Diamond Gold Rainstorm: వజ్రాల గొడుగు..అరకిలో బంగారం,12 వేల డైమండ్లతో తయారీ

సూరత్ లో జేమ్స్‌ అండ్‌ జ్యువెలరీ ఇంటర్‌నేషనల్‌ ఎగ్జిబిషన్‌లో సూరత్‌ వజ్రాల వ్యాపారులు తయారు చేసిన ‘వజ్రాల గొడుగు’ సెంటర్‌ ఆఫ్‌ ది ఎట్రాక్షన్‌గా నిలిచింది.

Diamond Gold Rainstorm: వజ్రాల గొడుగు..అరకిలో బంగారం,12 వేల డైమండ్లతో తయారీ

Diamond Gold Rainstorm

James,Jewellery International Exhibition: సూరత్. వజ్రాల వ్యాపారానికి..బట్టల వ్యాపారానికి ప్రపంచ ప్రఖ్యాతి చెందింది.కరోనా వచ్చాక వజ్రాలతో తయారుచేసిన మాస్కులు తయారు చేయటంలో గుజరాత్ లోని సూరత్ మరోసారి తన పనితనాన్ని చూపించి అందరి దృష్టిని మరోసారి ఆకర్షించింది. ప్రపంచ వ్యాపార సాంమ్రాజ్యంలో సూరత్‌కు ఓ ప్రత్యేకస్థానం. అటువంటి సూరత్ వ్యాపారులు ‘బంగారం, వజ్రాలతో తయారు చేసిన గొడుగు’తో మరోసారి వార్తల్లో నిలిచారు. సూరత్ లో జేమ్స్‌ అండ్‌ జ్యువెలరీ ఇంటర్‌నేషనల్‌ ఎగ్జిబిషన్‌లో సూరత్‌ వజ్రాల వ్యాపారులు తయారు చేసిన అరుదైన ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందరి దృష్టి వాటిమీదే. వీటిలో మాత్రం సూరత్‌ వ్యాపారులు వజ్రాలతో తయారు చేసిన గొడుగు సెంటర్‌ ఆఫ్‌ ది ఎట్రాక్షన్‌గా నిలిచింది.

Read more : Two Goggles auction : వేలానికి రెండు కళ్లజోళ్లు..ధర రూ.రూ.25 కోట్లు

ఈ డైమండ్‌ గొడుగును చేత్న మంగూకియా అనే వ్యక్తి తయారు చేశారు. ఈ వజ్రాల గొడుగు గురించి..చేత్న మంగూకియా మాట్లాడుతు.. ఈ గొడుగు తయారీలో ‘175 క్యారెట్ల వజ్రాలను ప్రత్యేకంగా అమర్చాం అని తెలిపారు. 12 వేల వజ్రాలు, 450 గ్రాముల బంగారంతో తయారుచేశాం. 25 నుంచి 30 మంది వర్కర్లు 25 రోజులు తయారీలో పాల్గొన్నారని తెలిపారు. డైమండ్‌ మార్కెట్‌లో దీని ధర 25 నుంచి 30 లక్షల వరకు పలకొచ్చని అంచనావేస్తున్నామని అన్నారు. సాధారణంగా అమెరికా, యూరప్‌, హాన్‌కాంగ్‌ వంటి దేశాల నుంచి మాకు ఆర్డర్లు వస్తున్నాయని’ చేత్న తెలిపారు.

Read more : 1765 Antarctic Air : 1765 నాటి ‘గాలితో శిల్పం’..త్వరలో ‘పోలార్‌ జీరో ఎగ్జిబిషన్‌’లో ప్రదర్శన