Jio T20 Plans 2022 : జియో ఐపీఎల్ సరికొత్త ప్లాన్లు.. రివార్డులు.. డిస్నీ హాట్ స్టార్‌లో ఫ్రీగా లైవ్ మ్యాచ్‌లు చూడొచ్చు

Jio T20 Plans 2022 : టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఐపీఎల్ క్రికెట్ అభిమానుల కోసం ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఐపీఎల్ క్రికెట్ ప్రియులకు రివార్డులను అందిస్తోంది.

Jio T20 Plans 2022 : జియో ఐపీఎల్ సరికొత్త ప్లాన్లు.. రివార్డులు.. డిస్నీ హాట్ స్టార్‌లో ఫ్రీగా లైవ్ మ్యాచ్‌లు చూడొచ్చు

Reliance Jio T20 Dhan Dhana Dhan Brings Exciting Plans And Rewards For Cricket Lovers With Free Disney+ Hotstar Subscription For Ipl 2022 (2)

Jio T20 Plans 2022 : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఐపీఎల్ క్రికెట్ అభిమానుల కోసం ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఐపీఎల్ 2022 సీజన్ సందర్భంగా (Jio T20 Dhan Dhana Dhan) రెండు సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో యూజర్లు ఐపీఎల్ 2022 టోర్నమెంట్‌ను ఉచితంగా చూసేందుకు వీలుగా రెండు కొత్త మొబిలిటీ ప్లాన్‌లను ప్రారంభించింది. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) భాగస్వామ్యంతో రూ. 555 రూ. 2999 ధరలతో సరసమైన ధరకే ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. జియో T20 ధన్ ధనా ధన్ ఆఫర్ కింద ఈ ఐపీఎల్ క్రికెట్ ప్రియులకు సరికొత్త ప్లాన్లు, రివార్డ్‌లు అఫర్ చేస్తోంది.

ఈ రెండు ప్లాన్లను యాక్టివేట్ చేసుకుంటే చాలు.. ఎలాంటి అదనపు రీఛార్జ్ చేయకుండానే Disney+ Hotstar సబ్ స్ర్కిప్షన్ పొందవచ్చు. ఈ కొత్త రూ. 555 రూ. 2999 ప్లాన్‌లు జియో ప్రస్తుత క్రికెట్ ప్లాన్‌ల జాబితాకు యాడ్ ఆన్ ప్లాన్లుగా అందిస్తోంది. ఇప్పటివరకూ జియో అందించే క్రికెట్ ప్లాన్ల జాబితాలోని చౌకైన ప్లాన్ ధర రూ. 499 నుంచి రూ. 3119 వరకు అందిస్తోంది. అయితే ఈ కొత్త రూ. 555, రూ. 2999 ప్లాన్‌లను గత 28 రోజులుగా ఏదైనా జియో యాక్టివ్ ప్లాన్‌లో కొనసాగుతున్న యూజర్లు మాత్రమే పొందే అవకాశం ఉంది. జియో ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్‌లకు ఈ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. రూ. 555 జియో ప్లాన్ ప్రాథమికంగా డేటా-ఆన్ ప్లాన్ అందిస్తోంది. అంటే.. మీ ప్రస్తుత ప్లాన్‌‍పై అదనపు డేటాను అందిస్తుంది. ఈ యాడ్ ఆన్ ప్లాన్లపై వాయిస్ కాలింగ్ లేదా SMS బెనిఫిట్స్ పొందలేరు. జియో ఈ ప్లాన్లను ప్రధానంగా జియో ఐపీఎల్ క్రికెట్ వీక్షించే యూజర్ల కోసం ప్రవేశపెట్టింది. ఈ యాడ్ ఆన్ ప్లాన్లను పొందాలంటే ముందుగా మీరు ఇదివరకే ఏదైనా క్రికెట్ ప్లాన్ లో ఉండాలి. అప్పుడే ఈ యాడ్ ఆన్ ప్లాన్లను యాక్టివేట్ చేసుకోవచ్చు.

Read Also :  Free Disney+ Hotstar Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఫ్రీగా చూడొచ్చు..!

