Botsa Anusha : వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. బొత్స కుమార్తె అనూషకు భీమిలి వైసీపీ ఇంఛార్జ్‌గా బాధ్యతలు
Botsa Anusha : మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూషకు వైసీపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జిగా అనూషను నియమిస్తూ శుక్రవారం రాత్రి వైసీపీ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది.
Botsa Anusha Appointed As Bheemili Constituency Ysrcp Incharge
Botsa Anusha : మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూషకు కీలక బాధ్యతలు అప్పగించారు. భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జిగా అనూషను నియమిస్తూ శుక్రవారం రాత్రి వైసీపీ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల సమన్వయం, నాయకులుకార్యకర్తలతో కలిసి పార్టీ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయ ప్రకటనలో తెలిపింది.
Also Read : AP Rains : దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. అలర్ట్ జారీ..
భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో భీమిలిలో వైసీపీకి కొత్త నాయకత్వం అవసరమైంది. ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును ఎదుర్కోగల సత్తా ఉన్న నాయకుడి కోసం వైసీపీలో చర్చలు జరిగాయి. చివరికి, సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష నియామకంతో ఈ సస్పెన్స్‌కు తెరపడింది.
భీమిలి నియోజకవర్గం పార్టీ ఇంఛార్జిగా బాధ్యతలు అప్పగించినందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనూష ధన్యావాదాలు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, భీమిలి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారంకు కృషి చేస్తానని అన్నారు. ఇటీవల బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. అనూష విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికల బరిలో ఉంటారని ప్రకటించారు. ఈలోపే మజ్జి శ్రీను వైసీపీని విచిడి టీడీపీలో చేరడంతో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో అనూషను భీమిలి నియోజకవర్గ ఇంఛార్జ్‌గా వైసీపీ అధిష్టానం నిమించింది.

