APPSC FSO Recruitment 2026 : ఏపీలో జాబ్స్ పడ్డాయ్.. డిగ్రీ పాసైనా వారికే ఛాన్స్.. అప్లయ్ చేసే డేట్ ఇదే..!
APPSC FSO Recruitment 2026 : ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. అర్హతలు, ఎంపిక విధానం, పరీక్ష వివరాలను ఇప్పుడే తెలుసుకోండి.
APPSC FSO Recruitment 2026
- ఎఫ్ఎస్ఓ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా?
- ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..
- అక్టోబర్ 16 నుంచి దరఖాస్తులు.. పూర్తి వివరాలు
- అడవుల శాఖలో 26 ఉద్యోగాలు..
- డిగ్రీ అర్హతతో APPSC నోటిఫికేషన్
APPSC FSO Jobs : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు పడ్డాయి. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కీలక ప్రకటన చేసింది. ఏపీ ఫారెస్ట్ సబ్ ఆర్డినేట్ సర్వీస్‌లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు 2026 అక్టోబర్ 16 నుంచి ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న సంబంధిత విద్యార్హతలు ఉండాలి. డిగ్రీ, బీఈ, బీటెక్‌తో పాటు హార్టికల్చర్, జూలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, అగ్రికల్చర్ వంటి విభాగాల్లో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు 2026 నవంబర్ 5 రాత్రి 11:59 గంటలకు గడువు ముగుస్తుంది.
ఎఫ్ఎస్ఓ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ సింగిల్ పరీక్షతో పూర్తికాదు. ముందుగా ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష నిర్వహించనున్నారు. అనంతరం క్వాలిఫైయింగ్ టెస్ట్, వాకింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) వంటి దశలను అభ్యర్థులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అన్ని నిర్దేశిత దశల్లో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచే తుది ఎంపిక చేపట్టనున్నారు. అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించే ముందు అధికారిక నోటిఫికేషన్‌లోని విద్యార్హత, వయోపరిమితి, శారీరక ప్రమాణాలు, పరీక్ష విధానం, ఫీజు, సిలబస్ తదితర నిబంధనలను పూర్తిగా చదవాలి. అవసరమైన సర్టిఫికెట్లను ముందుగానే రెడీ చేసుకోవాలి.
అప్లికేషన్ ప్రాసెస్, వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు తదితర సమాచారాన్ని జాగ్రత్తగా రిజిస్టర్ చేయడం ద్వారా చివరి నిమిషంలో ఎదురయ్యే ఇబ్బందులను నివారించవచ్చు. అటవీ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఇదే అద్భుతమైన అవకాశం..
