Smriti Mandhana : చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. మహిళల టీ20 క్రికెట్లో ఏకైక ప్లేయర్..
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అరుదైన ఘనత సాధించింది.
Asian Games 2026 Smriti mandhana Creates history to becomes Most runs in wqmens WT20Is
Smriti Mandhana : భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. ఆదివారం ఆసియా క్రీడల్లో భాగంగా బంగ్లాదేశ్‌తో సెమీస్ మ్యాచ్‌లో 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె ఈ ఘనతను అందుకుంది.
ఈక్రమంలో ఆమె న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్‌ను అధిగమించింది. 186 మ్యాచ్‌ల్లో బేట్స్ 4758 పరుగులు చేయగా మంధాన కేవలం 178 మ్యాచ్‌ల్లోనే ఆమెను అధిగమించింది.
Shreyanka Patil : జపాన్‌లో భారత మహిళా క్రికెటర్.. శ్రేయాంక పాటిల్ ఫోటోలు వైరల్..
ఈ మ్యాచ్‌లో మంధాన 19 బంతులు ఎదుర్కొంది. 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేసింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మతో కలిసి తొలి వికెట్‌కు 72 పరుగులు జోడించింది.
అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు వీరే..
* స్మృతి మంధాన (భారత్) – 178 మ్యాచ్‌ల్లో 4788 పరుగులు
* సుజీ బేట్స్ (న్యూజిలాండ్) – 186 మ్యాచ్‌ల్లో 4758 పరుగులు
* హర్మన్ ప్రీత్ కౌర్ (భారత్) – 209 మ్యాచ్‌ల్లో 4287 పరుగులు
* చమరి ఆటపట్టు (శ్రీలంక) – 172 మ్యాచ్‌ల్లో 4282 పరుగులు
* సోఫీ డివైన్ (న్యూజిలాండ్) – 158 మ్యాచ్‌ల్లో 3817 పరుగులు
🚨 𝐑𝐄𝐂𝐎𝐑𝐃 𝐀𝐋𝐄𝐑𝐓 🚨@mandhana_smriti is now the leading run-getter in Women’s T20I history 🫡👏
Updates ▶️ https://t.co/zMJKYRAVhE#TeamIndia | #AsianGames pic.twitter.com/kmj5gWqFiy
— BCCI Women (@BCCIWomen) September 20, 2026
