Killed live-in partner: పెళ్లికి ఒప్పుకోలేదని లివింగ్ పార్ట్‭నర్ గొంతు కోసిన మహిళ

‘‘రోజువారి తనిఖీల్లో భాగంగా ఆదివారం రాత్రి టీలా మోడ్ పోలీసులు చెకింగ్ చేపట్టారు. ఒక మహిళ నల్లటి ట్రాలీ బ్యాగ్‭ను తీసుకెళ్తుండడాన్ని గమనించి పరిశీలించగా అందులో ఒక వ్యక్తి మృతదేహం కనిపించింది’’ అని సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ మునిరాజ్ సోమవారం తెలిపారు. అనంతరం ప్రీతిని అదుపులోకి తీసకుని విచారించగా.. ఫిరోజ్‭తో తాను సహజీవనంలో ఉన్నానని, తనను పెళ్లి చేసుకుందామని అనుకున్నట్లు వెల్లడించింది.

Killed live-in partner: పెళ్లికి ఒప్పుకోలేదని లివింగ్ పార్ట్‭నర్ గొంతు కోసిన మహిళ

Woman sluts live-in partner throat for reffusing marriage

Killed live-in partner: పెళ్లికి ఒప్పుకోలేదని లివింగ్ పార్ట్‭నర్ గొంతు కోసింది ఒక మహిళ. ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‭లో జరిగిందీ ఘటన. కాగా, నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఘజియాబాద్ పోలీసులు సోమవారం తెలిపారు. ప్రియుడిని హతమార్చి అతడి మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్‭లో వేసి తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితురాలి పేరు ప్రీతి శర్మ అని, నాలుగేళ్ల క్రితం తన భర్తతో విడిపోయిన ప్రీతి.. కొద్ది రోజులుగా ఫిరోజ్ అలియాస్ చ్వన్ని(23)తో సహజీవనం చేస్తోందని వారు వెల్లడించారు.

‘‘రోజువారి తనిఖీల్లో భాగంగా ఆదివారం రాత్రి టీలా మోడ్ పోలీసులు చెకింగ్ నిర్వహించారు. ఒక మహిళ నల్లటి ట్రాలీ బ్యాగ్‭ను తీసుకెళ్తుండడాన్ని గమనించి పరిశీలించగా అందులో ఒక వ్యక్తి మృతదేహం కనిపించింది’’ అని సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ మునిరాజ్ సోమవారం తెలిపారు. అనంతరం ప్రీతిని అదుపులోకి తీసకుని విచారించగా.. ఫిరోజ్‭తో తాను సహజీవనంలో ఉన్నానని, తనను పెళ్లి చేసుకుందామని అనుకున్నట్లు వెల్లడించింది. అయితే వేరే కమ్యూనిటీ పేరుతో పెళ్లికి అతడి తల్లిదండ్రులు అంగీకరించలేదని పేర్కొంది.

దీంతో ఫిరోజ్‭పై ఒత్తిడి తీసుకువచ్చినప్పటికీ పెళ్లికి అంగీకరించలేదట. పైగా ఆమె క్యారెక్టర్‭లెస్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆవేశంతో రేజర్‭తో గొంతు కోసినట్లు వెల్లడించింది. అనంతరం అతడి మృతదేహాన్ని ఒక ట్రాలీ బ్యాగ్‭లో సర్ది బయట ఎక్కడైనా పడేయాలని బయల్దేరి పోలీసులకు చిక్కినట్లు విచారణలో పేర్కొంది. ప్రీతిని ఘజియాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని తనిఖీల్లో పట్టుకున్నట్లు పోలీసులు తమ రికార్డుల్లో పేర్కొన్నారు.

MP Crime : చెట్టుకు వేలాడుతున్న ముగ్గురు అక్కచెల్లెళ్ల మృతదేహాలు..హత్యలా? ఆత్మహత్యలా..?!