Team India : మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా గేమ్స్ పతకాలను టీమ్ఇండియా తీసుకోవాల్సిందేనా?
ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు పతకాలు (Team India) గెలిస్తే ఆ తరువాత ఏం జరుగుతుంది ? అన్న అంశంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
Will Team India Accept Asian Games Medals From Mohsin Naqvi
Team India : ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు పతకాలు గెలిస్తే ఆ తరువాత ఏం జరుగుతుంది ? అన్న అంశంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ఆయా మెడల్స్ తీసుకునేందుకు భారత ప్లేయర్లు అంగీకరిస్తారా? నిబంధనలు ఏం చెబుతున్నాయి? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా.. 2025లో భారత పురుషుల జట్టు, 2026లో భారత మహిళల జట్లు ఆసియా కప్‌లో విజేతలుగా నిలిచినప్పటికి కూడా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడిగా కూడా ఉన్న నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాలు సాధిస్తే ఏం జరుగుతుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. పతకాలు గెలిచిన తరువాత, అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటి నుంచి దానిపై మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నాడు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా నిబంధనల ప్రకారం.. ఆసియా మండలి అధ్యక్షుడు విజేతలకు మెడ్సల్ అందిస్తారు. అయితే.. కొన్ని సందర్భాల్లో ఈ మెడల్స్ అందించే బాధ్యతలను ఓసీఏలోని ఇతర సభ్యులకు అప్పగించే అధికారం అధ్యక్షుడికి ఉంది. ప్రస్తుతం ఆసియా ఓలింపిక్ మండలిలో నఖ్వీ సభ్యుడిగా ఉన్నాడు. ఒకవేళ.. నఖ్వీకి మెడల్స్ అందించే బాధ్యత ఇస్తే భారత ప్లేయర్లు తప్పకుండా వాటిని తీసుకోవాల్సి ఉంటుంది.
Womens Asian Games 2026 : ఆసియా గేమ్స్‌లో సెమీస్‌కు చేరిన భారత్.. జపాన్ పై ఘన విజయం..
ఒకవేళ తీసుకునేందుకు నిరాకరిస్తే.. గేమ్స్, OCA, అధికారికంగా నియమించిన ప్రతినిధిని అవమాన పరిచిన కిందకే వస్తుందని, అప్పుడు క్రమశిక్షణ చర్యలు కూడా ఉండవచ్చునని భారత ఒలింపిక్ సంఘం వర్గాలు తెలిపాయి. పతకాల ప్రదానోత్సవంలో ఎలాంటి ప్రదర్శనలు, వాణిజ్య, రాజకీయ, మత లేదా జాతి పరమైన ప్రచారానికి అనుమతి లేదు.
