Reliance Jio : నెట్ వర్క్ సమస్యలు ఎదుర్కొనే యూజర్లకు జియో బంపర్ ఆఫర్..!

జియో నెట్ వర్క్ సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయితే మీకో బంపర్ ఆఫర్ ప్రకటించింది రిలయన్స్ జియో.. రెండు రోజుల పాటు అన్ లిమిటెడ్ ప్లాన్ ఆఫర్ చేస్తోంది.

Reliance Jio : నెట్ వర్క్ సమస్యలు ఎదుర్కొనే యూజర్లకు జియో బంపర్ ఆఫర్..!

Reliance Jio Offers Unlimited Two Day Complimentary Plan To Affected Users After

Reliance Jio Offers : జియో నెట్ వర్క్ సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయితే మీకో బంపర్ ఆఫర్ ప్రకటించింది రిలయన్స్ జియో.. రెండు రోజుల పాటు అన్ లిమిటెడ్ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. ప్రత్యేకించి మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ జియో యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇటీవల కొన్ని చోట్ల రిలయన్స్ జియో నెట్ వర్క్ సమస్యలు తలెత్తాయి. కొన్నిగంటల పాటు నెట్ వర్క్ సమస్యలకు అంతరాయం ఏర్పడింది.

దాంతో జియో యూజర్ల నుంచి నెట్ వర్క్ కనెక్షన్ ఇష్యూపై DownDetector ట్రాకర్ ద్వారా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వెంటనే స్పందించిన జియో నెట్ వర్క్ సమస్యలను ఎదుర్కొన్న కస్టమర్ల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండు రోజుల పాటు అన్‌లిమిటెడ్ ప్లాన్ ప్రకటించింది. నెట్ వర్క్ సేవలకు అంతరాయ కలిగినందుకు పరిహారంగా యూజర్లకు ఈ ఆఫర్ అందిస్తున్నట్టు డేటా సంచనలం జియో ఒక ప్రకటనలో వెల్లడించింది.
Satellite Based Internet: భారత్‌లో మరో ఇంటర్నెట్.. జియోకి పోటీ ఇస్తుందా?

దీనికి సంబంధించి ఆయా క‌స్ట‌మ‌ర్ల‌కు జియో మెసేజ్‌ను కూడా పంపించింది. ప్ర‌స్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లాన్ ముగిసిన వెంట‌నే ఈ రెండు రోజుల అన్‌లిమిటెడ్ ప్లాన్ యాక్టివ్ అవుతుంది. మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల స‌ర్కిళ్ల‌లో జియో యూజ‌ర్లు నెట్‌వ‌ర్క్ స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నారు.

ఆయా రాష్ట్రాల్లో నెట్ వర్క్ సమస్యలను పునరుద్దరించినట్టు మరోవైపు దేశ‌వ్యాప్తంగా ప‌లు చోట్ల నుంచి జియో నెట్‌వ‌ర్క్ స‌మ‌స్య‌లు టెలికం ఆపరేటర్ జియో వెల్లడించింది. జియో అందించే రెండు రోజుల కాంప్లిమెంటరీ ఆఫర్ ఆయా సర్కిళ్లలోని అందరూ యూజర్లకు కాదట.. జియో మెసేజ్ పంపిన యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని చివరిలో ట్విస్ట్ ఇచ్చింది.
Reliance Jio: జియోతో జాక్‌పాట్ కొట్టండిలా.. రీఛార్జ్ చేయండి.. క్యాష్‌బ్యాక్ పొందండి