Womens Asian Games 2026 : ఆసియా గేమ్స్‌లో సెమీస్‌కు చేరిన భారత్.. జపాన్ పై ఘన విజయం..
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో (Womens Asian Games 2026) భారత మహిళల క్రికెట్ జట్టు సెమీస్‌కు చేరుకుంది.
Womens Asian Games 2026 india beat japan and enter into semis
Womens Asian Games 2026 : జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు సెమీస్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంతో టీమ్ఇండియా సెమీస్‌కు చేరుకుంది. ఆదివారం (సెప్టెంబర్ 20) జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
భారత బౌలర్ల ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్ 19.5 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. జపాన్ బ్యాటర్లలో అయాకా కాటో స్టాఫోర్డ్(25), హరునా ఇవాసాకి (10) లు మాత్రమే రెండు అంకెల స్కోరు చేశారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. భారత బౌలర్లలో తెలుగు తేజం శ్రీచరణి నాలుగు వికెట్లు తీసింది. షఫాలీ వర్మ రెండు వికెట్లు పడగొట్టింది. శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మలు చెరో వికెట్ సాధించారు.
అనంతరం 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ (40 నాటౌట్; 15 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టగా రిచా ఘోష్ (12 నాటౌట్; 6 బంతుల్లో 2 ఫోర్లు) రాణించింది.
𝐈𝐍𝐓𝐎 𝐓𝐇𝐄 𝐒𝐄𝐌𝐈-𝐅𝐈𝐍𝐀𝐋 👏👏
A convincing 8️⃣-wicket win for #TeamIndia in the quarter-final to seal a spot in the final four 🇮🇳
Scorecard ▶️ https://t.co/MIoR07Vyms #AsianGames pic.twitter.com/UANuW4ThHW
— BCCI Women (@BCCIWomen) September 18, 2026