 Jio T20 Plans 2022 : జియో సరికొత్త మొబిలిటి ప్లాన్లు ఇవే.. :
కొత్త మొబిలిటీ ప్లాన్ ఆఫర్‌ల విషయానికి వస్తే.. మీరు జియో యాప్‌లు డిస్నీప్లస్ హాట్‌స్టార్‌ను 12 నెలల పాటు సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు. రూ. 555 జియో ప్లాన్ కింద.. 55 రోజుల పాటు రోజుకు 1GB డేటాను కూడా పొందవచ్చు. మీ రోజువారీ డేటా లిమిట్ దాటిన తర్వాత మీ డేటా డౌన్‌లోడ్ స్పీడ్ 64Kbsకి తగ్గిపోతుంది. ఈ ప్లాన్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ మొబైల్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. టీవీ లేదా ల్యాప్‌టాప్‌ డివైజ్ లపై వర్తించదు. జియో రూ. 2999 ప్లాన్ కూడా లిమిటెడ్ పీరియడ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదో వార్షిక ప్లాన్. ఈ ప్లాన్ కింద రోజుకు 2.5GB డేటాతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. రోజుకు 100 SMSలు, Jio యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.

Reliance Jio T20 Dhan Dhana Dhan Brings Exciting Plans And Rewards For Cricket Lovers With Free Disney+ Hotstar Subscription For Ipl 2022f

Reliance Jio T20 Dhan Dhana Dhan Brings Exciting Plans And Rewards For Cricket Lovers

ఈ ప్లాన్ డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో ఒక ఏడాది పాటు అందుబాటులో ఉంటుంది. మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ మాత్రమే. మీరు IPL 2022ని పెద్ద స్క్రీన్‌పై చూడాలనుకుంటే.. Jio రూ. 1499, రూ. 4199 ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్లను యాక్టివేట్ చేసుకుంటే.. పెద్ద స్క్రీన్‌పై డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తాయి. రూ. 1,499 ప్లాన్‌పై రోజుకు 2GB, అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను 84 రోజుల వ్యాలిడిటీతో పొందవచ్చు. డిస్నీప్లస్ హాట్‌స్టార్ యాప్‌కి ఒక ఏడాది ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు. రూ.4199 ప్లాన్ రోజుకు 3GB డేటాతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, SMS బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ప్లాన్ పెద్ద స్క్రీన్‌లపై ఏడాది పాటు Disney Plus హాట్‌స్టార్ సబ్ స్ర్కిప్షన్ అందిస్తుంది.

ఐపీఎల్ సందర్భంగా జియో తమ యూజర్లను ఆకట్టుకునేందుకు (JCPA) JIO క్రికెట్ ఆడండి అంటూ రివార్డులను అందిస్తోంది. Jio ఇంటరాక్టివ్ గేమ్, Jio Cricket Play Along (JCPA), IPL 2022లో పాల్గొనేవారికి పెద్ద రివార్డులను అందిస్తోంది. అంతేకాదు.. ప్రతిఒక్కరికి ఉచితంగా గేమ్, క్రికెట్ అభిమానులు గేమ్‌లోని ప్రత్యేక చాట్ బార్‌లో ఎమోజి స్టిక్కర్‌ల ద్వారా కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. ట్రివియా అభిమానులు (Trivia fans) క్రికెట్ ఆధారిత క్విజ్‌లను ఆడుకోవచ్చు. రూ. 999 అంతకంటే ఆపై ప్లాన్‌లో ఉన్న జియో యూజర్లు.. JioFiber నుంచి అదనంగా JioSTBలోని Disney+ Hotstar యాప్ ద్వారా టీవీ స్క్రీన్‌లలో అన్ని మ్యాచ్‌లను చూడవచ్చు.

Jio T20 Plans 2022 :  బెనిఫిట్స్ ఇవే :
– JIO యూజర్లు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో అన్ని మ్యాచ్‌లను లైవ్‌లోనే చూడొచ్చు.
– డిస్నీ+ హాట్‌స్టార్ భాగస్వామ్యంతో జియో మల్టీ ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది.
– ఈ ప్లాన్‌లపై యూజర్లు మొబైల్, టీవీ లేదా ఇతర డివైజ్‌లలో లైవ్ మ్యాచ్‌లను చూడవచ్చు.
– D+H మొబైల్ ప్లాన్‌లు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ అదనంగా చెల్లించకుండానే  పొందవచ్చు.
– డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో ఎంపిక చేసిన ప్లాన్‌లను కూడా పొందవచ్చు.

Read Also : IPL 2022 Disney+ Hotstar Plans : డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌‌‌లో IPL మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ప్లాన్లు ఇవే.. ధర ఎంతంటే?