China Earthquake : చైనా-నేపాల్ సరిహద్దుల్లో భారీ భూకంపం.. నేపాల్లో రెడ్అలర్ట్.. తీవ్ర భయాందోళనలో ప్రజలు
Massive Earthquake in China : చైనా - నేపాల్ సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.1గా భూకంపం తీవ్రత నమోదైంది.
Massive Earthquake in China
Massive Earthquake in China : చైనా – నేపాల్ సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.1గా భూకంపం తీవ్రత నమోదైంది. భూకంపం నేపథ్యంలో నేపాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరోసారి మెరుపు వరదలు వచ్చే అవకాశం ఉందని, మొన్నటి కంటే ఐదు రెట్ల తీవ్రతతో భారీ వరదలు వస్తాయని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనతో పరుగులు తీస్తున్నారు. ఎత్తయిన ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
Also Read : Gold Silver Price Today : రాఖీ పండుగ వేళ మహిళకు శుభవార్త.. భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. తులం ఎంతంటే?
మరోవైపు.. వరద ముప్పు హెచ్చరికల నేపథ్యంలో టిబెట్ లో చైనా రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేసింది. గైరాంగ్ పోర్టు వద్ద ఎగువ నుంచి వచ్చే ప్రవాహాన్ని అధికారులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. నేపాల్ సరిహద్దుల్లోని సరస్సు పొంగిపొర్లుతోందని చైనా మీడియా పేర్కొంది. అందుకే సహాయక చర్యలు నిలిపివేసినట్లు వెల్లడించింది.
