయన్స్ జ్యువెల్స్ ‘డైమండ్ డిలైట్స్’ పేరుతో సరికొత్త కలెక్షన్ లాంఛ్ చేసింది. సరికొత్త డిజైన్లతో ఆకర్షణీయమైన డైమండ్ నెక్లెస్ సెట్స్‌ని రిలీజ్ చేసింది రిలయన్స్. ఇవి లిమిటెడ్ ఎడిషన్ నగలు అని కచ్చితంగా చెప్పాల్సిందే. డిజైనర్ సెట్స్ కాబట్టి కొన్ని పీస్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. క్రిస్మస్ పండుగతో పాటు 2022 సంవత్సరం సందర్భంగా నగలు కొనేవారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ శుభ సంధర్భాలను దృష్టిలో ఈ కొత్త డైమండ్ నగలను పరిచయం చేసింది రిలయన్స్ జ్యువెల్స్.

రిలయన్స్ జ్యువెల్స్ లాంఛ్ చేసిన ‘డైమండ్ డిలైట్స్’ వజ్రాల నగలు కేవలం రూ.49,999 ధర నుంచే అందుబాటులో ఉండటం మరో విశేషం. ఈ డైమండ్ డిలైట్స్ కలెక్షన్‌లో లాంగ్ నెక్లెస్, డైమండ్ చోకర్స్, పలు రకాల డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. పైగా ఇప్పుడు క్రిస్మస్, న్యూఇయరే కాకుండా పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తోంది. భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కాబట్టి.. పార్టీలకు, పెళ్లిళ్లకు ఈ నగలు పర్‌ఫెక్ట్ ఛాయిస్‌గా ఉంటాయనటంలో ఎటువంటి డౌట్ లేదంటున్నారు రిలయన్స్ జ్యువెల్స్ , సీఈఓ సునీల్ నాయక్.

Read more : Cremation Ashes Jewellery: అస్థికలతో తయారు చేసిన నగలకు ఫుల్ డిమాండ్

ఆత్మీయులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వటానికి ఈ నగలు చక్కటి ఛాయిస్ అని..లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్ కాబట్టి స్టాక్స్ ఉన్నంతవరకే లభిస్తాయని చెబుతున్నారు. వజ్రాల నగలు అంటే చాలా ఖరీదులో ఉంటాయి. కానీ ఈ సంవత్సరం వెళ్లబోతోంది. కొత్త సంవత్సరం రాబోతోంది. ఈ సందర్భంగా రియల్స్ జ్యవెలర్స్ అందించే ఈ అద్భుతమైన ఆఫర్ అందించే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామని సీఈఓ సునీల్ నాయక్ వెల్లడించారు.

భారత్ లోని అన్ని రిలయన్స్ జ్యువెల్స్ ఫ్లాగ్‌షిప్ షోరూమ్స్, షాప్ ఇన్ షాప్స్‌లో ఈ కలెక్షన్ అందుబాటులో ఉంటాయి. రిలయన్స్ జ్యువెల్స్ రిలయన్స్ రీటైల్ లిమిటెడ్‌కు చెందిన జ్యువెలరీ వ్యాపార సంస్థ. రిలయన్స్ జ్యువెల్స్‌కు 250 పైగా ఫ్లాగ్‌షిప్ షోరూమ్స్, 125 పైగా పట్టణాల్లో షాప్ ఇన్ షాప్స్ ఉన్నాయి. ఈ షాపుల్లో బంగారు నగలు, వజ్రాల నగలు, సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ వెరైటీ వెరైటీ డిజైన్లలో లభిస్తున్నాయి.