TVS Rider 125CC : స్పోర్ట్స్ బైక్ లుక్‌తో టీవీఎస్ స‌రికొత్త రైడ‌ర్.. ధర ఎంతంటే?

ప్రముఖ టూ వీలర్స్ కంపెనీ TVS Motors నుంచి స్పోర్ట్స్ లుక్‌తో సరికొత్త బైక్ మార్కెట్లోకి వచ్చింది. టీవీఎస్‌ మోటార్స్ సిగ్మంట్లలో 125CC సామ‌ర్థ్యంతో సరికొత్త రైడర్‌ను ప్రవేశపెట్టింది

TVS Rider 125CC : స్పోర్ట్స్ బైక్ లుక్‌తో టీవీఎస్ స‌రికొత్త రైడ‌ర్.. ధర ఎంతంటే?

Tvs Raider 125 First Ride Review Can It ‘shine’ With All That ‘glamour

Sports look TVS Rider : ప్రముఖ టూ వీలర్స్ కంపెనీ TVS Motors నుంచి స్పోర్ట్స్ లుక్‌తో సరికొత్త బైక్ మార్కెట్లోకి వచ్చింది. టీవీఎస్‌ మోటార్స్ సిగ్మంట్లలో 125CC సామ‌ర్థ్యంతో సరికొత్త రైడర్‌ను ప్రవేశపెట్టింది. గత నాలుగేళ్లుగా
మార్కెట్లో ఉనికి కోల్పోయిన టీవీఎస్.. ఒకప్పటి 125cc బైక్ సిగ్మెంట్లతో రీఎంట్రీ ఇచ్చింది. అదే.. TVS Raider 125cc బైక్. దీని ధర మార్కెట్లో రూ.77,500గా నిర్ణయించింది. ప్రత్యేకించి యువ‌త‌ను ఆకట్టుకునేందుకు స్పోర్ట్స్‌ బైక్‌ లుక్స్‌తో ఈ రైడ‌ర్‌ బైకును డిజైన్ చేసింది.
No Money Transferred : ఆ పిల్లల అకౌంట్లో రూ.900 కోట్లు ట్రాన్స్‌ఫర్ కాలేదు.. బ్యాంకు క్లారిటీ!

ఇప్ప‌టికే 35 శాతం మంది కస్టమర్లలో 125cc సెగ్మెంట్ బైక్స్ కొనుగోలు చేస్తున్నార‌ని, అందులో ఎక్కువగా యువకులే ఉన్నారని కంపెనీ టీవీఎస్ మోటార్స్ పేర్కొంది. భారత మార్కెట్లతో పాటు సార్క్‌ దేశాలు, లాటిన్‌ అమెరికా దేశాల్లోనూ ఈ బైక్ సేల్స్ ప్రారంభించనున్నట్టు తెలిపింది. స్పోర్ట్స్ సరికొత్త లుక్స్‌తో డిజైన్ చేసిన‌ ఈ బైక్‌లో సరికొత్త ఆల్ హెడ్‌ల్యాంప్‌ క్రాస్ స్టయిల్డ్ LED DRLs అమర్చింది. చీకటిలో స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేశారు. రైడ‌ర్ 125cc సీటు కిందిభాగంలో 10 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌, ఇంజిన్‌ గార్డ్‌ స్పెషల్ డిజైన్లతో అమర్చారు. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌, స్ప్లిట్ సీట్ రైడ‌ర్ల‌కు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

ఈ రైడర్ బైకు ఎల్లో, రెడ్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో కస్టమర్లకు వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంటాయి. గేర్‌షిఫ్ట్‌ ఇండికేటర్‌, సగటు వేగం నమోదు చేసే ఇండికేటర్లు కూడా ఉన్నాయి. 124.8cc సింగిల్‌ సిలిండర్‌ 3 వాల్వ్ సామ‌ర్థ్యం ఇంజిన్‌ అమర్చారు. 124.8cc త్రి వాల్యూ, సింగిల్ సిలిండర్ ఇంజిన్, 7,500RPM వద్ద 11hp పవర్, 6,000 ఆర్పీఎం వద్ద 11.2Nm టార్చ్‌ను విడుదల చేస్తుంది. అంతేకాదు.. IntelliGO tech ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఇదో సైలెంట్ ఇంజిన్ స్టార్ట్ సిస్టమ్.. అంటే.. అచ్చం ఎలక్ట్రిక్ బైక్ సౌండ్ మాదిరిగా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఈ బైక్ ఎకో మోడ్‌లో టాప్ స్పీడ్ 94kmph వరకు అందిస్తుంది. పవర్ మోడ్ లో 104kmph వేగాన్ని అందిస్తుంది. ఒక రోజుంతా గ్యాప్ లేకుండా 80-85kmph వరకు తిరిగేయొచ్చు.
No Money Transferred : ఆ పిల్లల అకౌంట్లో రూ.900 కోట్లు ట్రాన్స్‌ఫర్ కాలేదు.. బ్యాంకు క్లారిటీ!