Petrol, Diesel Prices : ఆగని పెట్రో బాదుడు..దేశంలో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

నవంబర్ లో మొదటి రోజు నుంచే పెట్రో బాదుడు మొదలైంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. చమురు ధరలు తొలిసారిగా 40 పైసలకు పైగా పెరిగాయి.

Petrol, Diesel Prices : ఆగని పెట్రో బాదుడు..దేశంలో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol

petrol and diesel prices : నవంబర్ లో మొదటి రోజు నుంచే పెట్రో బాదుడు మొదలైంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. చమురు ధరలు తొలిసారిగా 40 పైసలకు పైగా పెరిగాయి. హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ పై 41 పైసలు, డీజిల్ పై 42 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.114.13 డీజిల్ రూ.107.40కు చేరింది.

ఢిల్లీలో లీటరు పెట్రోల్ పై 35 పైసలు, డీజిల్ పై 35 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.109.69 డీజిల్ రూ.98.42కు చేరింది. ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ.115.50, డీజిల్ రూ.106.62కు పెరిగింది. కోల్ కతాలో లీటర్ పెట్రోల్ రూ.110.15, డీజిల్ రూ.101.56కు చేరింది. చెన్నై లో లీటర్ పెట్రోల్ రూ.106.35, డీజిల్ రూ.102.59కు పెరిగింది.

Dantewada Encounter..ముగ్గురు మహిళా నక్సల్స్ మృతి

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లోని పలు పట్టణాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.120, డీజిల్ ధర రూ.110కు పెరిగింది. అక్టోబర్ నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు 24 సార్లు పెరిగాయి. ఇప్పటివరకు అక్టోబర్ నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.7 పెరిగాయి.

దేశంలో 14 రాష్ట్రాల్లో లీటర్ డీజిల్ ధర రూ.100 దాటింది. కేరళ, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, బెంగాల్, జమ్మూకాశ్మీర్ లేహ్‌లో డీజిల్ ధర రూ.100 దాటింది.

T20 World Cup 2021: పాక్ మ్యాచ్‌లో వైఫల్యం.. రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటంతో భారత్ లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 85 డాలర్ల కు చేరింది. సెప్టెంబర్ నెల నుంచి అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 9-10 డాలర్లు పెరిగింది.