Free Disney+ Hotstar Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఫ్రీగా చూడొచ్చు..!

Free Disney+ Hotstar Plans : ఎయిర్ టెల్ యూజర్లకు గుడ్ న్యూస్. ఈ ప్లాన్లలో ఏదైనా యాక్టివేట్ చేసుకుంటే ఏడాది వరకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఉచితంగా యాక్సస్ చేసుకోవచ్చు.

Free Disney+ Hotstar Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఫ్రీగా చూడొచ్చు..!

Airtel Prepaid Plans With Free Disney+ Hotstar Subscription For A Year Here’s The Full List

Free Disney+ Hotstar Plans : ఎయిర్ టెల్ యూజర్లకు గుడ్ న్యూస్. ఈ ప్లాన్లలో ఏదైనా యాక్టివేట్ చేసుకుంటే ఏడాది వరకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఉచితంగా యాక్సస్ చేసుకోవచ్చు. ఒక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మాత్రమే కాదు.. ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజమైన అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి కూడా ఉచితగా స్ట్రీమింగ్ సర్వీసులను యాక్సస్ చేసుకోవచ్చు. టెలికం దిగ్గజాలు కూడా ఓటీటీపై యూజర్ల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని తమ కస్టమర్లకు ఆకర్షణీయమైన ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పటికే రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్లపై స్ట్రీమింగ్ ఓటీటీ కంటెంట్ యాక్సస్ ప్లాన్లను అందిస్తోంది. అలాగే భారతీ ఎయిర్ టెల్ కూడా తమ ప్రీపెయిడ్ యూజర్ల కోసం OTT స్ట్రీమింగ్ ప్లాన్లను అందిస్తోంది. ఈ నెల 26 నుంచి ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ కూడా ప్రారంభం కాబోతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్ లను కూడా వీక్షించే ప్లాన్లను ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తోంది.

భారత ఓటీటీ మార్కెట్లో డిస్నీ+ హాట్‌స్టార్ ( Disney+ Hotstar) సూపర్, ప్రీమియం (నెలవారీ), ప్రీమియం (సంవత్సరానికి)గా మూడు ప్లాన్‌లను అందిస్తుంది. బేస్ ప్లాన్ రూ. 899తో మొదలై రూ. 1499 వరకు ఉంటుంది. ప్లాన్‌లను కొనుగోలు చేసేందుకు మీరు అధికారిక Disney+ Hotstar వెబ్‌సైట్‌ విజిట్ చేయొచ్చు. కానీ, మీరు ప్లాన్‌ను నేరుగా కొనుగోలు చేయడం ఆసక్తి లేకపోతే.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ ఉచిత యాక్సెస్‌ను అందించే ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ ద్వారా సులభంగా యాక్సస్ చేసుకోవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్‌కి ఒక ఏడాది ఉచిత సభ్యత్వాన్ని అందించే Airtel ప్రీపెయిడ్ ప్లాన్‌ల పూర్తి జాబితాను మీకోసం అందిస్తున్నాం.. అవేంటో ఓసారి చూద్దాం..

Airtel ఫ్రీ డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లు :
– ఎయిర్‌టెల్ రూ. 499 ప్లాన్ ఉచిత డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, అన్ లిమిటెడ్ లోకల్, STD, రోమింగ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్, రోజుకు 2GB డేటా, Amazon Prime వీడియో మొబైల్ ప్లాన్‌కి ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫ్రీగా Wynk మ్యూజిక్ యాక్సెస్ చేసుకోవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీపై పొందవచ్చు.

– Airtel Rs 599 ప్లాన్ ఫ్రీగా డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. అన్ లిమిటెడ్ లోకల్, STD, రోమింగ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్, రోజుకు 3GB డేటా, Amazon Prime వీడియో మొబైల్ ప్లాన్‌కి ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఉచిత Wynk మ్యూజిక్ యాక్సెస్, 28 రోజుల వ్యాలిడిటీపై ఈ ప్లాన్ అందిస్తోంది.

Airtel Prepaid Plans With Free Disney+ Hotstar Subscription For A Year Here’s The Full List(1)

Airtel Prepaid Plans With Free Disney+ Hotstar Subscription For A Year Here’s The Full List

– Airtel రూ. 838 ప్లాన్ ఉచిత డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్, రోజుకు 2GB డేటా, Amazon Prime వీడియో మొబైల్ ప్లాన్‌కి ఉచిత యాక్సెస్, ఉచిత Wynk మ్యూజిక్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ మాత్రం 56 రోజుల వ్యాలిడిటీపై అందిస్తుంది.

– Airtel రూ. 839 ప్లాన్ ఉచిత డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్, రోజుకు 2GB డేటా, ఉచిత Wynk మ్యూజిక్ యాక్సెస్, మరిన్నింటిని 84 రోజుల వ్యాలిడిటీ వ్యవధికి అందిస్తుంది.

– Airtel రూ. 2,999 ప్లాన్ ఉచిత డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. అన్ లిమిటెడ్ లోకల్, STD, రోమింగ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్, రోజుకు 2GB డేటా, Amazon Prime వీడియో మొబైల్ ప్లాన్‌కి ఉచిత యాక్సెస్, ఉచిత Wynk మ్యూజిక్ యాక్సెస్, 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది.

– Airtel రూ. 3,359 ప్లాన్ ఉచిత డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. అలాగే అన్ లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్, రోజుకు 2GB డేటా, Amazon Prime వీడియో మొబైల్ ప్లాన్‌కి ఉచిత యాక్సెస్, ఉచిత Wynk మ్యూజిక్ యాక్సెస్ పొందవచ్చు. 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.

ఈ Airtel ప్లాన్‌లన్నింటినీ అధికారిక వెబ్‌సైట్, Airtel యాప్ లేదా Google Pay, PhonePe, FreeCharger వంటి థర్డ్-పార్టీ యాప్స్ నుంచి కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు.

Read Also : Airtel Xstream Premium : ఎయిర్‌టెల్‌ యూజర్లకు శుభవార్త.. రూ.149కే 15 OTT వీడియో స్ట్రీమింగ్‌ ప్రీమియం సర్వీసులు