Nara Lokesh : స్వాతంత్య్ర త్యాగాల స్ఫూర్తి.. తరగతి గది నుంచే సామాజిక మార్పు.. భారతీయంలో లోకేష్, చాగంటి
Kakinada Bharateeyam Event : కాకినాడలో జరిగిన ‘భారతీయం’ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, చాగంటి కోటేశ్వరరావు విద్యార్థుల్లో దేశభక్తి, నైతిక విలువలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన అడ్మిషన్ల వివరాలను లోకేష్ వెల్లడించారు.
Kakinada Bharateeyam Event
- పిల్లల్లో దేశభక్తి నింపాలి.. తరగతి గది నుంచే దేశ నిర్మాణం
- విద్యార్థుల్లో దేశభక్తి.. నైతిక విలువలే లక్ష్యం
- పుస్తకాల చదువే కాదు.. విలువల విద్య కావాలి
- ‘భారతీయం’ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, చాగంటి కోటేశ్వరరావు
Nara Lokesh – Kakinada Bharateeyam Event : కాకినాడలో నిర్వహించిన ‘భారతీయం’ కార్యక్రమం దేశభక్తి, నైతిక విలువలు, విద్యా వ్యవస్థపై ఆసక్తికర చర్చకు వేదికగా నిలిచింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే అంశాలను ప్రస్తావించారు. విద్యార్థుల్లో దేశభక్తి, నైతిక విలువలను పెంపొందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా సాగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
యువతలో దేశభక్తి పెరుగుతోంది :
ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర సంగ్రామం (Nara Lokesh) కేవలం గత చరిత్ర కాదని, భావితరాలకు అందించాల్సిన వారసత్వ సంపద అని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు నడయాడిన ప్రాంతాలను సందర్శించడం ద్వారా యువతలో దేశభక్తి మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.
ముఖ్యంగా అండమాన్‌లోని కాలాపాని జైలు గురించి తెలుసుకుంటే స్వాతంత్య్ర సమరయోధులు అనుభవించిన కష్టాలు అర్థమవుతాయని చెప్పారు. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ వెనుక ఉన్న త్యాగాలను పిల్లలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.
దేశంలోనే నంబర్‌వన్‌గా.. :
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. నిజమైన సామాజిక మార్పు తరగతి గది నుంచే మొదలవుతుందని అన్నారు. ఆ మార్పుకు దోహదపడేందుకే తాను విద్యాశాఖను ఎంచుకున్నానని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న కృషికి నైతిక విలువలు తోడైతే ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also : APPSC FSO Recruitment 2026 : ఏపీలో జాబ్స్ పడ్డాయ్.. డిగ్రీ పాసైనా వారికే ఛాన్స్.. అప్లయ్ చేసే డేట్ ఇదే..!
విద్యార్థులు చిన్న చిన్న సమస్యలకే కుంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని మంత్రి లోకేష్ సూచించారు. విద్యావ్యవస్థపై ప్రజల నమ్మకం పెరుగుతోందనడానికి ఇదే సరైన నిదర్శనమన్నారు. ఈ ఏడాది 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మారారు.
ఇంటర్లో మరో 10 వేల అడ్మిషన్లు పెరగడం నిదర్శనమని లోకేష్ వెల్లడించారు. విద్యావ్యవస్థ రాజకీయాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.
