Nani : నాని మాటలు.. ఎందుకీ మంటలు..?
ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్స్‌లో హీరో నాని (Nani) చేసిన పాన్ ఇండియా కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి.
The Paradise movie promotions Hero Nani Comments About Pan India Movies
Nani : ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్స్‌లో హీరో నాని చేసిన పాన్ ఇండియా కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. సౌత్ సినిమాలకు మాత్రమే పాన్ ఇండియా అనే ట్యాగ్ ఎందుకు ప్రత్యేకంగా వినిపిస్తోందంటూ నాని వేసిన ప్రశ్నపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు మొదలయ్యాయి.
గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగా మార్కెట్‌ను విస్తరించుకున్న నేపథ్యంలో ఒక తెలుగు సినిమా ఐదు భాషల్లో విడుదలై, అన్ని ప్రాంతాల ప్రేక్షకులను టార్గెట్ చేస్తే దాన్ని పాన్ ఇండియా సినిమా అని పిలవడంలో తప్పేంటన్న చర్చ ఓవైపు నడుస్తోంది. పాన్ ఇండియా అనేది ఇప్పుడు ఒక మార్కెట్ ట్యాగ్ మాత్రమే కదా దానిపై ఇంత చర్చ ఎందుకు అంటూ కొందరు మూవీ మేకర్స్, హీరోలు తమ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు టాక్.
Pranita Subhash : నటి ప్రణీత సుభాష్ త్రోబ్యాక్ పిక్స్..
అయితే నాని మాటల వెనుక ఉద్దేశం వేరే ఉందని ఆయనకు దగ్గరగా ఉన్న వర్గాలు చెబుతున్నట్టు మాట. ఒక సినిమాను పాన్ ఇండియా అని పిలవడం కంటే సినిమా కంటెంట్ నచ్చి ఆడియన్స్ భాషతో సంబంధం లేకుండా థియేటర్లకు రావడమే అసలు విజయం అన్నదే నాని పాయింట్‌గా చెబుతున్నారు.
కానీ ఈ కామెంట్స్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం సోషల్ మీడియాలో పాన్ ఇండియా ట్యాగ్‌లో తప్పేముందనే చర్చ మొదలైంది. మరికొందరు మాత్రం నాని చెప్పింది కూడా ఆలోచించాల్సిన పాయింటేనంటున్నారు. దీంతో ఇది కేవలం ప్యారడైజ్ ప్రమోషన్లో వచ్చిన కామెంట్గానే ముగుస్తుందా.? లేక టాలీవుడ్లో ఇంకొందరు హీరోలు, మేకర్స్ కూడా తమ ఒపీనియన్స్‌ను వ్యక్తం చేస్తారా.? అన్నదే ఇప్పుడు అసలు టాపిక్‌గా మారింది. తన సినిమా రిలీజ్‌కి ముందే నాని మాట్లాడిన మాటలు మరో రకమైన హీట్‌ను క్రియేట్ చేశాయనే టాక్ మాత్రం గట్టిగానే వినిపిస్తోంది.
