Hyderabad : యువ హీరో ఫామ్‌హౌజ్‌లో పేకాట గుట్టురట్టు..రూ.6 లక్షల 77 వేలు, 20 కార్లు స్వాధీనం

హైదరాబాద్‌ శివార్లలో పేకాటను ఎస్ఓటీ పోలీసులు గుట్టురట్టు చేశారు. నార్సింగిలోని మంచిరేవులలోని ఓ యువహీరో ఫామ్‌హౌజ్‌పై దాడులు చేశారు. పేకాట ఆడుతున్న 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad : యువ హీరో ఫామ్‌హౌజ్‌లో పేకాట గుట్టురట్టు..రూ.6 లక్షల 77 వేలు, 20 కార్లు స్వాధీనం

Cards Playing

playing cards at young hero’s farmhouse : హైదరాబాద్‌ శివార్లలో పేకాటను ఎస్ఓటీ పోలీసులు గుట్టురట్టు చేశారు. నార్సింగిలోని మంచిరేవులలోని.. ఓ యువహీరో ఫామ్‌హౌజ్‌పై దాడులు చేశారు. పేకాట ఆడుతున్న 20 మందిని అదుపులోకి తీసుకున్న స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ వారిని నార్సింగి పోలీసులకు అప్పగించారు. నిందితుల నుంచి 6 లక్షల 77 వేల నగదు, స్వైపింగ్‌ మిషన్లు, సెల్‌ఫోన్లు, ల్యాప్‌ టాప్‌లతో పాటు 20 కార్లు స్వాధీనం చేసుకున్నారు.

ఓ యువ హీరో ఫామ్‌ హౌస్‌ను ఐదేళ్ల కోసం లీజుకు తీసుకున్నట్టు సమాచారం. ఇందులో గుత్తా సుమన్‌ కుమార్‌ పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. పేకాటకు సంబంధించి కీలక సూత్రధారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పేకాట వ్యవహారంపై ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు చిక్కినవారిలో.. పలువురు ప్రముఖులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఉన్నట్లు తెలుస్తోంది.

Petrol, Diesel Prices : ఆగని పెట్రో బాదుడు..దేశంలో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

రాజేంద్రనగర్ పరిధిలోని మంచిరేవుల వద్ద ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో.. నిన్న రాత్రి ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఈ ఫామ్‌హౌజ్‌ను తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ యువ హీరో లీజుకు తీసుకొన్నాడని పోలీసులు గుర్తించారు.

ఈ వ్యవహరం ఆ హీరోకు తెలిసే జరుగుతుందా..? లేదా..? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేసే సమయంలో.. ఫామ్‌హౌస్‌లో చాలా మంది ఉన్నట్లు సమాచారం. పోలీసుల వచ్చిన విషయాన్ని గుర్తించిన కొందరు.. అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.