Man Attacked Girl : పెళ్లికి నిరాకరించడంతో.. 16 ఏళ్ల బాలికపై దాడి చేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన 47 ఏళ్ల వ్యక్తి

ఛత్తీస్ గఢ్ రాయ్ పూర్ లో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని 16 ఏళ్ల బాలికపై 47 ఏళ్ల వ్యక్తి పదునైన ఆయుధంతో దాడి చేసి జుట్టుపట్టుకుని నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు.

Man Attacked Girl : పెళ్లికి నిరాకరించడంతో.. 16 ఏళ్ల బాలికపై దాడి చేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన 47 ఏళ్ల వ్యక్తి

ATTACK

Man Attacked Girl : ఛత్తీస్ గఢ్ రాయ్ పూర్ లో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని 16 ఏళ్ల బాలికపై 47 ఏళ్ల వ్యక్తి పదునైన ఆయుధంతో దాడి చేసి జుట్టుపట్టుకుని నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్ పూర్ లోని గుఢియారీ ప్రాంతంలో ఓంకార్ తివారీ అలియాస్ మనోజ్ అనే వ్యక్తి ఓ దుకాణం నడుపుతున్నాడు. కొంతకాలంగా అతని వద్ద ఓ 16 ఏళ్ల బాలిక పనిచేస్తోన్నారు.

అయితే వివిధ కారణాల రీత్యా తాను ఉద్యోగం మానేస్తానని అతనికి బాలిక చెప్పారు. అందుకు అతడు ఒప్పుకోకపోగా, శనివారం సాయంత్రం ఆ బాలిక ఇంటికి వెళ్లాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీనికి ఆ బాలికతోపాటు ఆమె తల్లి నిరాకరించారు. అతడు ఆగ్రహంతో బాలికపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె జుట్టు పట్టుకుని అందరూ చూస్తుండగా నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఈ అమానవీయ ఘటనను కొంతమంది తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Killed live-in partner: పెళ్లికి ఒప్పుకోలేదని లివింగ్ పార్ట్‭నర్ గొంతు కోసిన మహిళ

ఈ వీడియో వైరల్ అవ్వడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బాలికను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని రాయ్ పూర్ సీనియర్ ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.