Manmohan Singh : ఎయిమ్స్ నుంచి మన్మోహన్ సింగ్ డిశ్చార్జ్

అనారోగ్యానికి గురైన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కోలుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి ఆదివారం రాత్రి మన్మోహన్ సింగ్ డిశ్చార్జి అయ్యారు.

Manmohan Singh : ఎయిమ్స్ నుంచి మన్మోహన్ సింగ్ డిశ్చార్జ్

Mamohan2

Updated On : October 31, 2021 / 11:02 PM IST

Manmohan Singh  అనారోగ్యానికి గురైన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కోలుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి ఆదివారం రాత్రి మన్మోహన్ సింగ్ డిశ్చార్జి అయ్యారు. మన్మోహన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడంతో ఆయన కుటుంబంతో పాటు కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఈనెల 13న తీవ్ర జ్వరం, అలసటతో మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే టెస్ట్ లలో మన్మోహస్ సింగ్ కు డెంగీ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అప్పటి నుంచి మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లోనే ఉండి ట్రీట్మెంట్ పొందుతుతున్నారు. ఎయిమ్స్ లోని కార్డియో న్యూరో సెంటర్​లోని ప్రైవేట్ వార్డులో మన్మోహన్ సింగ్‌కు చికిత్స అందించారు డాక్టర్లు.

ప్రస్తుతం కోలుకోవడంతో ఆయనను డిశ్చార్జ్‌ చేశారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌ లో కరోనా వైరస్ బారిన పడిన మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌ లో చేరిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నెల రోజుల పాటు చికిత్స పొందిన తర్వాత మన్మోహన్ డిశ్చార్జ్ అయ్యారు.

ALSO READ Pawan Kalyan: విశాఖలో పవన్ ర్యాలీ.. వెల్లువలా కదలిన జన సైనికులు