Dantewada Encounter..ముగ్గురు మహిళా నక్సల్స్ మృతి

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని దంతేవాడ జిల్లాలో ఆదివారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు మ‌హిళా నక్సలైట్లు మృతి చెందారు. ఆదివారం సాయంత్రం 6గంటల సమయంలో కాటే క‌ల్యాణ్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని

Dantewada Encounter..ముగ్గురు మహిళా నక్సల్స్ మృతి

Dantewada (1)

Updated On : October 31, 2021 / 11:22 PM IST

Dantewada Encounter ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని దంతేవాడ జిల్లాలో ఆదివారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు మ‌హిళా నక్సలైట్లు మృతి చెందారు. ఆదివారం సాయంత్రం 6గంటల సమయంలో కాటే క‌ల్యాణ్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని అద్వాల్‌, కుంజేరా గ్రామాల మ‌ధ్య గ‌ల అట‌వీ ప్రాంతంలో డిస్ట్రిక్స్ రిజర్వ్ గార్డ్(DRG) సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్న సమయంలో నక్సలైట్లు తార‌స‌ప‌డ్డార‌ని జిల్లా ఎస్పీ అభిషేక్ ప‌ల్ల‌వ పీటీఐకి తెలిపారు.

ఈ క్రమంలో పోలీసులకు –నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మహిళా నక్సలైట్లు మృతి చెందిరని తెలిపారు. మ‌ర‌ణించిన వారిని రాజే ముచక్కి, గీతా మార్కాం, భీమే నుప్పో అలియాస్ జ్యోతి అని గుర్తించిన‌ట్లు అభిషేక్ ప‌ల్ల‌వ చెప్పారు. ఈ ముగ్గురిపై కలిపి రూ.15 ల‌క్ష‌ల రివార్డు ఉంద‌ని తెలిపారు. ఘటన స్థలంలో బోర్‌ రైఫిల్‌, రెండు నాటు తుపాకులు, ఐఈడీ వైర్‌, మావోయిస్టు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ALSO READ Manmohan Singh : ఎయిమ్స్ నుంచి మన్మోహన్ సింగ్ డిశ్చార్జ్