Airtel Xstream Premium : ఎయిర్‌టెల్‌ యూజర్లకు శుభవార్త.. రూ.149కే 15 OTT వీడియో స్ట్రీమింగ్‌ ప్రీమియం సర్వీసులు

ప్రముఖ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ యూజర్లకు శుభవార్త.. ఎయిర్‌టెల్ కొత్త వీడియో Xstream స్ట్రీమింగ్ ప్రీమియం సర్వీసులను లాంచ్ చేసింది.

Airtel Xstream Premium : ఎయిర్‌టెల్‌ యూజర్లకు శుభవార్త.. రూ.149కే 15 OTT వీడియో స్ట్రీమింగ్‌ ప్రీమియం సర్వీసులు

Airtel Xstream Premium Airt

Airtel Xstream Premium : ప్రముఖ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ యూజర్లకు శుభవార్త.. ఎయిర్‌టెల్ కొత్త వీడియో Xstream స్ట్రీమింగ్ ప్రీమియం సర్వీసులను లాంచ్ చేసింది. అందులో 15 (OTT) వీడియో యాప్స్‌ (APPs)కు సంబంధించిన సర్వసులను అందించనుంది. సింగిల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ కేవలం నెలకు రూ.149 ప్రారంభ ధరకే అందించనున్నట్టు ఎయిర్‌టెల్ వెల్లడించింది.

అయితే ఎయిర్‌టెల్ Xstream ప్రీమియం ఒక యాప్‌లో 15 భారతీయ, గ్లోబల్ వీడియో OTTల నుంచి మొత్తం కంటెంట్‌ను ఆఫర్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎయిర్ టెల్ అందించే వీడియో 15 ఓటీటీ స్ట్రీమింగ్ ప్రీమియం (Airtel Xstream Premium) సర్వీసుల్లో SonyLIV, ErosNow, Lionsgate Play, Hoichoi, ManoramaMax, Shemaroo, Ultra, HungamaPlay, EPICon, Docubay, DivoTV, Klikk, Nammaflix, Dollywood, Shorts TV వంటి OTT ప్లాట్‌ఫారమ్‌లకు వినియోగదారులు సులభంగా యాక్సస్ చేసుకోవచ్చు.

ఎయిర్ టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం యూజర్లు 10,500 కంటే ఎక్కువ సినిమాలు, టీవీషోలతో పాటు లైవ్ ఛానెల్‌ పెద్ద కేటలాగ్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. Xstream అనేది Airtel అందించే ఉచిత ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసు.. కాగా.. వార్షిక సభ్యత్వం (Annual Subscription) రూ.1,499గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. వార్షిక ప్యాకేజీ ద్వారా సర్వీసులు పొందాలంటే నెలకు కేవలం రూ.125లకే పొందవచ్చు. దేశ, విదేశాలకు చెందిన 15 (OTT)ల కంటెంట్‌ను ఒకే యాప్‌లో సర్వీసులను యాక్సస్ చేసుకోవచ్చునని తెలిపింది.

Airtel Xstream Premium : 10,500 మూవీలు‌, షోలు, లైవ్‌ చానళ్లు చూడొచ్చు..
యాప్ లేదా వెబ్ ద్వారా మొబైల్స్, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లతో సహా అన్ని డివైజ్‌ల్లో ఎయిర్‌టెల్ Xstream ప్రీమియంను యూజర్లు యాక్సస్ చేసుకోవచ్చునని ఎయిర్‌టెల్ తెలిపింది. ఈ Xstream సెట్-టాప్ బాక్స్ ద్వారా యూజర్లు OTT కంటెంట్ యాక్సస్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ యూజర్లు మాత్రమే ఈ సర్వీసును ఉపయోగించుకునే వీలుంది.

ఈ పేమెంట్ ఆఫర్ కోసం కంపెనీ 20 మిలియన్ల మంది కొత్త యూజర్లపై దృష్టి సారిస్తోందని ఎయిర్‌టెల్ డిజిటల్ సీఈఓ తెలిపారు. ఈ మొత్తం కంటెంట్ ఎయిర్‌టెల్ కస్టమర్లకు ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొస్తోంది. నెలకు కేవలం రూ. 149 ధర మాత్రమేనని ప్రకటనలో వెల్లడించింది.

Read Also : Reliance Jio New Plans : జియో యూజర్లకు అలర్ట్.. ప్రీపెయిడ్ ప్లాన్ ధరలు మారాయి.. చెక్ చేసుకోండి..!