No Money Transferred : ఆ పిల్లల అకౌంట్లో రూ.900 కోట్లు ట్రాన్స్‌ఫర్ కాలేదు.. బ్యాంకు క్లారిటీ!

స్కూల్‌కు వెళ్లే విద్యార్థుల బ్యాంకు అకౌంట్లో రూ.900 కోట్ల నగదు క్రెడిట్ అయ్యాయనే వార్త అందరిని షాకింగ్ గురిచేసింది. అన్నికోట్ల రూపాయలు వారి అకౌంట్లోకి ఎవరూ ట్రాన్స్ ఫర్ చేశారు..

No Money Transferred : ఆ పిల్లల అకౌంట్లో రూ.900 కోట్లు ట్రాన్స్‌ఫర్ కాలేదు.. బ్యాంకు క్లారిటీ!

No Money Transferred Dm After 2 Bihar Boys Bank Statements

No Money Transferred Over 900 crore  : స్కూల్‌కు వెళ్లే విద్యార్థుల బ్యాంకు అకౌంట్లో రూ.900 కోట్ల నగదు క్రెడిట్ అయ్యాయనే వార్త అందరిని షాకింగ్ గురిచేసింది. అన్నికోట్ల రూపాయలు వారి అకౌంట్లోకి ఎవరూ ట్రాన్స్ ఫర్ చేశారు.. ఎందుకు వేశారనే చర్చ నడిచింది. ఇద్దరు విద్యార్థుల అకౌంట్లో రూ.900 కోట్లు క్రెడిట్ అయినట్టు బ్యాంకు స్టేట్ మెంట్స్ రావడం చూసి బ్యాంకు అధికారులు సహా అందరు ఆశ్చర్యపోయారు. దీనిపై బ్యాంకు ఉన్నత అధికారులకు సమాచారం అందించగా.. విచారించారు.

అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గురుచంద్ర విశ్వాస్, అసిత్ కుమార్ అనే విద్యార్థుల అకౌంట్లోకి 900 కోట్ల నగదును ఏ బ్యాంకు, ప్రభుత్వం జమ చేయలేదని ఉత్తర బీహార్ గ్రామీణ్ బ్యాంకు కతియార్ డీఎం ఉదయాన్ మిశ్రా స్పష్టం చేశారు. కేవలం సాంకేతిక లోపం వల్లే అలా జరిగిందని బ్యాంకు మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. కోర్ బ్యాంకింగ్ సొల్యుషన్స్ (CBS)లో సాంకేతిక సమస్య కారణంగా విద్యార్థుల అకౌంట్లలో స్టేట్ మెంట్స్ క్రెడిట్ అయినట్టుగా చూపించాయని తెలిపారు. ఇప్పుడా ఆ సమస్యను పరిష్కరించినట్టు వెల్లడించారు.
School Boys : బడికి వెళ్లే పిల్లల బ్యాంకు అకౌంట్లో రూ.900 కోట్లు.. ఎలా వచ్చాయంటే?

ఉత్తర బీహార్ రాష్ట్రంలోని కటిహార్ జిల్లాలోని బాగౌరా పంచాయితీలోని పస్త్య గ్రామంలో గురుచంద్ర విశ్వాస్, అసిత్ కుమార్ అనే ఇద్దరూ విద్యార్థులు నివసిస్తున్నారు. పాఠశాల యూనిఫామ్‌ల కోసం రాష్ట్ర ప్రభుత్వం వారి బ్యాంకుల్లో ఇటీవల కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసింది. తమ అకౌంట్లో క్రెడిట్ సొమ్ము గురించి తెలుసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్థానిక సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (CPC)కు వెళ్లారు. కానీ, వారిద్దరి బ్యాంకు అకౌంట్లో రూ.900 కోట్ల నగదు ఉందని తెలిసి బ్యాంకు అధికారులతో సహా విద్యార్థులు షాక్ అయ్యారని నివేదిక పేర్కొంది.


ఇద్దరు విద్యార్థుల్లో ఒకరికి ఉత్తర బీహార్ గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఉంది. విశ్వాస్ అకౌంట్లో రూ. 60 కోట్లు ఉండగా.. అసిత్ కుమార్ అకౌంట్లో రూ. 900 కోట్లు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. బ్రాంచ్ మేనేజర్ మనోజ్ గుప్తా వారి అకౌంట్లను పరిశీలించి ఆశ్చర్యపోయారు. వెంటనే డబ్బు విత్ డ్రా చేయకుండా అకౌంట్ ఫ్రీజ్ చేసేశారు. అలాగే కోట్ల రూపాయల నగదు వారి అకౌంట్లలోకి ఎలా క్రెడిట్ అయిందో విచారణకు ఆదేశించారు. ఉన్నత అధికారులకు ఈ సమాచారాన్ని అందించారు. బ్యాంక్ సీనియర్ అధికారులు కోట్ల నగదు ఎలా క్రెడిట్ అయిందో గుర్తించే పనిలో పడ్డారు. విచారణలో సాంకేతిక లోపం వల్లే భారీనగదు క్రెడిట్ అయినట్టు గుర్తించారు.
Nexus Phone : ఐఫోన్‌-13పై గూగుల్‌ నెక్సస్‌ ట్రోలింగ్..!