AP Politics : సీఎం చంద్రబాబు కామెంట్స్‌తో అలర్ట్ అయిన జనసేన.. నరసాపురంలో అసలేం జరుగుతోంది?
AP Politics : : పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన నరసాపురం నియోజకవర్గంలో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తుంది. సీఎం చంద్రబాబు కామెంట్స్‌పై జనసేనలోనే కాదు.. ఇటు కూటమిలో.. అటు ప్రజల్లోనూ ఆసక్తికర డిస్కషన్ నడుస్తోంది.
AP Politics
AP Politics : : పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన నరసాపురం నియోజకవర్గంలో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తుంది. సీఎం చంద్రబాబు కామెంట్స్‌పై జనసేనలోనే కాదు.. ఇటు కూటమిలో.. అటు ప్రజల్లోనూ ఆసక్తికర డిస్కషన్ నడుస్తోంది. జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పనితీరుపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
Also Read : Gold-Silver Prices Today : బంగారం కొనేవారికి శుభవార్త.. ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఇవే..
పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలు నరసాపురం రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. నరసాపురం నియోజకవర్గ నోడల్ ఆఫీసర్ పనితీరు సరిగా లేదని, స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పనితీరు కూడా అంత సంతృప్తికరంగా లేదంటూ సీఎం బహిరంగంగానే కామెంట్స్ చేశారు. సభలోనే ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో వేదికపై ఉన్న నాయకులతో పాటు హాజరైన ప్రజలు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
సీఎం చంద్రబాబు ప్రజా వేదికపైనే ఎమ్మెల్యే పనితీరుపై కామెంట్స్ చేయడంతో సభకు హాజరైన వారంతా చప్పట్లు కొట్టి గోల చేశారు. అయితే ఎమ్మెల్యేతో పాటు జనసేన శ్రేణులు మాత్రం.. డిఫెన్స్‌లో పడ్డారన్న టాక్ వినిపిస్తోంది. నరసాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎక్కడ లోపాలు జరిగాయనే దానిపై స్థానిక కూటమి నేతల్లోనూ చర్చ నడుస్తోందట. నోడల్ ఆఫీసర్ సమన్వయ లోపం వల్ల ఇలా జరిగిందా లేక అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారా అన్న దానిపై రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి.
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి కూడా ఈ విషయం వెళ్ళినట్లు చెబుతున్నాయి జనసేన వర్గాలు. మరోవైపు వైసీపీ నాయకత్వం ఈ అవకాశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తోంది. భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో స్థానిక ఎమ్మెల్యే విఫలమయ్యారని.. సీఎం చేసిన వ్యాఖ్యలే అందుకు సాక్ష్యమని విపక్షం విమర్శలు గుప్పిస్తుంది. పొత్తులో భాగంగా గెలిచిన స్థానంలో కూటమి పెద్దల నుంచే ఇలాంటి వ్యాఖ్యలు రావడం స్థానిక నాయకత్వానికి మింగుడుపడటం లేదట. ఎలాగైనా జరిగిన డ్యామేజీని కవర్ చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రయత్నిస్తుంటే.. అవేవి ఫలించడం లేదంటున్నారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలతో నరసాపురంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయోనన్న ఆందోళన స్థానిక కూటమి శ్రేణుల్లో కనిపిస్తోంది. సీఎం వ్యాఖ్యలతో అలర్ట్ అయిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, నియోజకవర్గంలో పనులను వేగవంతం చేసి అధికారులను సమన్వయం చేసుకునే పనిలో పడ్డారట. అయితే అధికారుల అలసత్వం వల్లే ఈ పరిస్థితి వచ్చిందా.? లేక రాజకీయ వ్యూహాల్లో భాగంగానే ఈ విమర్శలు వచ్చాయా అన్నది నరసాపురంలో చర్చనీయాంశంగా మారింది. జనసేన అధిష్టానం కూడా ఎమ్మెల్యే నాయకర్ పనితీరుపై నివేదిక తెప్పించుకొని ముఖ్యమంత్రి కామెంట్స్.. వాస్తవ పరిస్థితులపైనా ఆరా తీసిందట. ఇప్పటికే పార్టీ అధిష్టాన పెద్దలు ఎమ్మెల్యే నాయకర్‌కు కొంత హెచ్చరికలతో కూడిన వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. భవిష్యత్తులో ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా నియోజకవర్గంలో అభివృద్ధిపై దృష్టి పెట్టాని సూచించినట్లు తెలుస్తోంది.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో జనసేనలో ఉన్న గందరగోళ పరిస్థితుల్ని సెట్ చేసి కూటమి నేతలతో కలిసి విజయమే లక్ష్యంగా పనిచేయాలని కూడా పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి కామెంట్స్ వెనుక కూటమి నేతల కుట్ర ఏమైనా ఉందా లేక నిజంగానే ఎమ్మెల్యే పనితీరు బాగోలేదా అనే దానిపై అధిష్టానం సీరియస్‌గా దృష్టి పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా నరసాపురం వేదికగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కూటమిలో సంచలనంగా మారాయి. ఈ ప్రజా వేదిక సెగ నరసాపురం రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి మరి.
