Gold Silver Price Today : పసిడి ప్రియులకు షాక్.. వరుసగా నాల్గోరోజు పెరిగిన గోల్డ్ రేటు.. తులంపై ఎంత పెరిగిందంటే?
Gold Silver Price Today : బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. గడిచిన నాలుగు రోజులుగా గోల్డ్ రేటు భారీగా పెరుగుతూ వస్తోంది.

Gold Silver Price Today : బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా నాల్గో రోజు గోల్డ్ రేటు పెరిగింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, డాలర్ కదలికలు వంటి పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపాయి. దీంతో దేశీయ మార్కెట్లోనూ పసిడి ధరలు నింగిని తాకుతున్నాయి.

గడిచిన నాలుగు రోజులుగా గోల్డ్ రేటు పెరుగుతూ వస్తోంది. ఈ నాలుగు రోజుల్లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై సుమారు రూ. 8వేలు పెరుగుదల చోటు చేసుకుంది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1090 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. వెయ్యి పెరిగింది. వెండి ధర స్వల్పంగా తగ్గగా.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేటు భారీగా పెరిగింది. ఔన్సు బంగారంపై 103 డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ రేటు 4,343 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,52,350 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,39,650 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,52,550 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,39,850 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,52,350కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,39,650 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,50,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,45,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు
