AP Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జి పైనుంచి పడిపోయిన ట్రావెల్స్ బస్సు, ఐషర్ వాహనం..
AP Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఐషర్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది.
Private travel bus and Eicher vehicle collided in Anantapur district Andhra Pradesh
AP Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా పామిడి మండలం పొగూరూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. పొగురూరు బ్రిడ్జిపై వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఐషర్ వాహనం ఢీకొట్టింది. ఆ వెంటనే రెండు వాహనాలు బ్రిడ్జి పైనుంచి పడిపోయాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 20మందికి తీవ్రగాలయ్యాయి. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : Monsoon Driving Tips : వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ 10 మిస్టేక్స్ అస్సలు చేయొద్దు!
ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మరికొందరిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 32మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
ప్రమాదం కారణంగా రెండు వాహనాల ముందు భాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బస్సు, ఐషర్ వాహనాల డ్రైవర్లు క్యాబిన్లలోనే ఇరుక్కుపోయారు. పోలీసులు, స్థానిక ప్రజలు తీవ్రంగా శ్రమించి వాహనాల బాగాలను కట్ చేసి ఇద్దరు డ్రైవర్లను సురక్షితంగా బయటకు తీశారు. వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అయితే, బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఐషర్ వాహనం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అదుపు తప్పి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుండగా.. ఐషర్ వాహనం డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే ఈ ప్రమాదంకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ ను పునరుద్దరించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
