Telangana Rains : అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు దంచికొట్టనున్న వానలు.. ఎల్లో అలర్ట్ జారీ..
Telangana Rains : తెలంగాణలో వారం రోజులుగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే, రాబోయే మూడు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
Telangana Rains
- తెలంగాణలో ప్రజలకు రెయిన్ అలర్ట్..
- మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు
- పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Telangana Rains : తెలంగాణలో వారం రోజులుగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తాజాగా. వాతావరణ శాఖ వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాన్ని ఆనుకొని ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Also Read : Smart Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
తెలంగాణలో కొద్దిరోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న మూడురోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదుకానున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చాలాచోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
ఆదివారం మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలతోపాటు.. కరీంనగర్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.
వర్షాలతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచించారు. అత్యవసరమై బయటకు వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం తరువాత మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. శనివారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లోని రహదారులు జలమయం అయ్యాయి. వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
