Telangana Politics : దానం నాగేందర్‌పై అనర్హత వేటుతో మిగిలిన వారిలో టెన్షన్.. మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరే వారెందరు? వాట్‌నెక్ట్స్..!
Telangana Politics : బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్ మీద కంటెస్ట్ చేయడాన్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. దానం ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అనర్హుడని తేల్చింది.
Telangana Politics
Telangana Politics : అవసరాలో.. అధికారం ఉందనో.. కారు దిగారు. హస్తం గూటికి వెళ్లారు. ఏకంగా పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. అధికార పార్టీలోకి వెళ్లిపోయారు. అందులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికలకు ముందే తిరిగి కారెక్కారు. లేటెస్ట్గా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు వేటు వేసింది.
Also Read : Warangal Airport: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. వరంగల్ ఎయిర్ పోర్టుపై కీలక అప్డేట్.. భూసేకరణ పూర్తి..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్ మీద కంటెస్ట్ చేయడాన్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. దానం ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అనర్హుడని తేల్చింది. 23 ఏప్రిల్ 2024 నుంచి దానం నాగేందర్ ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అనర్హుడు అంటూ తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటామని, తీర్పు సస్పెండ్ చేయాలని దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు కోరినా.. వారి అభ్యర్థనను తిరస్కరించింది న్యాయస్థానం. అయితే, దానం సుప్రీంకోర్టుకు వెళ్లినా.. హైకోర్టు తీర్పునే ఫాలో అవ్వాలని అత్యున్నత న్యాయస్థానం కూడా తేల్చిచెప్పే అవకాశం ఉందని లీగల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
అటు గూడెం తిగిరి కారెక్కేయంతో.. ఆయనపై వేటుకు ఆస్కారం లేదంటున్నారు. ఇక దానం ఎపిసోడ్లో నెక్స్ట్ ఉప ఎన్నికలేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేల సంగతేంటన్న చర్చ జరుగుతోంది. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ బీఆర్ఎస్తో టచ్‌లో ఉన్నట్లు ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ఈ ముగ్గురిని చేర్చుకునేందుకు బీఆర్ఎస్ హైకమాండ్‌కు కూడా పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చని అంటున్నారు. బాన్సువాడలో పోచారంపై పోటీ చేసి ఓడిన ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా గులాబీ గూటికి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో పోచారంను చేర్చుకోవాలా.? లేక ఏనుగు రవీందర్‌రెడ్డిని జాయిన్ చేసుకోవాలా అనేదానిపై బీఆర్ఎస్లోనూ డిస్కషన్స్ జరుగుతున్నాయట.
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేరికకు ఎలాంటి ఇబ్బందులు లేవని.. ఆయన కూడా కాంగ్రెస్‌లో కంఫర్ట్‌గా లేరని అంటున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను బీఆర్ఎస్లో చేర్చుకుంటే.. సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి హర్ట్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారట. ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్‌లో రాజేంద్రనగర్ నుంచి కంటెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్. సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటారు కాబట్టి.. కార్తీక్‌ను చేవెళ్ల ఎంపీగా పంపించే ఆలోచనలో కూడా బీఆర్ఎస్ ఉందట. ఈ ఈక్వేషన్‌తోనే కార్తీక్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ప్రకాశ్‌గౌడ్ రీఎంట్రీకి కూడా లైన్ క్లియర్ అవొచ్చు.
ఇక మిగతా ఎమ్మెల్యేల్లో తెల్లం వెంకట్రావు, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, డా.సంజయ్, కడియం శ్రీహరిలను మాత్రం పార్టీలో చేర్చుకునే ప్రశ్నే లేదని బీఆర్ఎస్ నేతలు తేల్చిచెప్తున్నారు. ఈ ఐదుగురిపై మరీ ముఖ్యంగా కడియం శ్రీహరిపై వేటుపడే వరకు లీగల్ ఫైట్‌ను కంటిన్యూ చేయాలని గులాబీ పార్టీ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరడమే కాదు.. ఆయనకు పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. చేవెళ్లలో కాలే యాదయ్యను, భద్రాచలంలో తెల్లం వెంకట్రావును కూడా తీసుకునే ఆలోచన లేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి కారెక్కేయడంతో డాక్టర్ సంజయ్‌కు కూడా కారులోకి నో ఎంట్రీ. మొత్తానికి బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో గులాబీ బాస్ ఆలోచన ఏంటో.? ఖైరతాబాద్‌కు బైఎలక్షన్ వస్తుందో, రాదో చూడాలి మరి.
