Home Guard Hafeezpet Incident : హైదరాబాద్‌లో అమానుష ఘటన.. మహిళ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన హోంగార్డు! వీడియో వైరల్.. సీరియస్ యాక్షన్
Home Guard Hafeezpet Incident : హైదరాబాద్ నగరం హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళపై హోంగార్డు దురుసుగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లెవ్తెతుతున్నాయి. దీంతో ఉన్నతాధికారులు సదరు హోంగార్డుపై బదిలీవేటు వేశారు.
Home Guard Hafeezpet Incident
Home Guard Hafeezpet Incident : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ హోంగార్డ్ మహిళ జుట్టుపట్టుకొని ఈడ్చుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. సదరు హోంగార్డుపై బదిలీ వేటు వేశారు.
హైదరాబాద్ నగరం హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళపై హోంగార్డు దురుసుగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. మహిళను కొట్టడంతో పాటు ఆమె జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు.
శుక్రవారం రాత్రి హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వీడియోలో వివరాల ప్రకారం.. విధుల్లో ఉన్న హోంగార్డు ఆనంద్ ఓ మహిళతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం ఆమె చెంపపై పలుమార్లు కొట్టాడు. దీంతో మహిళ కిందపడిపోయింది.. అంతటితో ఆగకుండా మహిళ జట్టును పట్టుకొని బయటకు ఈడ్చుకెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది. స్థానిక వ్యక్తులు వారించినా హోంగార్డు పట్టించుకోకుండా మహిళను జట్టుపట్టుకొని కొద్దిదూరం ఈడ్చుకెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో హోంగార్డు తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఉన్నతాధికారులు స్పందించి సదరు హోంగార్డుపై బదిలీ వేటు వేశారు.
ఈ ఘటనపై మియాపూర్ ఎస్‌హెచ్‌వో ఎన్.జయరాం సియాసత్ స్పందించారు. మహిళ మద్యం మత్తులో ఉన్నట్లు, హోంగార్డును దూషించినట్లు తెలిపారు. అయితే, ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని, ప్రస్తుతం ఆమె ఆచూకీ లభించలేదని పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఆచూకీ లభించిన తర్వాత ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేస్తామని తెలిపారు
మరోవైపు ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్లో జరిగిన ఘటనపై విచారణ జరిపినట్లు తెలిపింది. విధుల్లో ఉన్న వ్యక్తి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన హోంగార్డుగా గుర్తించినట్లు పేర్కొంది. అనంతరం అతడిని తెలంగాణ పోలీస్ శాఖకు తిరిగి పంపి, క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేసినట్లు వెల్లడించింది. అయితే, సదరు హోంగార్డు ఆనంద్‌ను వికారాబాద్‌కు బదిలీ చేసినట్లు సమాచారం.
The incident reported at Hafizpet Railway Station was enquired, and the personnel concerned was identified as Home Guard of Telangana State Police deputed for duty at Hafizpet Railway Station.
He was repatriated to Telangana state police department for necessary disciplinary…
— South Central Railway (@SCRailwayIndia) September 19, 2026
హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ పరిధిలో అమానుష ఘటన
హైదరాబాద్ – హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళను కొట్టి, ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన రైల్వే పోలీస్ కానిస్టేబుల్ (RPF) pic.twitter.com/b3xlFQNd1t
— Telugu Scribe (@TeluguScribe) September 18, 2026
