Dussehra Special Trains : సొంతూరికి వెళ్లేవారికి బిగ్ రిలీఫ్.. దసరా, దీపావళికి ఈ రూట్లలో స్పెషల్ ట్రైన్లు..!
Dussehra Special Trains : దసరా, దీపావళి పండగ రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ముందుగానే ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవడం ద్వారా ఇబ్బందులను తగ్గించుకోవచ్చు.
Dussehra Special Trains
- పండక్కి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్..
- రైలు ప్రయాణికులకు పండగ కానుక..
- నవంబర్ వరకు ప్రత్యేక రైళ్ల సర్వీసులు
- దసరా రద్దీకి చెక్.. ఏపీ, తెలంగాణ మీదుగా అదనపు రైళ్లు
Dussehra Special Trains : పండగలు వచ్చేస్తున్నాయ్.. వచ్చే నెలలో దసరా, దీపావళి రానున్నాయి. ఈ రెండు పండగల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. పండగ ప్రయాణికులకు భారత రైల్వే శుభవార్త చెప్పింది.
పండగల సమయంలో రైళ్లపై పెరగనున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా 100 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ స్పెషల్ ట్రైన్లు నవంబర్ వరకు వివిధ మార్గాల్లో నడవనున్నాయి. ఇప్పటికే కొన్ని రైళ్లకు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, అస్సాం, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలను కలుపుతూ ఈ ప్రత్యేక సర్వీసులను నడపనున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే పలు రైళ్లు ప్రయాణికులకు ఉపయోగపడనున్నాయి.
Read Also : Nara Lokesh : స్వాతంత్య్ర త్యాగాల స్ఫూర్తి.. తరగతి గది నుంచే సామాజిక మార్పు.. భారతీయంలో లోకేష్, చాగంటి
చర్లపల్లి–నాగర్‌కోయిల్ (07535) ప్రత్యేక రైలు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 23 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది. నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, చెన్నై ఎగ్మోర్, తిరుచిరాపల్లి తదితర స్టేషన్లలో ఆగుతుంది.
అలాగే, చర్లపల్లి–శ్రీకాకుళం (07037) రైలు అక్టోబర్ 6 నుంచి నవంబర్ 24 వరకు, తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం–చర్లపల్లి (07038) రైలు అక్టోబర్ 7 నుంచి నవంబర్ 25 వరకు సర్వీసులు అందించనున్నాయి. ఈ రైళ్లు నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం తదితర స్టేషన్లలో ఆగుతాయి.
మరోవైపు.. ప్రయాగ్‌రాజ్–తిరునెల్వేలి (04171) ప్రత్యేక రైలు కూడా తెలుగు రాష్ట్రాల మీదుగా నడుస్తుంది. ఈ సర్వీసు రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు తదితర ప్రాంతాలను కలుపుతుంది.
